నటసింహం బాలయ్య బాబాయ్ తో అబ్బాయ్ ఎన్టీఆర్ కి ఉన్న గ్యాప్ తగ్గిపోతోందన్నారు. తన అన్ స్టాపబుల్ కొత్త సీజన్ తొలి ఎపిసోడ్ ఎన్టీఆర్ తోనే అన్నారు. ఆల్రెడీ ఇప్పుటి సీజన్ లోనే లాస్ట్ ఎపిసోడ్ తనతో ప్లాన్ చేసి, తర్వాత ఎందుకో ఆ ఐడియాను పోస్ట్ పోన్ చేశారని కూడా ప్రచారం జరిగింది. కట్ చేస్తే ఇప్పుడు ఈ బాబాయ్ కి ఆ అబ్బాయ్ కి మధ్య పుల్లేస్తున్నారా? పుకార్లతో మరింతగా గ్యాప్ పెంచేస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలు రావటానికి ఒకటే కారణం, అన్ స్టాపబుల్ షోలో ఎవరూ ఎన్టీఆర్ పేరెత్తకూడదు.. అలా ఎత్తకుండా గెస్టులందర్ని ప్రిపేర్ చేయమంటూ బాలయ్యే తన స్టాప్ కి పురమాయించాడనే ప్రచారం మొదలైంది. నిజానికి ఎన్టీఆర్ మనిషి వైసీపిలో ఉన్నా తనెప్పుడు టీడీపీ వ్యక్తినే అని ఎన్నో సార్లు తేల్చాడు. ఆల్రెడీ ఇప్పుడు బాబాయ్ కి దగ్గరయ్యేందుకు పాజిటివ్ సిగ్నల్స్ ని కూడా అబ్బాయ్ పంపించాడన్నారు. ఇంతలో ఇదేం దిక్కుమాలిన ప్రచారమని ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఇంతకి ఏం జరిగింది? ఏంజరుగుతోంది? మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేరు ఎట్టి పరిస్థితుల్లో బాలయ్య షో అన్ స్టాపబుల్ లో వినిపించకూడదు... వినిపిస్తే ఇక అంతే సంగతులు... ఇది బాలయ్య మాట అంటూ సోషల్ మీడియాలో పెరిగిన ప్రచారం.విచిత్రం ఏంటంటే బాలయ్య షో అన్ స్టాపబుల్ కి ఎవరు వచ్చినా, తన షోలో ఎట్టి పరిస్థితుల్లో ఎన్టీఆర్ పేరు వాడకూడదు.. అందుకు తగ్గట్టు గెస్ట్ లను ప్రిపేర్ చేయమంటూ అన్ స్టాపబుల్ షో ఎంప్లాయ్స్ కి ఇన్ స్ట్రక్షన్స్ వెళ్లాయని, సోషల్ మీడియాలో భారీ ప్రచారమే జరుగుతోంది. కాని ఇది నిజమేనా? చాలా కాలంగా నందమూరి ఫ్యామిలీకీ, మరీ ముఖ్యంగా బాలయ్యకి ఎన్టీఆర్ దూరమయ్యాడన్నారు. నిజంగానే బాబాయ్ అబ్బాయ్ మధ్య కాస్త గ్యాప్ ఉన్న ఫీలింగ్ కూడా కలిగేలా పరిస్థితులు కనిపించాయి.తన ఫ్రెండ్ నాని వైసీపీలో ఉండటం కూడా ఒక కారణం అని, చాలా సందర్భాల్లో నందమూరీ ఫ్యామిలీస్ కి సపోర్టీవ్ గా ఎన్టీఆర్ రియాక్ట్ కాకుండా సైలెన్స్ మేయింటేన్ చేశారంటారు. బాలయ్య కూడా ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ ని కూడా దూరం పెట్టారన్నారు రియాలిటీకొస్తే ప్రతీ ఫ్యామిలీలో చిన్న చిన్న గ్యాప్స్ కామన్. అలాంటి గ్యాప్స్ ఇక్కడ బాబాయ్ అబ్బాయ్ మధ్య ఉందనే అభిప్రాయముంది. ఈమధ్య బాబాయ్ కి అబ్బాయ్ దగ్గరయ్యే ప్రయత్నాలు కూడా చేశాడనంటున్నారు. అందుకనుగునంగానే అన్ స్టాపబుల్ షోలో ఈ సీజన్ లాస్ట్ ఎపిసోడ్ ని ఎన్టీఆర్ తో ప్లాన్ చేశారు కూడా. అది ఈ ఎపిసోడ్ కోసం రెడీ చేసి ప్రశ్నా పత్రం వల్లే లీకైందనే టాక్ కూడా వచ్చింది కట్ చేస్తే మరి ఆ ఎపిసోడ్ ప్లానింగ్ ఏమైందో, కొత్త సీజన్ కోసం వాయిదా పడిందో కాని, ఇంతలో తన షోకి వచ్చే ఏ గెస్ట్ కూడా తారక్ పేరు పలకకూడదని బాలయ్య అన్నట్టు ప్రచారం మొదలైంది. దీనికి తోడు ఇదే నిజం కాకపోతే, ఎన్టీఆర్ తో జైలవకుశ మూవీ తీసిన బాబీ ఎందుకు, డాకూ మహారాజ్ ప్రమోషన్ టైంలో, ఆ మూవీ పేరుకూడా ఎత్తలేదనే డౌట్ రేయిజ్ చేశారు. ఇది ఎంత అన్ స్టాపబుల్ షోనే అయినా, బాలయ్య తో మూవీ తీస్తే నటసింహం గురించే మాటలొస్తాయి కాని, అందులో ఎందుకు ఎన్టీఆర్ ప్రస్థావన ఉంటుంది... ఇది కామన్ సెన్స్ లెవల్ ఆన్సర్.. బాబాయ్ అబ్బాయ్ మధ్య గ్యాప్ లేదని ఎవరూ అనుకోరు కాని, ఇద్దరి మధ్య గ్యాప్ తగ్గేలా ఉందనేలా కూడా పరిస్థితులు కూడా ఎవరూ పక్కన పెట్టలేరు.. కాని జరగాల్సిన ప్రచారం మాత్రం జరుగుతోంది. వీళ్ల మధ్య పుల్ల పెట్టి పండగ చేసుకునే బ్యాచ్ ఎటాక్ పెరిగింది. [embed]https://www.youtube.com/watch?v=4KgsCLZuk1M[/embed]