ఎన్టీఆర్ మామూలోడు కాదు.. 1000 కోట్ల విలువ అర్ధమైందా..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో బాలీవుడ్ గ్రీక్ గాడ్ చేస్తున్నమూవీ వార్ 2. ఆల్రెడీ షూటింగ్ పూర్తైంది. సింగిల్ సాంగ్ షూటింగ్ మాత్రమే పెండింగ్... కాని ఇప్పడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది మాత్రం వార్ 2 అప్ డేట్ కాదు... మొన్నటి నుంచి నెట్ లో చక్కర్లు కొడుతున్న

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో బాలీవుడ్ గ్రీక్ గాడ్ చేస్తున్నమూవీ వార్ 2. ఆల్రెడీ షూటింగ్ పూర్తైంది. సింగిల్ సాంగ్ షూటింగ్ మాత్రమే పెండింగ్… కాని ఇప్పడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది మాత్రం వార్ 2 అప్ డేట్ కాదు… మొన్నటి నుంచి నెట్ లో చక్కర్లు కొడుతున్న క్రిష్ 4 మూవీ అప్ డేట్… ఇందులో కూడా ఎన్టీఆర్ కనిపిస్తాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అది ఇప్పుడు నిజమౌతోంది. క్రిష్ 4 లో హ్రితికే టైటిల్ రోల్ వేస్తూ, డైరెక్షన్ కూడా చేయబోతున్నాడు. అది కాకుండా ఇందులో తాను ముగ్గురు సూపర్ హీరోల పాత్రల్లో కనిపించే సాహసం చేస్తున్నాడు. అదే షాకింగ్ సర్ ప్రైజ్ అంటే, ఇందులో మరో సూపర్ హీరోగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కనిపించటం… విచిత్రం ఏంటంటే ఇదే ఎన్టీఆర్ తన డ్రీమ్ ప్రాజెక్టులో నాలుగు పాత్రలేస్తున్నాడు. అలాంటి టైంలో ముగ్గురు క్రిష్ మధ్యలో ఒకే ఒక్క ఎన్టీఆర్ అనగానే లెక్కలు మారిపోయేలా ఉన్నాయి
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ హిట్ తో పాన్ ఇండియా మార్కెట్ ని సొంతం చేసుకున్నాక, దేవర వచ్చింది. దీంతో రాజమౌళి సపోర్ట్ లేకుండానే పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేస్తాడనే బ్రాండ్ ఇమేజ్ వచ్చేసింది. అలాంటి టైంలో వార్ 2 లో తారక్ విలన్ రోల్ వేస్తున్నాడనేసరికి, హిందీ మార్కెట్ కోసం కావాలనే పది అడుగులుతగ్గి, ఎన్టీఆర్ వార్ 2 చేస్తున్నాడన్నారు.పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ వచ్చాక కూడా ఎందుకు వార్ 2 లాంటి మూవీలో విలన్ గా చేయాలన్నారు. కాని రియాలిటీ మరోలా ఉంది. అదే మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ని దేశముదురు కాదు ప్రపంచ ముదురనిపించేలా ఉంది.
బాలీవుడ్ స్టార్ హ్రితిక్ అక్కడ గ్రీక్ గాడే కావొచ్చు. కాని ఎన్టీఆర్ లా పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకోలేదు. వెయ్యికోట్ల క్లబ్ లో కాదుకదా, కనీసం 500 కోట్ల క్లబ్ లో కూడా అడుగుపెట్టలేదు. అసలు ఈమధ్య తనకి సింగిల్ హిట్ లేదు. సూపర్ 30 నుంచి ఫైటర్ వరకు వరుసగా ప్లాపులే ఫేస్ చేశాడు. అలాంటి తనకి హిట్ పడటమే ఎక్కువ….అలాంటిది ఏకంగా 1200 కోట్ల వసూళ్ల వర్షం కురిస్తే ఎలా ఉంటుంది. అదే ఎన్టీఆర్ పుణ్యామని సాధ్యమౌతోంది.ఎన్టీఆర్ కి నార్త్ ఇండియా లో భారీగా మాస్ ఫాలోయింగ్ ఉందని దేవర వచ్చాకే అర్ధమౌంది. 670 కోట్ల దేవర వసూళ్లలో 350 కోట్లు పూర్తిగా నార్త్ ఇండియా నుంచి వచ్చాయంటే అక్కడ తనకెంత స్టాంగ్ గా మార్కెట్ ఉందో తెలుస్తోంది. దాని ఎఫెక్టే వార్ 2 మీద పడినట్టుంది. ఎన్నడూ హ్రితిక్ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ 300 కోట్లు కూడా దాటలేదు. అలాంటిది వార్ 2 మూవీకి 1200 కోట్లు రిలీజ్ కి ముందే కన్ఫామ్ అయ్యాయి.
వార్ 2 తెలుగు రాష్ట్రాల హక్కులు 200 కోట్లు పలికితే, తమిల్,మలయాళం, కన్నడ రైట్స్ 80 కోట్లని తెలుస్తోంది.అన్ని భాషల్లో ఆడియో రైట్స్ కలిపితే 150 కోట్లు, ఓవర్ సీస్ రైట్స్ 200 కోట్లు, ఇక నార్త్ ఇండియా రైట్స్ ఏకంగా 550 కోట్లు.. మొత్తంగా చూస్తే 1180 కోట్ల వరకు లెక్కలు తేలుతున్నాయి. రిలీజ్ కిముందే వెయ్యికోట్ల క్లబ్ లో అడుగుపెట్టే సూచనలు వార్ 2 టీం కి కనిపిస్తున్నాయి. ఇదంతా ఎన్టీఆర్ వార్ 2లో నటించటం వల్లే జరుగుతుందనుకోక తప్పదు. ఎందుకంటే ఇదే హ్రితిక్ చేసిన వార్ 1 మూవీ 350 కోట్లకు మించి వసూళ్లు రాబట్టలేదు. కాబట్టి వార్ 2 గొప్పతనం ఎన్టీఆర్ దే అని హ్రితిక్ కి కూడా అర్ధమైనట్టుంది. అందుకే మొన్న జరిగిన ఓ ఈవెంట్ లో ఎన్టీఆర్ చాలా గొప్ప కో స్టార్ అంటూనే, తన ఫేవరెట్ స్టార్ అని కూడా అన్నాడు. ఆకాశానికెత్తాడు… సో తన స్టేట్ మెంట్ వెనక ఇంత ప్రాక్టికల్ లెక్కలున్నాయికాబట్టే, తారక్ మీద తను అంతగా ప్రేమని కురిపిస్తున్నాడు.