మట్కాకు “దేవర” బ్రేక్ ఫాస్ట్, గేమ్ చేంజర్ కు ఫుల్ మీల్సే
ఎవరితో గోక్కున్నా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు స్టార్ హీరో ఫ్యాన్స్ తో గోక్కోవద్దు. ఈ సూత్రం తెలియక దేవర విషయంలో యాంటీ ఫ్యాన్స్ గుడ్డలు చించుకుని ట్రోల్ చేసారు. ఎన్టీఆర్ దమ్ము ఏంటో తెలియక దేవరను తక్కువ అంచనా వేసారు.
ఎవరితో గోక్కున్నా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు స్టార్ హీరో ఫ్యాన్స్ తో గోక్కోవద్దు. ఈ సూత్రం తెలియక దేవర విషయంలో యాంటీ ఫ్యాన్స్ గుడ్డలు చించుకుని ట్రోల్ చేసారు. ఎన్టీఆర్ దమ్ము ఏంటో తెలియక దేవరను తక్కువ అంచనా వేసారు. దేవర ఫిక్స్ చేసిన టార్గెట్ ను అందుకోవడానికి యాంటీ ఫ్యాన్స్ సపోర్ట్ చేసే హీరోల జేజెమ్మలు దిగి రావాలి. ఏ మాత్రం తేడా జరిగినా… ఆ ఫ్యాన్స్ తమ హీరోలనే తిట్టడం కాదు… రక్కడం ఖాయం. అమెరికాలో ప్రీ బుకింగ్ మార్కెట్ టార్గెట్ రీచ్ కావడం అంటే అంత ఈజీ కాదు.
పుష్ప 2 తో బన్నీ ఏదోలా బయటపడతాడు… కాని గేమ్ చేంజర్ పరిస్థితి ఊహకు కూడా అందడం లేదు. అమెరికాలో మెగా ఫ్యాన్స్ భారీగా ఉన్నా… ఎంత వరకు గేమ్ చేంజర్ ప్రీ బుకింగ్ మార్కెట్ జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. ఆ సినిమాపై జనాల్లో నమ్మకాలు తక్కువే. సినిమా ప్రమోషన్స్ విషయంలో పక్కా లెక్కతో దిల్ రాజు వెళ్తున్నా గ్యారెంటీ మాత్రం కనపడటం లేదు. ఇక దేవర ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీలో ఒక్క అల్లు అర్జున్ ను మినహా మిగిలిన హీరోలు అందరికి చుక్కలు చూపించడానికి రెడీ అయ్యారు.
ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఫస్ట్ పడేది వరుణ్ తేజ్ మట్కా సినిమా పైనే. బాబు మొన్న ఆడియో రిలీజ్ లో కాస్త ఎక్కువ మాట్లాడాడు అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. బన్నీ ఫ్యాన్స్ ఇప్పటికే వరుణ్ తేజ్ ను టార్గెట్ చేయడం స్టార్ట్ చేసారు. ఎలా హిట్ కొడతావో చూస్తాం అన్నా అంటూ… ట్రోల్ చేయడం స్టార్ట్ చేసారు. ఇక మట్కాను ఇప్పుడు దేవర ఫ్యాన్స్ తగులుకున్నారు. చిన్న హీరో కాబట్టి బ్రేక్ ఫాస్ట్ మాత్రమే పెట్టడానికి రెడీ అయ్యారు. మట్కా టీజర్ ను, ట్రైలర్ ను ట్రోల్ చేయడం స్టార్ట్ చేసారు దేవర ఫ్యాన్స్.
సినిమాలో దమ్ము లేక… పెదనాన్న, అన్నయ్య, బాబాయ్ అంటూ మాట్లాడాడు అని… అలాంటి వాడికి ఈవెంట్స్ లో డైలాగ్స్ ఎందుకు అంటూ ట్రోల్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ కు ముందే ఇదంతా… సినిమా రిలీజ్ అయి యావరేజ్ టాక్ తెచ్చుకుంటే ఆ ఊహే భయంకరంగా ఉంది కదా…? అసలు మట్కా సినిమాకే ఇలా ఉంటే గేమ్ చేంజర్ సినిమా పరిస్థితి ఊహకే అందడం లేదు. కచ్చితంగా దేవర ఫ్యాన్స్ ఫుల్ మీల్స్ రెడీ చేసి ఉంటారు. ఇప్పటికే టీజర్ ను ఓ రేంజ్ లో ఆడుకోవడం స్టార్ట్ చేసారు. రిలీజ్ తర్వాత కచ్చితంగా ఆడుకోవడం ఖాయం.