క్రిష్ 4లో ఎన్టీఆర్ సూపర్ గెస్ట్.. ఇంతలో సూపర్ హీరోగా పుష్పరాజ్ ..?

త్రిబుల్ ఆర్ తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి 1400 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టే ఛాన్స్ వచ్చింది. గ్లోబల్ స్టార్ గా వరల్డ్ వైడ్ గా నాటు నాటు పాటతో పాపులారిటీ దక్కింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 9, 2025 | 09:00 PMLast Updated on: Apr 09, 2025 | 9:00 PM

Ntr Is A Super Guest In Krrish 4 Meanwhile Pushparaj Is A Superhero

త్రిబుల్ ఆర్ తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి 1400 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టే ఛాన్స్ వచ్చింది. గ్లోబల్ స్టార్ గా వరల్డ్ వైడ్ గా నాటు నాటు పాటతో పాపులారిటీ దక్కింది. హాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ పేరుమారుమోగింది. అలాంటిది ఇప్పుడు ఎన్టీఆర్ కి 2000 కోట్ల క్లబ్ లోచేరే ఛాన్స్ చిక్కినట్టే కనిపిస్తోంది. ఆల్రెడీ దేవర తో 670 కోట్లు రాబట్టి, రాజమౌలి సపోర్ట్ లేకుండానే పాన్ ఇండియాని షేక్ చేయగలననిపించాడు. ఇప్పుడు హిందీ మూవీ వార్ 2తో రెండు వేల కోట్ల క్లబ్ లో చాలా తేలిగ్గా అడుగుపెట్టేలా ఉన్నాడు. ఆగస్ట్ 14 లో రిలీజ్ అయ్యాక రికార్డుల మోతమోగాలి.. కాని ప్రీరిలీజ్ బిజినెస్ పుణ్యమాని 1200 కోట్ల కిక్ వార్2 మూవీకి దక్కింది. ఈనెల 22న డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ అడుగుపెట్టే రోజు వార్ 2 టీం నుంచి ఏదో రికార్డుల ఎనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.. అదేంటో చూసేయండి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఆట్లీ తో కలిసి తను లాస్ ఏంజిల్స్ తో చేసిన హంగామా వీడియోని రిలీజ్ చేశారు. అందులో అవతార్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ , జురాసిక్ పార్క్ లాంటి సినిమాలకు పనిచేసిన గ్రాఫిక్స్ సంస్థలున్నాయి. మొత్తంగా వీడియో చూస్తే బన్నీ ఏదో సూపర్ హీరో మూవీతో మనముందుకొచ్చేలా ఉన్నాడు.కాని ఈ వీడియోరాకముందే క్రిష్ 4 లో ఎన్టీఆర్ సూపర్ హీరోగా గెస్ట్ రోల్ వేయబోతున్నాడనే వార్తొచ్చింది. వార్ 2లో నెగెటీవ్ రోల్ వేసిన ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ రిక్వెస్ట్ వల్ల క్రిష్ 4 లో గెస్ట్ రోల్ కూడా వేసేందుకు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. అది కూడా సూపర్ హీరో పాత్రే అవటంతో, ఇలాంటి రోల్ వేసిన తొలి మాస్ హీరోగా తను హిస్టరీ క్రియటే్ చేసే ఛాన్స్ఉంది.

అలాంటి టైంలో అల్లు అర్జున్, ఆట్లీ వీడియో బయటికొచ్చింది. 600 కోట్ల బట్జెడ్ తో ఏదో సినిమాను గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని తేలింది. ఈ వీడియోలో గ్రాఫిక్ డిజైనర్లు స్క్రిప్ట్ అదిరిందన్నారు. వెరైటీ క్రిచర్స్ ఉన్నాయన్నారు. హీరో రకరకాల మాస్క్ లు పెట్టుకుని, త్రీడీ ఫోటోలు దిగి, మోషన్ క్యాప్చర్ కెమెరా ముందు షో రీల్ చేశాడు.ఇవన్నీ చూస్తే అవతార్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ లాంటి ఏదో సూపర్ హీరో లేదంటే, అంతకంటే కొత్తగా గ్రాఫికల్ వరల్డ్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఆట్లీ చేస్తున్నాడని తెలుస్తోంది. కాకపోతే ఇది ఎన్టీఆర్ జర్నీతో పోలికలా మారటానికి రీజన్, తను సూపర్ హీరోగా మారే టైంలోనే బన్నీ సూపర్ హీరో కాన్సెప్ట్ కి కనెక్ట్ అవుతున్నాడు.

మొన్నటికి మొన్న ఈ మూవీలో జాన్వీ కపూరే హీరోయిన్ గా కన్ఫామ్ చేశారు. దేవరలో తారక్ సరసన మెరిసిన అతిలోక సుందరి వారసురాలినే తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్ తో డ్రాగన్ తీస్తున్న ప్రశాంత్ నీల్ తో బన్నీ కథా చర్చలు, దేవర 2 తీయబోతున్న కొరటాల శివతో బన్నీ చర్చలు చూస్తుంటే, ఎన్టీఆర్ ని అచ్చుగుద్దినట్టు అల్లు అర్జున్ అనుకరిస్తున్నాడా అన్న డౌట్ రాకుండా ఉండదు. రాజమౌలి సెంటిమెంట్ ని దేవరతో బ్రేక్ చేసిన ఎన్టీఆర్ ప్లానింగ్ నిజంగానే బన్నీకి నచ్చి ఉండొచ్చు.. కాకపోతే తారక్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన దాన వీర శూర కర్ణ లాంటి కాన్సెప్ట్ నే త్రివిక్రమ్ తో బన్నీ ప్లాన్ చేయటం చూస్తుంటే, బన్నీ కావాలనే తారక్ కి ఫాలో అవటం కాదు, తన కంటే ముందే తన దారిలో ఇంకేదో ప్రూవ్ చేయాలని ప్రయత్నిస్తున్నట్టు అర్ధమౌతోంది.