దేవర.. పాదఘట్టం 2గా మిగిలిపోతుందా?
దేవర రిలీజ్ కోసం ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ ఇప్పటికే అంచనాలు పెంచేసింది. బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతరే అని ఫ్యాన్స్ ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారరు. ఐతే ఇన్నర్ సోర్సెస్ సమాచారాన్ని బట్టి ఇది పూర్తిగా ఫాన్స్ మూవీ అని... పబ్లిక్ మూవీ కాదని తెలుస్తోంది.
దేవర రిలీజ్ కోసం ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ ఇప్పటికే అంచనాలు పెంచేసింది. బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతరే అని ఫ్యాన్స్ ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారరు. ఐతే ఇన్నర్ సోర్సెస్ సమాచారాన్ని బట్టి ఇది పూర్తిగా ఫాన్స్ మూవీ అని… పబ్లిక్ మూవీ కాదని తెలుస్తోంది. గ్రాఫిక్స్, సీజీ వర్క్ అంతంత మాత్రంగానే ఉన్నాయట. దేవర పార్ట్ వన్‌లో జాహ్నవి కపూర్ కేవలం ఏడు నిమిషాలే కనిపిస్తుందని టాక్. విలన్ బాబీ డియోల్.. పార్ట్ వన్‌లో కనిపించడు అని తెలుస్తోంది. కథా బలం కూడా పెద్దగా లేదని.. ఎన్టీఆర్ డబుల్ రోల్, షార్క్ చేపతో ఫైట్ అద్భుతం అనుకున్నా.. గ్రాఫిక్స్ మాత్రం గొప్పగా లేవని తెలుస్తోంది.
కథ విషయానికొస్తే… మూడు మత్స్యకార గ్రామాల మధ్య కథ. దీనిలో ఒక గ్రామానికి ఎన్టీఆర్ పెద్దగా వ్యవహరిస్తే… మరో గ్రామానికి సైఫ్ అలీ ఖాన్ నాయకుడిగా ఉంటారు. కథ మొత్తం ప్రకాష్ రాజ్ ద్వారా చెప్పిస్తాడు దర్శకుడు. సముద్రం ద్వారా ఆయుధాలను ఒడ్డుకు చేరవేసే మత్స్యకార గ్రామాల మధ్య కథ ఇది. ఆయుధాల వలన దేశంలో తీవ్రవాద శక్తులు పెరుగుతున్నాయని… జనం ప్రాణాలు పోతున్నాయని… అరాచకం ప్రబలిపోతుందని… ఒక గ్రామానికి పెద్దాయన దేవర గుర్తిస్తాడు. రూపాయల కోసం కక్కుర్తి పడితే దేశమే సర్వనాశనం అవుతుందని… తీవ్రవాద శక్తులు చేతుల్లోకి వెళ్లిపోతుందని తెలుసుకుంటాడు. ఇక నుంచి ఆయుధాలు చేరవేసే పని నిలిపివేయాలన్నది దేవర ఆజ్ఞ. దానిని మిగిలిన ఇద్దరూ అతిక్రమిస్తారు. అప్పుడు దేవర అసలు రూపం చూస్తారు.
సముద్రపు నీటిని రక్తంలాగా రంగు మారుస్తాడు దేవర. అంత విధ్వంసం సృష్టిస్తాడు. సముద్రానికి పైకి ఎవరు వెళ్లడానికి ధైర్యం చేయరు. ఇలాంటి టైమ్‌లో సడెన్‌గా దేవర మాయమైపోతాడు. దేవర ఉన్నాడా లేదా అన్న తెలియదు. దేవర సముద్రంలోనే ఉన్నాడని… అతనికి శక్తులు ఉన్నాయని… ఒక షార్క్ చాపపై తిరుగుతూ ఉంటాడని… ఆ గ్రామాలు నమ్ముతూ ఉంటాయ్. దేవర కొడుకు పెద్దవాడు అవుతుంటాడు. అతను మరో ఎన్టీఆర్. చాలా అమాయకంగానూ, భయం భయం గాను… కనీసం ఆడపిల్ల కవ్విస్తే సమాధానం చెప్పలేనంత అర్బకుడిగాను ఊర్లో తిరుగుతూ ఉంటాడు. అందరూ అసలు వీడు దేవరకు పుట్టిన కొడుకేనా అని అనుమాన పడుతూ ఉంటారు. చివర్లో మొత్తం బయట పడుతుంది.
అసలు దేవర లేడని.. దేవర పరంపరను కొనసాగిస్తూ అతని కొడుకే… ఎవ్వడు సముద్రంపై అడుగుపెట్టినా…. వాళ్లను లేపేస్తూ సముద్రాన్ని కాపాడుతుంటాడని తెలుస్తుంది. మరి దేవర ఏమయ్యాడు.. దేవరని ఎవరు చంపారు అన్నది సెకండ్ పార్ట్‌లో బయటకు రాబోతుంది. సెకండ్ పార్ట్‌లో బాబీ డియోల్ పాత్ర బయటకి వస్తుంది. మనిషికి బతికే అంత ధైర్యం చాలు… చంపేంత ధైర్యం అవసరం లేదు…. కాదు కూడదు అని మీరా ధైర్యాన్ని కూడగడితే… ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా. ఈ డైలాగ్ వినడానికి బాగున్నా.. జనానికి మాత్రం గుర్తు ఉండదు. అసలు అర్థం చేసుకోవడమే చాలా కష్టంగా ఉంది.
ట్రైలర్‌లో ఈ డైలాగ్ పైనే మొత్తం నడిపించారు. సినిమా మొత్తం ధైర్యం, భయమే చుట్టే తిరుగుతాయనేది జనాలకు అప్పుడే అర్థమైపోతుంది. అందుకే ముందు ఉన్నంత ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు లేవు. క్రమంగా తగ్గిపోతున్నాయ్. దేవరని సంపాలంటే సమయమే కాదు… సరైన ఆయుధం కూడా దొరకాలా. ఈ డైలాగ్ మాత్రమే జనానికి అర్థం అవుతుంది. అందుకే చిరంజీవి ఆచార్యని అట్టర్ ప్లాప్ చేసిన పాదఘట్టం కథ మళ్లీ రిపీట్ అవుతుందేమోనని ఫ్యాన్స్ వణికిపోతున్నారు. రెండో పార్ట్ సంగతి దేవుడెరుగు.. మొదటి పార్ట్ గట్టెక్కుతుందా లేదా అని చర్చించుకుంటున్నారు. డైరెక్టర్ కొరటాల శివ క్రియేషన్స్… కొన్నిసార్లు జనం ఊహలకు అందవు. ఇప్పుడు అదే భయం అందరినీ పీడిస్తోంది. ట్రైలర్లు, టీజర్లు చూస్తే ఏదో జరగొచ్చు అనే భయం వెంటాడుతోంది. ఫ్యాన్స్ ధైర్యంగా ఉండలేకపోతున్నారు.