ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు… పెద్ద కుట్రే ఉందా..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 7, 2024 | 07:45 AMLast Updated on: Aug 07, 2024 | 7:45 AM

Ntr Fans New Strategy

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మీద ఎటాక్ జరుగుతోంది. దేవర మూవీ రెండో సాంగ్ రాకముందునుంచే, పోస్టర్ వచ్చినప్పటి నుంచే పగడ్బందీగా కామెంట్లు, ట్రోలింగ్స్ షురూ చేశారు. ఏదైనా పుస్తకం చదివి అది బాగుందో లేదో చెప్పాలి. సినిమాను చూసి రివ్యూ ఇవ్వాలి. ఇంకా రిలీజ్ కాని సినిమాకు ముందే రివ్యూ ఇచ్చినట్టు, దేవర రెండో సాంగ్ రాకముందే, ఏదో తేడాగా ఉందే అనే ఆర్టికల్స్ నెట్ లోకనిపించాయి

కొన్ని సైట్లు, ముఖ్యంగా సోషల్ మీడియాలోకొన్ని బ్యాచులు మ్యాన్ ఆఫ్ మాసెస్ లుక్ మీద డౌట్లు, కామెంట్లు రేయిస్ చేశారు. అదంతా ఒక ఎత్తైతే, దేవర రెండోసాంగ్ చుట్టమల్లే పాట కాపీ అంటూ కామెంట్లు పెంచారు. నిజం చెప్పాలంటే తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన పాటలకు కాపీ కామెంట్లు కామన్. కాని అనిరుధ్ కి అలాంటి గోల లేదు…

ఏదో ఒకటి అర తనకి కామెంట్ల ట్రోలింగ్ గతంలో ఎదురైనా, మరీ తమన్ రేంజ్ లో మాత్రం పరిస్థితులు పగపట్టలేదు. కాని దేవర రెండో సాంగ్ చెట్టమల్లే లిరికల్ వీడియోరాగానే, ఇది శ్రీలంకన్ సాంగ్ మనికే మగే హితే కి కాపి అంటున్నారు. నిజం చెప్పాలంటే చుట్టమల్లే సాంగ్ మధ్యలో ఒకటి రెండు చరణాలు కొంచెం మనికే మగే హితేలా అనిపించాయి. కాని ఓవరాల్ సాంగ్ ఫ్రెష్ కిక్ ఇచ్చింది

నిజానికి గుంటూరు కారం మూవీ సాంగ్ కుర్చీ మడతపెట్టి పాట కూడా మద్యలో అత్తారింటికి దారేది సాంగ్ స్టైల్లోకి వెళ్లినట్టే కనిపించి, తర్వాత యదాతధంగా ఉంటుంది. ఇలా కొన్ని సార్లు ట్యూన్లు ఎక్కడో అక్కడ కొంత సింగ్ అవ్వొచ్చు.. అంతమాత్రానికే కాపీ అనటం చూస్తుంటే, వంకపెట్టడానికి బురద చల్లటానికి ఏ ఛాన్స్ చిక్కుతుందా అని యాంటీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నట్టే ఉంది…