NTR, KALYANRAM:తారకరత్నను చూసేందుకు వచ్చిన జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

NTR-Kalyan Ram at bangalore hrudalayalaya hospital

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 29, 2023 | 10:29 AMLast Updated on: Jan 31, 2023 | 8:53 AM

Ntr Kalyanramతారకరత్నను చూసేందుకు వ

తారకరత్న నందమూరి కుటుంబంలో హీరోగా కొద్దికాలం రాణించి జయాపజయాలను ఎదుర్కొన్నారు. తరువాత సినిమాలకు కొంత దూరంగా ఉన్నారు. విలన్ గా కూడా ఇటీవలే అడపా దడపా ఓటిటి వేదికలపై ఒకటి రెండు సినిమాల్లో కనిపించారు. తాజాగా జరిగిన నారా లోకేశ్ యువగళం పాదయాత్రతో ప్రజల ముందుకు వచ్చారు. పాదయాత్ర ప్రారంభంమై కొద్ది దూరం నడిచేటప్పటికే ఆయన నీరసించారు. క్రమక్రమంగా అక్కడి ప్రజల మధ్య తోపులాటకు గురైయ్యారు. దీంతో సరిగ్గా ఊపిరి తీసుకునేందుకు కష్టపడి చివరకు చేతకాకుండా సృహ తప్పి పడిపోయారు. వెనువెంటనే ప్రాధమిక చికిత్స అందించి బెంగళూరులోని హృదయాలయా ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకునే మార్గమధ్యంలో కూడా నిపుణుల సహాయంతో ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అప్పటికే ఆయన పూర్తిగా చలనం లేకుండా ఉండి చేతివేళ్లు, శరీరంలో కొన్ని భాగాలు నీలిరంగులోకి మారుతూ వచ్చాయి.

హెల్త్ బుటిటెన్ లో 90 నుంచి 95 శాతం వరకూ బ్లడ్ సర్కూలేషన్ బ్లాగ్ అయ్యాయి. స్టంట్ వేయడం కుదరలేదు. స్టంట్ వేస్తే మళ్లీ తిరిగి హార్ట్ ఎటాక్ వచ్చే పరిస్థితి ఉంటుందని డాక్టర్లు చెప్పినట్లు తెలిపారు బాలకృష్ణ. నిన్న తారక్ పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందని బాలకృష్ణ చెప్పారు. కాసేపు హార్ట్ ఆగిపోయి మళ్లీ తిరిగి బీట్ కొట్టుకుంటుందని తెలిపారు. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ అన్న ఆరోగ్యం నిలకడగా ఉంది. అలాగని ప్రమాదం నుంచి బయటపడినట్టు కాదు అని చెప్పారు. కళ్యాణ్ రామ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కర్నాటక వైద్య ఆరోగ్య శాఖా మంత్రి మాట్లాడుతూ ప్రమాదం నుంచి బయటపడినట్లు కాదు. అలాగని కోలుకున్నట్లు కాదు అని వివరించారు. ఇంకా నింబస్ నుంచి ప్రముఖ డాక్టర్లను పిలిపిస్తున్నారని తెలిపారు. దీనిపై ప్రముఖ నిర్మాత చిట్టిబాబు స్పందిస్తూ వైద్యానికి తారక్ సహకరిస్తున్నారని అన్నారు. తనకు మంచి దగ్గర పరిచయం అంటూ తనను పెద్దనాన్న అని పిలిచేవాడని చెప్పుకొచ్చాడు. అయితే తారక్ సిగరెట్ ఎక్కవగా తాగుతారని, సమస్యలకు కుంగిపోయే మనస్తత్వం కాదని తెలిపారు. అలాగే మరో ఆసక్తికరమైన కామెంట్స్ కూడా చేశారు. తారక్ రాజకీయాల్లో రావాలని ఆసక్తిగా ఉన్నాడని, ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నాట్లు తెలిపారు. అలాగే తారక్ తో పాటూ మిగిలిన కొందరు ఒక టీంగా ఉన్నారనే విషయాలను వెల్లడించారు. తారక్ మయోకార్డియల్‌ ఇన్‌ఫార్క్‌షన్‌ అనే జబ్బు బారిన పడటం ఇదే తొలిసారి అని కొందరు చెబుతున్నారు.

కొందరు కార్డియాలజిస్ట్లు ఇలా నీలి రంగులోకి మారడానికి కారణం గుండెకు రక్తం సరఫరా ఆగి బ్లాగ్స్ పనితీరు నెమ్మదించినప్పుడు ఇలా జరుగుతాయని చెబుతున్నారు. మళ్లీ తిరిగి ఫంక్షనింగ్ సజావుగా జరిగితే తిరిగి పింక్ రంగులోకి మారుతుందని తెలిపారు. ప్రస్తుతం తారక్ కి హార్ట్ మొత్తం ఫెయిల్యూర్లో ఉందని, ఒక వాల్ కూడా పూర్తిగా పాడైపోయిందని సమాచారం. దీని ప్రకారం కొద్ది సమయం పాటూ వేచిచూడాలని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కోలుకోవడం కష్టసాధ్యమైనా ఈరోజుల్లో ఉన్న అత్యాధునిక వైద్యపరికరాలతో చికిత్స అందించవచ్చని చెబుతున్నారు. ఎక్మామిషెన్ ద్వారా కోలుకునే అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నారు. స్టంట్ కు సహకరించకుంటే హార్ట్ రీ ట్రాన్స్ ప్లెంటేషన్ చేయాలి అని కార్డియాలజిస్ట్ నిపుణులు సూచిస్తున్నారు. తారక్ తిరిగి కోలుకొని రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారా లేదా అనేది వేచిచూడాలి.