మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేకుండా సోలోగా ముంబైలో బోర్ కొడుతోందన్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. తన ఫ్రెండ్ తో కలిసి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నా అన్నాడు. తారక్ లేకుండా ఇదేతనకి సోలో పాన్ ఇండియా ఎటాక్ అని కూడా అన్నాడు. కట్ చేస్తే సోషల్ మీడియాలో రియాక్షన్ ఎలా ఉన్నా, నార్త్ ఇండియాలో మాత్రం మాస్ వేవ్ మొదలైంది. ఆలియా, కైరా ఇలా ఇద్దరున్నా నార్త్ లో సమంత నామస్మరనే చేశాడు రామ్ చరణ్. ఆల్రెడీ కండల ఖాన్ సల్మాన్ సాయంతో గేమ్ ఛేంజర్ ఫేటే నార్త్ లో మారేలా ఉంది. శంకర్ పుణ్యమాని కోలీవుడ్ లో ఈ సారి వండర్ ఏదో జరిగేలా ఉంది. మొత్తంగా చూస్తే శంకర్, దిల్ రాజు కంటే కూడా తన మూవీని ప్రమోట్ చేసుకోవటంలో చరణ్ ముదిరిపోయాడు. ఎన్టీఆర్, ప్రభాస్, సల్మాన్ ఇలా ఎవరినీ వదలట్లేదు. ఏ అవకాశాన్ని విడవట్లేదు. ప్రమోషన్ లో ఇంత డెటికేషన్ కి కారణం, సినిమా బడ్జెట్ 400 కోట్ల దాటడమే... కాబట్టి ఈ మూవీ హిట్ అయితే సరిపోదు... అంతకము మించి ఆడితే తప్ప గేమ్ ఛేంజ్ కాదు.. మరి ఈ విషయంలో తారక్ నార్త్ ఇండియన్ మాస్ ఫ్యాన్స్ ఎంతవరకు తనకి సపోర్ట్ అవుతారు? మెగా పవర్ స్టార్ అలియాస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజర్ ప్రమోషన్ విషయంలో ఎమోషనేమారింది. బేసికల్ గా ఎన్టీఆర్ కి ఫ్రెండైన చరణ్, త్రిబుల్ ఆర్ తో మ్యాన్ ఆఫ్ మాసెస్ తో మరింత క్లోజ్ అయ్యాడు. అందుకే కావొచ్చు గేమ్ ఛేంజర్ నార్త్ ఇండియా ప్రమోషన్ లో ఎక్కడికి వెళ్లిన ఎన్టీఆర్ పేరు స్మరించకుండా ఉండట్లేదు నిజంగానే త్రిబుల్ ఆర్ తో పాన్ ఇండియాని షేక్ చేసిన చరణ్, తారక్ తో కలిసే ఈ ఫీట్ సాధించాడు. ఐదేళ్ల క్రితం ద్రువతోనే సోలోగా బాక్సాఫీస్ ని షేక్ చేసిన చరన్, మళ్లీ ఐదేళ్ల తర్వాత మళ్లీ సోలోగా గేమ్ ఛేంజర్ మూవీతో దండెత్తాడు అంతా బానే ఉంది కాని, చరణ్ లేకుండా సోలోగా వస్తుండటంతో, ఎక్కడో ఎన్టీఆర్ ని మిస్ అవుతున్నానన్నాడు. నార్త్ ఇండియా ప్రమోషన్ లో ఎన్టీఆర్ పేరెత్తకుండా ఉండలేదు. ఇదే నార్త్ ఇండియాలో మ్యాన్ ఆఫ్ మాసెస్ కి ఉన్న మాస్ ఫ్యాన్స్ కి తెగ నచ్చింది. చరణ్ కనిపించినప్పుడల్లా జై భీమ్, జై రామ్ అంటూ త్రిబుల్ ఆర్ లో పాత్రలని గుర్తు చేస్తున్నారు ఇదే కాదు సల్మాన్ ఖాన్ ని కలిసి చరణ్, కైరా అద్వానికి అక్కడ కూడా కావాల్సినంత ప్రమోషన్ దక్కింది. ఇది చరన్ కెరీర్ లో 2 వేల కోట్లు రాబట్టే సినిమా అన్నాడు సల్మాన్. ఇంతగా చరన్ తన మూవీ ని ప్రమోట్ చేయటం వెనక సాలిడ్ రీజనుంది. 250 కోట్ల బడ్జెట్ తో మొదలై, షూటింగ్ డిలే అవటంతో 450 కోట్లు వరకు బడ్జెట్ కంట్రోల్ తప్పింది. అలా గేమ్ ఛేంజ్ అవటంతో, ఈ సినిమా 500 కోట్లు రాబడితేనో, హిట్ అయితేనో పెద్దగా ప్రయోజనం ఉండదు. కనీసం వెయ్యికోట్లు, లేదంటే అంతకుమించి రాబడితేనే నిర్మాత గట్టెక్కే ఛాన్స్ఉంది. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు లాభాలు రావాలన్నా గేమ్ ఛేంజర్ మూవీ వెయ్యికోట్లను మించాల్సిందే. అందుకే సూపర్ స్టార్ మహేశ్ తో రాజమౌళి మూవీ ప్రస్తావనతో, మహేశ్ ఫ్యాన్స్ సపోర్ట్ ని... ఎన్టీఆర్ ప్రస్థావనతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ సపోర్ట్ ని కూడకట్టేలా ఉన్నాడు. ఆల్రెడీ నార్త్ ఇండియాలో సల్మాన్ ఫ్యాన్స్ చరణ్ ని ఓన్ చేసుకున్నారు. నార్త్ ఇండియా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చరణ్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. మొత్తంగా ప్రమోషన్ పరంగా అన్నీ స్ట్రాటజీలు వర్కవుట్ అవుతున్నాయి. లక్కీగా ట్రైలర్ కూడా పేలటంతో, ఏమాత్రం పాజిటిట్ టాక్ వచ్చినా, వెయ్యికోట్ల వరదకి ఛాన్స్ ఎక్కువే ఉంది. [embed]https://www.youtube.com/watch?v=kEigi93uPEY[/embed]