ఎన్టీఆర్ ఎదిగాడు.. రామ్ చరణ్ నలిగాడు.. టైం మారేదెన్నడు..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలసి త్రిబుల్ఆర్ మూవీ చేశారు. కలిసి పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేశారు. కలిసే నాటు నాటు పాటతో గ్లోబల్ గా పాపులరయ్యారు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలసి త్రిబుల్ఆర్ మూవీ చేశారు. కలిసి పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేశారు. కలిసే నాటు నాటు పాటతో గ్లోబల్ గా పాపులరయ్యారు. కాకపోతే ఆ తర్వాతే కలిసి పాన్ ఇండియాని షేక్ చేయలేకపోతున్నారు. ఎన్టీఆర్ దేవరగా దూసుకెళ్లాడు. రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు. మరో మూడు పాన్ ఇండియా ప్రాజెక్టులతో ముందే హిట్ ని కూడా కన్ఫామ్ చేసుకున్నాడు. ఇలా ఎన్టీఆర్ అలా ఎదిగిపోతూనే ఉంటే, రామ్ చరణ్ మాత్రం బాక్సాఫీస్ కింద నలిగిపోతూ వచ్చాడు. ఆచార్య, గేమ్ ఛేంజర్ రెండీంటి రెండు డిజాస్టర్లే.. ఒకదాన్ని మించి ఒకటి తనకి పంచ్ ఇచ్చాయి. కోలుకోలేని దెబ్బ పడేలా చేశాయి.. ఇలాంటి టైంలో బుచ్చిబాబుతో ఆటకూలీ కాన్సెప్ట్ తో స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు. ఇది కూడా పంచ్ ఇస్తే హ్యాట్రిక్ షాకులు తగిలినట్టౌతుంది. కాని పడ్డ రెండు ప్లాపులని జనం మర్చిపోయేలా సాలిడ్ హిట్ ని ఈ సినిమాతో ఎక్స్ పెక్ట్స్ చేస్తున్నాడు చరణ్.. అది సాధ్యమేనా..? ఒక వైపు దేవర హిట్టై ఇన్ని నెలలు గడుస్తుంటే, ఈటైంలో జపాలో దేవర పూనకాలు మొదలయ్యాయి.. కాని చరణ్ కి పీడకలలు మాత్రం రాకుండా ఉండట్లేదు.. సో ఇది మారేదెప్పుడు…? హావేలుక్
త్రిబుల్ ఆర్ తో ఇద్దరి స్నేహం బ్రోమాన్స్ గా మారింది. గ్లోబల్ గా గుర్తింపు పొందిది… అలా గ్లోబల్ ఫ్రెండ్స్ గా మారిన ఇద్దరే ఎన్టీఆర్, రామ్ చరణ్. కాకపోతే ఈ ఇద్దరు గ్లోబల్ స్టార్స్ లో ఒక్కరు జెట్ స్పీడ్ తో దూసుకెళుతుంటే, ఇంకొక్కరు నజీబీ కింద నలిగిపోతున్నారు. ఎన్టీఆర్ విషయానికొస్తే, నిజానికి త్రిబుల్ ఆర్ తో కొమరం భీమ్ గా కాస్త ప్రయారిటీ తక్కువే ఇచ్చారనే కామెంట్స్ వచ్చాయి. అల్లూరి సీతారామరాజుగా చరణ్ పాత్రకేప్రయారిటీ ఎక్కువ ఇచ్చారన్నారు. ఏదేమేనా నాటు నాటు పాట తో ఇద్దరూ గ్లోబల్ గా గుర్తింపు పొందారు. కాని ఆతర్వాతే ఇద్దరి జాతకాలు మారిపోయాయి.
దేవరతో రాజమౌళిసెంటిమెంట్ ని బ్రేక్ చేసి, ఎన్టీఆర్ 670 కోట్లతో మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారాడు. థియేటర్స్ తో పాటు ఓటీటీని కూడా ఏలాడు. ఇప్పుడు జపాన్ లో దుమ్ముదులపబోతున్నాడు. ఆల్రెడీ అక్కడ ప్రివ్యూ పేలింది. ప్రమోషన్ లోఎన్టీఆర్ కి ఫ్యాన్స్ నుంచి భారీ స్పందనొస్తోంది. నిజానికి అదే జపాన్ లో త్రిబుల్ ఆర్ ప్రమోషన్ కోసం ఈ ఇద్దరు ఫ్రెండ్ హంగామా చేశారు. కాని ఇప్పుడు ఎన్టీఆర్ మాత్రమే దేవరతో దూసుకెళుతుంటే, పెద్ద మూవీతో గట్టెక్కేందుకు కష్టపడుతున్నాడు చరణ్. ఆచార్యా పంచ్ ఇచ్చింది. గేమ్ ఛేంజర్ కోలుకోలేని దెబ్బ పడేలా చేసింది. ఫైనల్ గా ఎన్టీఆర్ సాయం తీసుకుని, తను పంపించిన కథతో, అలానే తనతో సినిమా తీయాల్సిన బుచ్చిబాబుతో పెద్దీ మూవీ చేస్తున్నాడు చరణ్.
కాకపోతే పెద్ది టైటిల్ తనకి నచ్చకపోవటం వల్లే మరో టైటిల్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఫస్ట్ టైం ఆటకూలి లాంటి పాత్ర ఒకటి చరణ్ వేయటం మరో విచిత్రం. ఆడితే కూలి ఇచ్చే పద్దతిలో పని చేసే వ్యక్తిగా క్రికెట్, కుస్తీ, ఇలా అరడజన్ ఆటలాడే హీరో పాత్ర, తన ఫేట్ మార్చే ఛాన్స్ ఎంతవరకుందో ఇప్పుడే చెప్పలేం. కాని తన బర్త్ డే కి ఒకరోజు ముందు సినిమా టీజర్ ని రివీల్ చేస్తారనంటున్నారు. అది కూడా జపాన్ లో ఉన్న ఎన్టీఆర్ లైవ్ లో టీజర్ ని లాంచ్ చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. సో ఇదైనా చరణ్ ఫేట్ మారిస్తే, ఫ్రెండ్ గా ఎన్టీఆర్ కి కూడా పండగే… మరి తన స్నేహితుడి కోసం కథని, దర్శకుడిని త్యాగం చేసిన తారక్, జపాన్ నుంచి చరణ్ మూవీ టీజర్ లాంచ్ చేస్తే సీన్ ఎలా మారుతుందో తేలాలంటే, మరో రెండు రోజుల వేయిట్ చేయాలి..