ఎన్టీఆర్ హీరోయిన్.. ఎన్టీఆర్ డైరెక్టర్.. ఎన్టీఆర్ కథ.. ఎవరికి..?
రెబల్ స్టార్ ప్యాన్ ఇండియా కింగే కావొచ్చు... తనకి 5 పాన్ ఇండియా హిట్లతో పోలిస్తే, ఎన్టీఆర్ కి రెండే పాన్ ఇండియా హిట్లు రావొచ్చు... కాని ఎందుకో తోటి హీరోల్లో ఎక్కువ మంది, తననే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు.

రెబల్ స్టార్ ప్యాన్ ఇండియా కింగే కావొచ్చు… తనకి 5 పాన్ ఇండియా హిట్లతో పోలిస్తే, ఎన్టీఆర్ కి రెండే పాన్ ఇండియా హిట్లు రావొచ్చు… కాని ఎందుకో తోటి హీరోల్లో ఎక్కువ మంది, తననే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోయినే కావాలని ఒకరు.. కాదు కథ కావాలని ఇంకొకు… పనికట్టుకుని ఎన్టీఆర్ డైరెక్టర్ కే కాల్ చేస్తూ మరొకరు.. ఇలా చరన్, బన్నీ అండ్ కో ఎన్టీఆర్ ఏం చేస్తే అదే ఫాలో అయ్యేలా ఉన్నారు. పుష్ఫ 2 తో 1890 కోట్లు రాబట్టిన బన్నీ కూడా ఎందుకు ఎన్టీఆర్ బాటలోనే నడవాలనుకుంటున్నాడు? ఆల్రెడీ చరణ్ కి ఎన్టీఆర్ చేయాల్సిన కథే వెళ్లింది. బన్నీ చేయబోతోంది ఎన్టీఆర్ హోల్డ్ లో పెట్టిన ప్రాజెక్టే అని ప్రచారం జరుగుతోంది. ఇక జాన్వీ కపూర్ తో చరణ్ జోడీ ఎప్పుడో కన్ఫామ్ అయ్యింది. మొత్తంగా ఇప్పుడు చరణ్, బన్నీ, తోపాటు నానికి కూడా ఎన్టీఆర్ హీరోయినే కావాల్సి వచ్చినట్టుంది. ఎన్టీఆర్ కథలు.. ఎన్టీఆర్ డైరెక్టర్, ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా ఎందుకు అంతా ఎన్టీఆర్ కనెక్ట్ అయినా వాటిమీదో, వ్యక్తుల మీదో ఫోకస్ చేశారు? హావేలుక్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ విన్న కథలు, జోడీ కట్టిన హీరోయిన్లు, లేదంటే కన్ఫామ్చేసుకున్న సినిమాల రిలీజ్ డేట్లు… ఇవే ఇప్పుడు తోటి హీరోలకు టార్గెట్ అయ్యాయా? ఈడౌట్ కి ప్రజెంట్ రెబల్ స్టార్ నుంచి రామ్ చరణ్ వరకు తోటి హీరోలు వెళ్లే దారే కారణం…
తారక్ తో పోలిస్తే రెబల్ స్టార్ ఎప్పుడో పాన్ ఇండియా కింగ్ గా మారాడు. ఐదు పాన్ ఇండియా హిట్లు, 5 వేల కోట్ల వసూళ్లతో చరిత్ర స్రుష్టించాడు. అలాంటి తనకి నిన్న మొన్న పాన్ ఇండియాలో రెండు హిట్లు కొట్టిన ఎన్టీఆర్ ని ఫాలో అయ్యే అవసరం ఉందా?
అంటే ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే సినిమా అంటేనే క్రియేటివ్ వరల్డ్.. ఇక్కడ సక్సెస్ మ్యాటర్ కాని ఎక్స్ పీరియన్స్ కాదు… అందుకే ఎన్టీఆర్ విన్న కథే రామ్ చరణ్ సినిమాగా చేస్తున్నాడు. ఆ కథని, ఆప్రాజెక్టుని బుచ్చి బాబు ఎన్టీఆర్ తో తీయాలనుకున్నాడు. కాని రామ్ చరణ్ కోసమే ఆ ప్రాజెక్టుని త్యాగం చేశాడు తారక్. అంతవరకు ఎన్టీఆరే పని కట్టుకుని ప్రాజెక్టుని చరణ్ కి ఇచ్చాడు. ఇక్కడ తారక్ కి ఫాలో అయ్యిందేం లేదు.. కాని ఈ సినిమాలో జోడీ కట్టింది ఎన్టీఆర్ హీరోయినే… జాన్వీతో చరణ్ జోడీ కట్టాడు. ఇప్పుడు అచ్చంగా ఇదే పని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్నాడు.
ఎన్టీఆర్ విని వదిలేసిన కథనే త్రివిక్రమ్ ఇప్పుడు బన్నీకి చెప్పాడంటున్నారు. ఆ కథే పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కబోతోందని ప్రచారంజరుగుతోంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇందులో కూడా హీరోయిన్ గా జాన్వీ కపూర్ నే తీసుకునేందుకుప్రయత్నం జరుగుతోంది. ఆల్రెడీ జాన్వీని త్రివిక్రమ్ టీం కలిసింది కూడా…రెండు నెలలుగా ప్రశాంత్ నీల్, కొరటాల శివ తో బన్నీ కనీసం మూడు సార్లు కలిచి కథా చర్చలు చేశాడని తెలుస్తోంది. అంటే దేవర తో ఎన్టీఆర్ కి హిట్ ఇచ్చిన కొరటాల శివ, డ్రాగన్ గా ఎన్టీఆర్ ని చూపించే పనిలో ఉన్న ప్రశాంత్ నీల్… వీళ్లే బన్నీ ప్రజెంట్ టార్గెట్.. ఇలా చూస్తూ ఎన్టీఆర్ తో జోడీ కట్టిన హీరోయిన్లు, ఎన్టీఆర్ విని వదిలేసిన కథలు, ఎన్టీఆర్ తో సినిమాలు తీసిన దర్శకులు వీళ్లే బన్నీ, చరణ్ టార్గెట్ అయినట్టున్నారు.
ఇక నార్త్ మార్కెట్ ని ఏలుతున్న ప్రభాస్ కూడా ఎన్టీఆర్ లానే, ఓ స్ట్రేయిట్ హిందీ మూవీలో స్పెషల్ రోల్ వేయబోతున్నాడట. అచ్చంగా వార్ 2 లో ఎన్టీఆర్ విలన్ గా కనిపించినట్టే, ప్రభాస్ పనికట్టుకుని రణ్ బీర్ కపూర్ కోసం నెగెటీవ్ రోల్లో గెస్ట్ అప్పియరెన్స్ కి సిద్దమయ్యాడట. ఇలాంటి పోలికలన్నీ చూస్తుంటే, డెఫినెట్ గా ఇన్ని కోయిన్స్ డెంట్స్ ఉండవు.. కాబట్టే ఎన్టీఆర్ దారిలో తోటి పాన్ ఇండియా స్టార్స్ నడుస్తున్నట్టుందనే డౌట్ రాకుండా ఉండదు…