మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ దేవర 670 కోట్ల వరకు రాబట్టింది. దీంతో పోలిస్తే పుష్ప2 కి 1700 కోట్ల పైనే వసూల్లొచ్చాయి. ఆ నెంబర్స్ నిజమే అయితే దేవరకంటే మూడు రెట్లు వసూళ్లు వచ్చినట్టే.. అయినా ఎన్టీఆర్ సినిమాల మీదే కన్నేసినట్టున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దేవర 2 తో పాటు, డ్రాగన్ ని మీద కూడా ఐకాన్ స్టార్ కన్నుపడింది. ఫలితంగానే కొరటాల శివతో పాటు, ప్రశాంత్ నీల్ తో కూడా బన్నీ మీటింగ్ జరిగినట్టుంది. సడన్ గా ఎప్పుడో ఆగిపోయిన కొరటాల శివ, బన్నీ ప్రాజెక్ట్ లో కదలికి వచ్చిందంటున్నారు. చేతిలో దేవర 2 మూవీ ఉండగ కొరటాల శివ సడన్ గా అల్లు అర్జున్ వైపు షిఫ్ట్ అవటం అసాధ్యం. ఇక డ్రాగన్ ని స్టార్ట్ చేసిన ప్రశాంత్ నీల్, దీని తర్వాత సలార్ 2 తీయాలి. కాబట్టి తను కూడా బన్నీకి అందుబాటులోకి రావటం ఇప్పట్లో కాని పని. విచిత్రం ఏంటంటే ఇంకా ఎన్టీఆర్ తో సినిమా షూరూ చేయని నెల్సన్ దిలీప్ కి బన్నీ టచ్ లో కెళ్ళాడట.. ఇదంతా చూస్తే పనికట్టుకుని ఎన్టీఆర్ డైరెక్టర్స్ నే బన్నీ టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకలా? మిగతా హీరోల దర్శకుల జోలికి పోకుండా, మ్యాన్ ఆఫ్ మాసెస్ తీసే సినిమాలు, వాటి దర్శకుల చుట్టూనే బన్నీ ఎందుకు ప్రదక్షిణాలు చేస్తున్నాడు..? దేవర హిట్ తర్వాత వార్ 2 తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న తారక్, ఈ నెలాఖర్లోగా వార్ 2 ని ఫినిష్ చేసి, వచ్చే నెల మొదటి వారం నుంచి డ్రాగన్ షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్. ఐతే ఇప్పుడు కొరటాల శివతో బన్నీ చర్చలు అందరినీ షాక్ కి గురిచేస్తున్నాయి. ఎప్పుడో తన మేకింగ్ లో సినిమాచేయాల్సిన బన్నీ, అప్పట్లో చేయలేకపోయాడు ఇప్పుడు కొరటాల శివని పిలిపించీ మరీ కథ చర్చలు చేయటంతో, నెక్ట్స్ బన్నీతోనే సినిమా తీస్తాడనంటున్నారు. కాని అది సాధ్యమా? ఎందుకంటే ఎన్టీఆర్ డ్రాగన్ పూర్తి చేసిన వెంటనే దేవర 2 షూటింగ్ మొదలయ్యేలా ప్లాన్ చేశాడు. అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దేవర2 పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈలోపు బన్నీతో కొరటాల శివ సినిమా కి అవకాశమే లేదు ఇక ఆతర్వాత కనీసం ఏడాదిన్నర దేవర 2 షూటింగ్ తోనే సరిపోతుంది. అంటే మరో రెండున్నరేళ్లవరకు కొరటాల శివ మేకింగ్ లో బన్నీ సినిమాకి ఛాన్సే లేదు. ఐతే నెల్సన్ దిలీప్ కూడా ఈ వారం బన్నీని గీతా ఆర్ట్స్ లో కలవటంతో, ఐకాన్ స్టార్ ఇలా కూడా కొత్త కాంబినేషన్ ట్రై చేస్తున్నాడా అన్న డౌట్లు పెరిగాయి. జైలర్ తర్వాత జైలర్ 2 ప్లాన్ చేసిన నెల్సన్ ఇది పూర్తి చేశాకే ఎన్టీఆర్ తో సినిమా తీస్తాడని తెలుస్తోంది. ఆలెక్కన తను కూడా రెండున్నరేళ్ళనుంచి మూడేళ్ల వరకు బన్నీకి అందుబాటులోకి రావటం కాని పని... సో ఎలా చూసినా ఎన్టీఆర్ తో మూవీస్ తీస్తున్న, తీయబోతున్న దర్శకులని బన్నీ టార్గెట్ చేయటంలో ఎలాంటి ప్రయోజనం లేదు ఆల్రెడీ డ్రాగన్ మూవీ షూటింగ్ షురూ చేసిన ప్రశాంత్ నీల్ తో ఇప్పటికే రెండుమూడు సార్లు మీటయ్యాడు బన్నీ. కాని డ్రాగన్ పూర్తవటానికి ఏడాదిన్నర, తర్వాత సలార్2 మొదలై పూర్తవటానికి మరో ఏడాదిన్నర... సో మూడేళ్ల వరకు ప్రశాంత్ నీల్ కూడా అందుబాటులో ఉండటం కష్టమే. త్రివిక్రమ్ తో ఎలాగూ సినిమా కమిటైన బన్నీ, ఆ తర్వాత ప్రాజెక్టు కోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. అందుకు ఎందరో పాన్ ఇండియా డైరెక్టర్స్ ఉన్నా, ఎన్టీఆర్ తో సినిమాలు కమిటైన దర్శకులనే టార్గెట్ చేసుకున్నాడు. [embed]https://www.youtube.com/watch?v=o8QT2FNkWNE[/embed]