నందమూరి నటసింహం బాలయ్య ఇప్పుడు అందరికీ సాఫ్ట్ టార్గెట్ గా మారాడు. చాలా ఈజీగా లక్ష్యం అవుతున్నాడు. ఆల్రెడీ డాకూమహరాజ్ పాట భయంకరంగా ట్రోలింగ్ కి గురౌతోంది. అందులోని పాట తాలూకు కొరియోగ్రాఫీ మీద మాటల తూటాలు, కామెంట్ల ఎటాక్స్ పెరిగాయి. ఇలాంటి టైంలో నటసింహాన్ని టార్గెట్ చేశాడు హరీష్ శంకర్. నటసింహానికి ట్రోలింగ్స్ కాని, కామెంట్ల గోల కాని కొత్త కాదు. దర్శకులు ఏం చేబితే అది చేసే ఈ స్టార్, డైరెక్టర్స్ యాక్టర్ అవటంతో అసలు గోల మొదలైంది. వాళ్లు చెబితే తనెలా అలాంటి స్టెప్స్ చేశాడనే ప్రశ్నలతో ట్రోలింగ్ మరింత పెరిగింది. విచిత్రం ఏంటంటే ఈ ట్రోలింగ్ కి ఎవరూ పుల్ స్టాప్ పెట్టలేకపోతున్నారు. దీనికి తోడు మిగతా బ్యాచ్ కూడా రివర్స్ లో బాలయ్యనే టార్గెట్ చేశారు. బాల మీదే కన్నేశారు.. ఇంతకి ఈ వివాదంలో విచిత్రంగా మారిన డైరెక్టర్ హరీష్ శంకర్ కథేంటి? నటసింహం బాలయ్య ఇప్పుడు సోషల్ మీడియా ట్రోలింగ్స్ కి మాత్రమే కాదు, దర్శకులకి కూడా ఈజీ టార్గెట్ గా మారాడు. మొన్నీమధ్యే తన కొత్త మూవీ డాకూ మహారాజ్ పాట వివాదమైంది. అందులో బాలయ్య డాన్స్ వైరలైంది శేఖర్ మాస్టర్ చేసిన కొరియో గ్రాఫి మీద చాలా మంది విరుచుకుపడ్డారు. అవేం స్టెప్స్ అంటూ కామెంట్లు పెంచారు. ఐతే దర్శకులేం చెప్పినా, కంటెంట్ లో ఏమున్నా ఒక్కసారి డైరెక్టర్ ని నమ్మితే దూసుకెళ్లిపోయే బాలయ్య, ఇప్పుడు వివాదం లో ఇరుక్కున్నాడు బేసిగ్గా హైపర్ యాక్టివ్ అయిన బాలయ్య ఎనర్జీని క్యాప్చర్ చేసేందుకు, దర్శకులు, కొరియోగ్రాఫర్లు కొన్ని సార్లు ఇలా పరిది దాటి ప్రయోగాలు చేయటం చూశాం. అందులో కొన్ని కలిసొస్తే, చాలా వరకు మిస్ ఫైర్ అయ్యాయి. ఈవిషయంలో తన అసంత్రుప్తిని చాలా సార్లు వ్యక్త పరిచాడు బాలయ్య. ఐతే కొరియో గ్రాఫర్లు చెబితే మాత్రం బాలయ్య అలా ఎలా ఆ స్టెప్స్ వేశాడనే ట్రోలింగ్స్ మాత్రం తగ్గట్లేదు. అయితే ఇలాంటి టైంలో హరీష్ శంకర్ బాలయ్యతో మాస్ మూవీ ప్లాన్ చేస్తున్నాడన్న వార్త వైరలైంది బాలయ్యతో ఆల్రెడీ అనిల్ రావిపుడి భగవంత్ కేసరి తీశాడు. డైరెక్టర్ బాబీ డాకు మహరాజ్ లాంటి ప్రయోగం చేశాడు. కట్ చేస్తే క్యూలో హరీష్ శంకర్ కూడా నిలుచున్నాడు. చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ లో మాస్ మూవీలు సింపుల్ గా తీసేసి, బాక్సాఫీస్ ని షేక్ చేయాలంటే బాలయ్యే ఈజీ టార్గెట్ గా మారాడు. ఇక దర్శకులు, కొరియగ్రాఫర్ల అత్యుత్సాహంతో మేకింగ్ లో జరిగే మిస్టేక్స్ కూడా వివాదంగానో, వైరల్ గానో మారటం మూవీకి కలిసొచ్చే అవకాశంగానే చూస్తున్నారు చాలా మంది. కాని దీని వల్ల ఓహీరో మీద కామెంట్ల దాడి జరగటం మాత్రం మర్చిపోతున్నారనే చర్చ పెరిగింది. ఏదేమైనా కాలీగా ఉన్న మాస్ దర్శకులు ఈజీగా బాలయ్యని రీచ్ అవటం, షార్ట్ కట్ లో ప్రాజెక్టు పట్టేసి దూసుకెళ్లటం జరగిపోతోందనే కామెంట్స్ పెరిగాయి. బోయపాటి కూడా ఇప్పుడు తన ఇమేజ్ ని, ఫెల్యూర్స్ ని రిపేర్ చేసుకునేందుకు బాలయ్యనే నమ్మకున్నాడు. అఖండ 2 తో వస్తున్నాడు. [embed]https://www.youtube.com/watch?v=K47zhl96ChU[/embed]