ఎన్టీఆర్ తెలివైనోడు… ప్రభాస్ ఇరుక్కున్నాడు..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బేసిగ్గానే దేశ ముదురనే పేరుంది. స్టోరీ డిస్క్రర్షన్ లో, ప్రాజెక్ట్ సెలక్షన్ లో ఇలా అన్నీంట్లో చాలా జాగ్రత్తగా ఉంటాడు మ్యాన్ ఆఫ్ మాసెస్.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బేసిగ్గానే దేశ ముదురనే పేరుంది. స్టోరీ డిస్క్రర్షన్ లో, ప్రాజెక్ట్ సెలక్షన్ లో ఇలా అన్నీంట్లో చాలా జాగ్రత్తగా ఉంటాడు మ్యాన్ ఆఫ్ మాసెస్. కాని ఈ విషయంలో మొహమాటానికి పోయి రెబల్ స్టార్ ఇబ్బందులు పడుతున్నాడు. ఆల్రెడీ ఇబ్బంది పడ్డాడు కూడా… ఐతే ఎన్టీఆర్ చేయాల్సిన ఓ పాత్ర విషయంలో ప్రభాస్ ఇరుక్కున్నాడని, కొత్త గా ప్రచారం జరుగుతోంది. ఫ్రెండ్స్ కి భోజనం పెట్టి చంపేసే డార్లింగ్ మంచితనాన్ని చాలా మంది వాడేసుకునే ప్రయత్నం చేశారు. అలానే మంచు విష్ణు కూడా తన మూవీ కన్నప్ప లో రెబల్ స్టార్ ని ఎంతగ వాడాలో అంతగా వాడేశాడు. అది కూడా రెమ్యునరేషన్ లేకుండా… విచిత్రం ఏంటంటే అసలు ఈ పాత్రని చేయాల్సింది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. కాని తను మంచు విష్ణు ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడే సున్నితంగా తిరస్కరించాడట. ప్రభాస్ ఇరుక్కున్నాడట… ఇలాంటి డిస్కర్షన్ ఇప్పుడు ఇండస్ట్రీలో పెరిగింది… ఇంతకి ఎందుకిది ఎన్టీఆర్ తెలివైన నిర్ణయం… ఎందుకు ప్రభాస్ ఇరుక్కున్నాడనంటున్నట్టు..? టేకేలుక్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి మొహమాటం కాస్త తక్కువే.. చెప్పాలనకున్నది సూటిగా సుత్తిలేకుండా చేప్పేతత్వం కూడా ఉంది. అన్నీంటికి మీంచి స్టేజ్ మీద మైక్ పడితే మాటల వర్షం కురిపిస్తాడు. ఇంటర్వూల్లో సెటైర్లు విసిరేస్తాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే, తను ఎన్నడూ సినిమాల సెలక్షన్ విషయంలో, ప్రాజెక్టులు ఒప్పుకోవటంలో మొహమాటపడడు. ఆవిషయంలో క్రిస్టల్ క్లియర్ గా ఉంటాడు.
అందుకే ఒక పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడనే జోకులుపేలుతున్నాయి. మంచు విష్ణు మూవీ కన్నప్ప కోసం తనని కూడా ఫిల్మ్ టీం సంప్రదించిందట. అందులో నిజానికి రెబల్ స్టార్ ప్రభాస్ వేసిన పాత్ర కోసమే తనని ముందు సంప్రదించారట. కాని వార్ 2, డ్రాగన్ కమిట్ మెంట్స్ వల్ల టైం కేటాయించేలని తేల్చేశాడట తారక్..
కేవలం 3 రోజుల డేట్లు ఇస్తే చాలాని కనీసం నాలుగైదు సార్లు మంచు విష్ణు తన చుట్టూ తిరిగాడనే ప్రచారం జరిగింది. కాని మంచు విష్ణు సినిమాలో మెరిస్తే ఆ హీరో పరిస్థితి జాలి పడేలా మారిపోతుందనే అభిప్రాయముంది. అలా అనే కాదు కాని, గెస్ట్ రోల్ వేయాల్సి వచ్చినా అన్నీ చూసుకునే అడుగు ముందుకేస్తాడు తారక్.ఆవిషయంలో డార్లింగ్ ప్రభాస్ కాస్త మొహమాటానికి పోయినట్టున్నాడు. అందుకే మంచు ఫ్యామిలీ ఆఫర్ చేస్తే కన్నప్పలో కాసేపే కనిపించే పాత్ర వేశాడు. ఇప్పుడు టీజర్ వచ్చింది. జోకుల మీద జోకులు పేలటానికి టీజరే కారణమైంది. ఇది 200 కోట్ల బడ్జెట్ మూవీనా? ఎందుకు అసలు ప్రభాస్ ఈ పాత్ర వేశాడు..? టీజర్ మొత్తంలో ఏదైనా బాగుందంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ విజువల్స్ మాత్రమే… అయినా కూడా ఎందుకు ప్రభాస్ ఈ ప్రాజెక్టు చేశాడనే ప్రశ్నలు తన ఫ్యాన్స్ నుంచే వినిపిస్తున్నాయి
రెబల్ స్టార్ ఇమేజ్ ని మంచు విష్ణు ఫ్రీగా వాడేసుకుంటున్నాడనే కామెంట్లు కూడా పెరిగాయి. అసలు కన్నప్పలో హీరో ఎవరనే సెటైర్లు కూడా పేలుతున్నాయి. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, ఇలా సౌత్, నార్త్ అందరు బడా స్టార్లతో గెస్ట్ రోల్స్ వేయించి తన కన్నప్పను ప్రమోట్ చేసుకుంటున్నాడు. కాని టీజర్ చూస్తే చాలా మంది సినిమా మీద జాలి పడేలా ఉందంటున్నారు. ఇలాంటి మూవీలో ఫ్రెండ్ షిప్ కోసం మోహమాటం వల్ల ప్రభాస్ బుక్కైతే, ఎన్టీఆర్ మాత్రం చాలా తెలివిగా ఎస్కేపయ్యాడనే కామెంట్లు షురూ అయ్యాయి. అంతటికీ షాక్ ఇచ్చిన కన్నప్ప టీజరే కారణం.