బాలయ్యకు దగ్గరవుతున్న ఎన్టీఆర్…? పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్
నందమూరి కుటుంబం మళ్లీ దగ్గరవుతోందా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. గత కొన్నాళ్లుగా ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు.
నందమూరి కుటుంబం మళ్లీ దగ్గరవుతోందా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. గత కొన్నాళ్లుగా ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా పెద్దగా నందమూరి కుటుంబంతో కలిసే ప్రయత్నం చేయడం లేదు. అటు నారా కుటుంబంతో కూడా అన్నదమ్ములు ఇద్దరు సమ దూరం పాటిస్తున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎన్టీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఎన్టీఆర్ గానీ కళ్యాణ్ రామ్ గాని హాజరయ్యే ప్రయత్నం చేయలేదు.
అయితే గత నాలుగైదు నెలలుగా ఎన్టీఆర్ వైఖరిలో మార్పు కనబడుతోంది. నందమూరి కుటుంబానికి ముఖ్యంగా బాలకృష్ణకు దగ్గర ప్రయత్నం ఎన్టీఆర్ చేస్తున్నాడు అనే సిగ్నల్స్ వస్తున్నాయి. నందమూరి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ విష్ చేశాడు. అయితే బాలకృష్ణ గురించి మాత్రం పెద్దగా మాట్లాడేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇక బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ విషయంలో అలాగే బిహేవ్ చేస్తున్నారు అనే ఒపీనియన్ వినపడుతోంది. రీసెంట్ గా ఆహాలో అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కూడా ఒకటి కాంట్రవర్సీ అయింది.
అయితే లేటెస్ట్ గా నందమూరి బాలకృష్ణకు పద్మభూషణం అనౌన్స్ చేయడంతో.. ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ ఇద్దరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. బాల బాబాయ్ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. దాదాపు 10 ఏళ్ల నుంచి వీళ్ళ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉన్నాయి. అయితే హరికృష్ణ మరణం తర్వాత వీళ్ళు దగ్గర అయ్యే ప్రయత్నం చేసిన కొన్ని కారణాలతో దూరమయ్యారు. ఎన్టీఆర్ కు సన్నిహితంగా ఉండే కొడాలి నాని పదేపదే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిని అలాగే ఆయన కుమారుడు లోకేష్ విమర్శించడానికి నందమూరి కుటుంబం హర్షించలేదు.
ఏకంగా శాసనసభలో భువనేశ్వరి పై ఆరోపణలు చేసిన సరే ఎన్టీఆర్ నుంచి సరైన రెస్పాన్స్ రాలేదని విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ ట్విట్ చేయడంతో బాలయ్య ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత వీళ్ళు ఒకే వేదికపై ఇప్పుడు మళ్లీ వీళ్ళు దగ్గర అవకాశం ఉండొచ్చు అని నందమూరి కుటుంబ సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈనెల 23న నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కూడా ఎన్టీఆర్ పోస్ట్ చేయలేదు. ఏది ఎలా ఉన్నా ప్రస్తుతం ఎన్టీఆర్ ట్వీట్ మాత్రం పొలిటికల్ అలాగే సినిమా సర్కిల్స్లో వైరల్ అవుతుంది.