కొమరం భీమ్.. దే”వర” తర్వాత… 1000 కోట్ల కర్ణ సేన్…

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ తో బిజీ అయ్యాడు. ఇక ఓటీటీ మీద దేవర దాడి కన్ఫామ్ అయ్యింది. నవంబర్ ఫస్ట్ వీక్ ఓటీటీలో దేవర దండయాత్ర భారీగా ఉండబోతోంది. అంతవరకు ఓకే, కాని ఇప్పుడు తన కొత్త మూవీలో సరికొత్త పాత్రతో పూనకాలు తెప్పించేలా ఉన్నాడు తారక్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 2, 2024 | 01:25 PMLast Updated on: Nov 03, 2024 | 10:35 AM

Ntr Have Big Plan For War 2

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ తో బిజీ అయ్యాడు. ఇక ఓటీటీ మీద దేవర దాడి కన్ఫామ్ అయ్యింది. నవంబర్ ఫస్ట్ వీక్ ఓటీటీలో దేవర దండయాత్ర భారీగా ఉండబోతోంది. అంతవరకు ఓకే, కాని ఇప్పుడు తన కొత్త మూవీలో సరికొత్త పాత్రతో పూనకాలు తెప్పించేలా ఉన్నాడు తారక్. తను చేసిన రెండు పాన్ ఇండియా మూవీలను మించేలా మూడో పాన్ ఇండియన్ మూవీ లో తన పాత్ర మైండ్ బ్లాంక్ చేసేలా ఉండబోతోంది. వార్ 2లో తన పాత్ర సౌత్ కంటే నార్త్ ఇండియాలోనే పూనకాలు తెప్పించేదని తెలుస్తోంది. దానికి ఓ సాలిడ్ రీజనుందని తెలుస్తోంది. అలా కర్ణసేన్ క్యారెక్టర్ లోనే వార్ 2 మూవీతొ షాక్ ఇవ్వబోతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. జైలవకుశ, అరవింద సమేత వీరరాఘవలో ఊహించని పాత్రలు వేసిన ఎన్టీఆర్, ఈసారి తాత దారిలో కర్ణుడిగా మారబోతున్నాడు. రెబల్ స్టార్ తర్వాత మళ్లీ ఈ తరంలో కర్ణుడి పాత్రని పాన్ ఇండియా లెవల్లో టచ్ చేస్తున్న హీరోగా హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడు. ఐతే కర్ణ సేన్ పాత్రకి, నార్త్ ఇండియాలో ప్రత్యేకంగా వచ్చే పూనకాలకి లింకేంటి? ఎన్టీఆర్ స్టోరీ సెలక్షన్ కంటే క్యారెక్టర్ సెలక్షనే తన ఫేట్ ని మారుస్తోందా?

ఎన్టీఆర్ కర్ణ సేన్ పాత్రవేస్తున్నాడనగానే నార్త్ ఇండియాలో చర్చ మొదలైంది. వార్ 2లో విలన్ అన్నప్పుడే త్రిబుల్ ఆర్, దేవర లాంటి హిట్లు పడ్డాక ఎందుకు నెగెటీవ్ రోల్ అని అన్నారు కాని, ఇప్పుడు ఆ టాక్ మారింది. వార్ 2లో ఎన్టీఆర్ వేసేది కర్ణ సేన్ పాత్ర అనగానే, ఉత్తారిదిన ఊపు మొదలైంది. లీడ్ రోల్ వేసే హ్రితిక్ రోషన్ గురించి కూడా ఇంతగా సోషల్ మీడియాలో, అది కూడా నార్త్ ఇండియా సర్కిల్ లో డిస్కర్షన్ జరగలేదు..

దానికి నార్త్ ఇండియా లో ఉన్న ఎమోషనల్ కనెక్షనే కారణం. కర్ణ పాత్ర మహాభారతాన్ని మలుపుతిప్పే రోల్… బేసిగ్గా కర్ణుడు అతి వీర భయంకర శక్తి సంపన్నుడు. సింపుల్ గా చెప్పాలంటై, మహా బాహుబలి… ఏకంగా అర్జునుడినే తుడిచిపెట్టే రేంజ్ ఉన్న బలుడు… కాని కౌరవుల పక్షాన నిలవటమే తను చేసిన తప్పు.. అ ధర్మం వైపు నిలుచోవటం వల్లే కర్ణుడి చావుకి కోటి కారణాలంటారు.

తనెంతగా కౌరవులు పక్షాన నిలుచుకున్నా, తనమీద జనాల్లో సానుబూతి ఉంది… అందుకే కర్ణుడి పాత్ర ఎవరు వేసినా, తనని నిజంగా కర్ణుడిలానే రిసీవ్ చేసుకుంటారు. కల్కీలో కాసేపే కనిపించే కర్ణ పాత్ర తాలూకు సీన్లు గూస్ బంప్స్ తెచ్చాయి… నార్త్ ఇండియాలో అయితే పూనకాలొచ్చాయి. ఆ పాత్ర మనకేం కొత్త కాదు. సీనియర్ ఎన్టీఆర్ జమానాలోనే దాన వీర శూర కర్ణ అని సినిమా తీసి, బాక్సాఫీస్ ని షేక్ చేశాడు

కాకపోతే, కల్కీలో కర్ణగా కాసేపే కనిపించిన రెబల్ స్టార్ ఈతరం కూడా కర్ణుడంటే ప్రాణం ఇస్తారని ప్రూవ్ చేశాడు. అలాంటి పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తే మతిపోవాల్సిందే… అసలే త్రిబుల్ ఆర్ లో కొమరం భీమం గా గోండుల బిడ్డగా సౌత్, నార్త్ జనాల్లో దూసుకెళ్లాడు తారక్. తర్వాత దేవరగా రెండు పాత్రలతో నార్త్ మార్కెట్ కి మరింత దగ్గరయ్యాడు..

ఇప్పుడు ఏకంగా కర్ణ సేన్ గా మారిన వార్ 2 మూవీలో నెగెటీవ్ రోల్ వేస్తున్నాడు. మొన్నటి వరకు తనది నెగెటీవ్ రోల్ అంటే ఎలా ఉంటుందో అన్న చర్చ జరిగింది. ఇప్పుడు తన పాత్ర పేరు కర్ణ సేన్ అనేసరికి, నార్త్ లో మాత్రం ఇది ఎన్టీఆర్ ని ఎలివేట్ చేసే పాత్రని కన్పామ్ అయ్యింది. కర్ణ పాత్ర ఎక్కడైనా పవర్ ఫులే.. కాకపోతే మహాభారతంలోని కొన్ని పాత్రలు నార్త్ ఇండియా లో పూనకాలు తెప్పిస్తాయి.. అలాంటి వాటిలో దేవుళ్లైన రాముడు, కృష్ణుడి తర్వాత ఆ స్థాయి పాత్ర అంటే కర్ణుడే… అందుకే వార్ 2 లో కర్ణసేన్ గా తారక్ కనిపించబోతున్నాడని ఇప్పుడు తేలేసరికి, ఎన్టీఆర్ స్టోరీ సెలక్షనే కాదు, పాత్రల ఎంపిక విషయంలో కూడా ప్రపంచ ముదురని అనాల్సి వస్తోంది. చాలా తెలవిగా పాత్రలు, కథల విషయంలో ఎన్టీఆర్ అడుగులేస్తున్నాడు.