సిఖ్ మార్కెట్ పై ఎన్టీఆర్ ఫోకస్…? వార్ 2 టార్గెట్ అదేనా…?

దేవర సినిమా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు ఎన్టీఆర్ రెట్టించిన ఉత్సాహంతో వార్ 2 షూట్ లో పాల్గొంటున్నాడు. చేసేది నెగటివ్ రోల్ అయినా ఎన్టీఆర్ రోల్ కు మంచి వెయిట్ ఇచ్చాడు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 15, 2024 | 05:40 PMLast Updated on: Nov 15, 2024 | 5:40 PM

Ntr Focus On Sikh Market Is That The Target Of War 2

దేవర సినిమా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు ఎన్టీఆర్ రెట్టించిన ఉత్సాహంతో వార్ 2 షూట్ లో పాల్గొంటున్నాడు. చేసేది నెగటివ్ రోల్ అయినా ఎన్టీఆర్ రోల్ కు మంచి వెయిట్ ఇచ్చాడు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. ప్రస్తుతం ఎన్టీఆర్ తో యాక్షన్ సీక్వెన్స్ లు ప్లాన్ చేసి షూట్ చేస్తున్నాడు. త్వరలోనే సినిమాకు సంబంధించి ఓ వీడియో కూడా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వాలని అయాన్ ముఖర్జీ పట్టుదలగా ఉన్నాడు. అందుకే షూట్ కూడా లేట్ చేయడం లేదు.

ఎన్టీఆర్ కూడా ఫ్యాన్స్ కోసం కాస్త గట్టిగానే ప్లాన్ చేసినట్టు టాక్. ఇక దేవర సినిమా నుంచి ఎన్టీఆర్ లెక్కలు చాలా వరకు మారాయి అనే మాట వాస్తవం. దేవర సినిమా విషయంలో ఎన్టీఆర్ చాలా నేర్చుకున్నాడు. తెలుగు మార్కెట్ కంటే కూడా నార్త్, కన్నడ, తమిళ మార్కెట్ లో ఎక్కువ సినిమాను ప్రమోట్ చేయడం చూసాం. ఇప్పుడు మరో మార్కెట్ పై కూడా ఎన్టీఆర్ ఫోకస్ చేసాడు అని టాక్ వస్తోంది. అదే సిఖ్ మార్కెట్. సిఖ్ మార్కెట్ విషయంలో బాలీవుడ్ కు అసలు పట్టు లేదు అనే మాట వాస్తవం.

పంజాబ్, హర్యానాలో బాలీవుడ్ సినిమాలకు ఆదరణ చాలా తక్కువ. అందుకే అక్కడ సినిమాలను షూట్ చేయడం, సిఖ్ లకు ఎక్కువ హైప్ ఇవ్వడం చేస్తూ ఉంటారు బాలీవుడ్ హీరోలు. ఈ విషయంలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ ముందు వరుసలో ఉన్నాడు. అతని సినిమాలు ఎక్కువగా సిఖ్ లకు హైప్ ఇచ్చినట్టే ఉంటాయి. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ముగ్గురు సిఖ్ మార్కెట్ పై ఫోకస్ చేసి ఫెయిల్ అయ్యారు అనే చెప్పాలి. ఇప్పుడు మన తెలుగు హీరోలు సిఖ్ మార్కెట్ ను టార్గెట్ చేసి సినిమాలు చేస్తున్నారు.

ముఖ్యంగా ప్రభాస్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడనే చెప్పాలి. స్పిరిట్ సినిమాతో అక్కడ పాగా వేయడానికి రెడీ అయ్యాడు. ఇక ఎన్టీఆర్ కూడా ఇప్పుడు పంజాబ్ మార్కెట్ కోసం… వార్ 2 లో కొన్ని సీన్స్ ను అమ్రిత్ సర్ లో షూట్ చేయాలని కోరినట్టు తెలుస్తోంది. అక్కడే ఓ యాక్షన్ సీన్ తో పాటుగా సిఖ్ లకు తనతో స్నేహం ఉన్నట్టుగా చూపించాలని కోరాడట. దీనికి అయాన్ ముఖర్జీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ సినిమా టైం లో పంజాబ్ లో సినిమాను బాగా ప్రమోట్ చేసారు. అక్కడ ఆర్ఆర్ఆర్ సినిమాకు మంచి ఆదరణ లభించింది.