2022 లో త్రిబుల్ ఆర్ తో దుమ్ముదులిపిన ఎన్టీఆర్ మళ్లీ రెండేళ్ల తర్వాత 2024 లోనే దేవరతో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేశాడు. ఐతే ఇక మీదట తన మూవీల కోసం ఫ్యాన్స్, ఇలా ఏళ్లకేళ్లు వేయిట్ చేయాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఎటాక్ చేసేందు రెడీ అవుతున్నాడు. ప్రతీ పండగని కాసుల పండగగా మార్చబోతున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే, ఏకంగా రెబల్ స్టార్ ని మించే ఛాన్స్ ఉంది. పాన్ ఇండియా కింగ్ చైర్ మారిపోయేలా ఉంది. అంతేకాదు ఆగస్టు, సంక్రాంతి, దీపావళి, ఆతర్వాత మరో సంక్రాంతి.. ఇవే మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ కొత్త సినిమాలకు కుదిరిన పాత ముహుర్తాలు...ఇక ఈ ఏడాది ఆగస్టుకి వార్2 తో తన దండయాత్ర ఎప్పుడో ఫిక్స్ చేసిన తారక్, ఆతర్వాతే అసలు ఆట మొదలౌతుందంటున్నాడు. ప్రతీ ఆరునెల్లకో సినిమా ప్లాన్ చేసి, చరణ్, బన్నీ కి అందనంద ఎత్తులో, దూసుకెళ్లబోతున్నాడు.. ఏకంగా రెబల్ స్టార్ పొజీషన్ కే అపోజీషన్ లా మారుతున్నాడు. ఇక్కడ తెలుగు వాళ్ల గర్వపడాల్సిన విషయం ఏంటంటే, ఒక తెలుగు రెబల్ స్టార్ కి పాన్ ఇండియా లెవల్లో పోటీ ఇస్తోంది కూడా మరో తెలుగు స్టారే... మధ్యలో ఎక్కడా ఖాన్లూ కపూర్ల పేర్లే లేవు... అది ఓరేంజ్ లో పెరిగిపోయిన తెలుగు సినిమా రేంజ్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఏన్టీఆర్ నిదానంగా దాడి చేసినా, సాలిడ్ ప్లానింగ్ తోనే దండెత్తుతున్నాడు. రికార్డులు క్రియేట్ చేయటం లేదంటే, సెంటిమెంట్లను బ్రేక్ చేయటం మేబీ అలానే తనకి కుదిరినట్టుంది. ఇప్పుడు ఎక్కువ సేఫ్ గేమ్ ఆడేందుకే ప్రయత్నిస్తున్నాడు తారక్. అందులో భాగంగా ప్రతీ పండగని టార్గెట్ చేశాడు. రెండు సంక్రాంత్రిలు, అలానే ఒక దీపావళిని టార్గెట్ చేసుకున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఈ ఏడాది ఆగస్ట్ 15కి తన హిందీ మూవీ వార్ 2 రాబోతోంది. సోలోగానే 670 కోట్లు రాబట్టిన ఈ పాన్ ఇండియా దేవర, వార్2లో విలన్ గా మెరిస్తే, 2 వేల కోట్ల వసూళ్ల వరద ఖాయమంటున్నారు. సీన్ లో హిందీ స్టార్ గ్రీక్ గాడ్ హ్రితిక్ కూడా ఉన్నాడు కాబట్టి, ఈ మల్టీ స్టారర్ స్పై మూవీకి 2 వేల కోట్లు పెద్ద టార్గెట్ కాకపోవచ్చు మాస్ ఫ్యాన్స్ ని ఎన్టీఆర్ థియేటర్స్ కి రాబడితే, మిగతా ఫ్యాన్స్ ని నార్త్ లో హ్రితిక్ ఎట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఆగస్ట్ లో వార్ 2 మూవీ మినిమమ్ 2 వేల కోట్లు రాబడుతుందనే అంచానాలుంటే, డ్రాగన్ తో ఎన్టీఆర్ సోలోగా 1500 కోట్ల క్లబ్ లో అడుగుపెడతాడనే ప్రిడిక్షన్స్ పెరిగాయి ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ లో తారక్ జాయిన్ కాలేదు. తను లేని సీన్లే తీస్తున్నారు. అయినా ప్రీరిలీజ్ బిజినెస్ తాలూకూ చర్చలు ఈపాటికే మొదలయ్యాయి. నెట్ ప్లిక్స్ ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని 350 కోట్లకు కొనేందుకు సిద్దంగా ఉందని ప్రచారం జరుగుతోంది. సో ప్రజెంట్ ప్రిడిక్షన్స్ ప్రకారం డ్రాగన్ ఈజీగా 1500 కోట్లు రాబట్టే ఛాన్స్ఉంది... మ్యాన్ ఆఫ్ మాసెస్ కి ఉన్న క్రేజ్ ప్రకారం దేవర 2 కూడా ఈజీగా 1500 కోట్ల పైనే రాబడుతుందనంటున్నారు. అంటే ఈ రెండు మూవీలతోనే 3 వేల కోట్లు కొల్లగొట్టే తారక్, వార్ 2 తో 2 వేలు కొల్లగొడితే మొత్తంగా 5 వేల కోట్లు రాబట్టిన రికార్డు మాత్రమే కాదు, వరుసగా 5 పాన్ ఇండియా హిట్లు తన ఎకౌంట్ లో పడతాయి. ఇది కాకుండా నెల్సన్ దిలీప్ తో తను కమిటైన మూవీ కూడా ఈజీగా 1000 కోట్ల పైనే రాబట్టే ఛాన్స్ఉంది. సో ఈ ఆగస్ట్ 15 కి వార్ 2 తో 2 వేల కోట్లు, వచ్చే ఏడాది సంక్రాంతికి డ్రాగన్ తో 1500 కోట్లు, ఇక వచ్చేఏడాది దీపావళికి దేవర 2 తో మరో 1500 కోట్లు వచ్చే అవకాశం ఉండటం, 2026 సంక్రాంతిని నెల్సన్ దిలీప్ కుమార్ మూవీ ప్లాన్ చేయటంతో... మొత్తంగా మూడు పండగలను కలెక్సన్స్ తో 6 వేల కోట్ల పండగలుగా మార్చేలా ప్రిపేర్ అవుతున్నాడు తారక్. [embed]https://www.youtube.com/watch?v=msOqIaVhJx0[/embed]