బలిపశువుగా 1000 కోట్ల కటౌట్.. అభిమానమే కొంప ముంచిందా..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ కి దేశవ్యాప్తాంగా మాసెస్ లో భారీగా ఫాలోయింగ్ పెరిగింది. త్రిబుల్ ఆర్ తో పాటు దేవర పుణ్యమాని ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరిగిపోయింది. అదంతా తనకి మార్కెట్ పరంగా, రేంజ్ పరంగా కలిసిరావాలి... కలిసొస్తుంది కూడా...
మ్యాన్ ఆఫ్ మాసెస్ కి దేశవ్యాప్తాంగా మాసెస్ లో భారీగా ఫాలోయింగ్ పెరిగింది. త్రిబుల్ ఆర్ తో పాటు దేవర పుణ్యమాని ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరిగిపోయింది. అదంతా తనకి మార్కెట్ పరంగా, రేంజ్ పరంగా కలిసిరావాలి… కలిసొస్తుంది కూడా… కాని ఇప్పుడా ఇమేజే తనని డ్యామేజ్ చేయటానికి వాడేస్తున్నారా? 1000 కోట్ల కటౌైట్ ని చాలా ఈజీగా బలిపశువు చేశారా? లేదంటే చేస్తున్నారా? ఈ డౌట్లు రావటానికి ఎన్నో కారణాలున్నాయి. ఎవరు తనని అభిమానించినా ఇప్పుడు హీరోలు భయపడాల్సిన పరిస్థితులొచ్చాయి. సంధ్యా థియేటర్ లో జరిగింది ఓరకంగా అభిమానుల అతి వల్ల జరిగిన యాక్సిడెంటే… హీరో తప్పుకూడా ఉందని మోరల్ గా వీడియోలు తేల్చేస్తున్నాయి…. ఐతే ఇక్కడ తన ప్రమేయమే లేకుండా ఇరుక్కుపోయాడు ఎన్టీఆర్… చాలా తేలిగ్గా బలిపశువయ్యాడు… ఇష్యూ నుంచి బయటపడి కూడా బాధపడాల్సిన పరిస్తితొచ్చింది… అదెందుకో చూసేయండి.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన కెరీర్ మొత్తంలో ఎన్నడూ చూడని పరిస్థితి, ఎన్నడూ ఫేస్ చేయని సిచ్చువేషన్ ఇప్పుడు ఫేస్ చేశాడు. అభిమాని అంటూ తనకి క్యాన్సర్ వచ్చిందంటూ ఓ పేషెంట్ కౌశిక్ విజయంలో ఎన్టీఆర్ ఫేస్ చేసిన విచిత్ర పరిస్థితి ప్రతీ హీరోని ఆలోచనల్లో పడేస్తోంది. హీరోలంటే ఈజీ టార్గెట్ అయిపోయినట్టుంది. అభిమానం పేరుతో సీన్లో చిన్న ట్విస్ట్ ఇచ్చినా పెద్ద పెద్ద స్టార్లు కూడా బలిపశువులు అవ్వాల్సిందే అని తేలిపోయింది
ఎన్టీఆర్ అభిమానినంటూ కౌశిక్ అనే వ్యక్తి విషయంలో జరిగిన స్టోరీనే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. తారక్ అభిమానిగా తనని ఒకసారి చూడాలంటే ఎన్టీఆర్ ఏకంగా ఫోన్ లో లైవ్ లోకి వచ్చాడు. మాట్లాడి భరోసా ఇచ్చాడు. కట్ చేస్తే ఎన్టీఆర్ ఏలాంటి సాయం చేయలేదు. తన ఫ్యాన్సే డబ్బిచ్చారంది కౌశిక్ తల్లి..
అక్కడితో డ్యామేజ్ షురూ అయ్యింది. కాని మెల్లిగా అసలేం జరిగిందో ఇప్పుడిప్పుడే బయటికొస్తోంది. సరే ఓతల్లిగా తన కొడుకు ప్రాణం కౌశిక్ తల్లికి ముఖ్యమే…కాని కేవలం అభిమాని అన్న కోణంలో హీరో అండ్ కో సాయం చేస్తే, కంప్లీట్ గా వాళ్లని బ్లాక్ మేయిల్ చేసినట్టు పిండేసుకోవటం షాకింగ్అంటున్నారు
నిజానికి కౌశిక్ అనే పేషెంట్ కి అయిన హాస్పిటల్ బిల్లు 77 లక్షలు… ఆరోగ్య శ్రీ రూపంలో పది లక్షలు, తిరుపతి దేవస్థానం నుంచి 40 లక్సలు అందాయి… ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫండ్ రేయిస్ చేస్తే అదో 12 లక్షలొచ్చాయట.
అంటే మొత్తంద 62 లక్షల సాయం అందినట్టే, అయినా కూడా ఎన్టీఆర్ ఏమి సాయం చేయలేదంటూ కౌశిక్ తల్లి అనటం, ఆలోపే ఎన్టీఆర్ నుంచి అదనంగా 10 లక్సలు అందటం జరిగిందట. తీరా చూస్తే ఈ ఎమౌంట్ లో కొంత పాత లోన్లకే కట్టేసుకోవటంతో, అలా వాళ్లకి సరిపోలేదనే వార్తలొస్తున్నాయి. అయినా అదనంగా వీల్ చేర్, మెడిసిన్స్ కూడా కొనేలా ఎన్టీఆర్ తన టీం ని ముందుకు నడిపాడట. ఇంత చేస్తే తన మానవత్వాన్ని అభిమానం పేరుతో వాళ్లు వాడుకోవటమే కాకుండా, బద్ నాం చేశారనే రెస్పాన్స్ వస్తోంది…
ఇప్పుడు ఎవరైనా అభిమాని అంటూ ఎవరైనా స్టార్ హీరోని చూడాలని ఉందన్నా ఎవరూ నమ్మరు. ఎవరూ ఇంకే అభిమాని దగ్గరికి కూడా వెళ్లే సాహసం చేయరు. నిజం చెప్పాలంటే ఓ స్టార్ హీరో తన అభిమానికి ఈమాత్రం కూడా సాయం చేయడా అనే కామెంట్లు కూడా, ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తాయి కాబట్టి, ఇలాంటి వ్యవహారాల్లో ఆచితూచి అడుగులేయాలి. ఇలా ఇటింత రమ్మంటే ఇల్లంతా నాదే అనే ప్రయత్న ఎవరైనా చేస్తే, ఇక ఏ హీరో కూడా అభిమానిని అంటూ ఎవరూ తనదగ్గరికి వచ్చినా నమ్మే పరిస్థితి ఉండదు.. స్టార్లు ఈజీ టార్గెట్ అవుతున్నారు కాబట్టే, ఫ్యాన్స్ పేరుతో ఇలా ఈజీ రూట్ కూడా కొందరు వెతుక్కుంటున్నారనే కామెంట్లు పెరిగిపోతున్నాయి.