వార్ 2 డైరెక్టర్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్.. ఇంకెన్నాళ్ళు రా..?
ఈ రోజుల్లో సినిమాలు చేయడం కంటే, సినిమాల గురించి అప్డేట్స్ ఇవ్వడం ముఖ్యం. ఏ సినిమా చేసిన సరే దాని గురించి ఏదో ఒక అప్డేట్ సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ ఉంటారు.

ఈ రోజుల్లో సినిమాలు చేయడం కంటే, సినిమాల గురించి అప్డేట్స్ ఇవ్వడం ముఖ్యం. ఏ సినిమా చేసిన సరే దాని గురించి ఏదో ఒక అప్డేట్ సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇక ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తూ ప్రమోషన్ చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది డైరెక్టర్లు మాత్రం ఈ మధ్యకాలంలో సినిమాల గురించి అప్డేట్స్ ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారు. అందులో రాజమౌళి ముందు వరుసలో ఉంటాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమా విషయంలో ఎటువంటి అప్డేట్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయడం లేదు.
రీసెంట్ గా సినిమా స్టార్ట్ అవుతుంది అనే అప్డేట్ ఒకటి వచ్చింది. కెన్యాలో షూటింగ్ లొకేషన్స్ ఫైనల్ చేసే అప్డేట్ ఒకటి ఇచ్చాడు. ఇక హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను తీసుకున్న విషయాన్ని కూడా అఫీషియల్ గా ఎక్కడా అనౌన్స్ చేయలేదు రాజమౌళి. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ రాజమౌళి పై కాస్త సీరియస్ గానే ఉన్నారు. ఇక రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు జుట్టు పెంచటం కాస్త హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత మళ్లీ జుట్టు కట్ చేయడం సెన్సేషన్ అయింది. అసలు ఏం చేస్తున్నాడో కూడా జనాలకు క్లారిటీ లేదు.
ఇక ఇప్పుడు ఎన్టీఆర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. వార్ 2 సినిమా కోసం బాలీవుడ్ వెళ్లిన ఎన్టీఆర్, ఆ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ గట్టిగానే కష్టపడ్డాడు. దాదాపు 3 నెలల నుంచి అక్కడే షూటింగ్ చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్న సరే.. ఆ సినిమాను సీరియస్ గా తీసుకుని బాలీవుడ్ లో పాగా వెయ్యడానికి కష్టపడుతున్నాడు. అయితే ఇప్పటివరకు అసలు ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుంది.. ఎన్టీఆర్ పాత్ర ఏంటి.. లేదంటే అసలు ఎన్టీఆర్ సినిమాలో నెగిటివ్ రోల్ చేస్తున్నాడా పాజిటివ్ రోల్ చేస్తున్నాడా అనేది ఎక్కడ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ లేదు.
మీడియాలో వచ్చిన వార్తల్లో ఎన్టీఆర్ నెగటివ్ రోల్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ లుక్ కూడా బయటకు రావడం లేదు. దీనితో ఈ సినిమా డైరెక్టర్ అయాన్ ముఖర్జీని ఎన్టీఆర్ ఫ్యాన్స్ బూతులు తిట్టడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ఇప్పుడు అయాన్ టార్గెట్ గా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ అవుతుంది. ఇందుకోసం ఎన్టీఆర్ కు దాదాపుగా 45 కోట్లు ఆఫర్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. సినిమాకు.. సౌత్ ఇండియాలో మార్కెట్ కోసమే ఎన్టీఆర్ ను తీసుకున్న అయాన్ ముఖర్జీ.. కనీసం ఎన్టీఆర్ గురించి చిన్న అప్డేట్ కూడా ఇవ్వకపోవడం పట్ల ఫ్యాన్స్ గరం గరంగా ఉన్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దాదాపు 60% కి పైగా సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. త్వరలోనే మరి కొంత షూటింగ్ కూడా కంప్లీట్ చేయనున్నారు.