ఎక్కడ కొట్టాలో తెలిసిన ఎన్టీఆర్… మ్యాన్ ఆఫ్ మాసెస్ ప్లానింగ్..
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర మూవీ ఈనెల 27న అంటే మరో రెండు వారాల్లో రాబోతోంది. ముంబైలో ట్రైలర్ లాంచైంది. భారీగా బాలీవుడ్ మీడియా వచ్చేసింది.
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర మూవీ ఈనెల 27న అంటే మరో రెండు వారాల్లో రాబోతోంది. ముంబైలో ట్రైలర్ లాంచైంది. భారీగా బాలీవుడ్ మీడియా వచ్చేసింది. అక్కడి లోకల్ హీరో సినిమా రిలీజ్ కి ఉన్న హడావిడికంటే ఎక్కువే హంగామా అక్కడ కనిపించింది.
ఇక త్రిబుల్ఆర్ లో కలిసి నటించిన ఆలియాభట్ కూడా ఎన్టీఆర్ కోసం దేవర ప్రమోషన్ కోసం రంగంలోకి దిగింది. అంతేకాదు కరణ్ జోహార్ ఈ సినిమా హిందీ రైట్స్ తీసుకోవటం వల్ల తను కూడా నార్త్ ఇండియా ప్రమోషన్ లో పార్టిసిపేట్ చేశాడు. ఎలాగూ జాన్వీకపూర్, విలన్ గా నటించిన సైఫ్ ఆలీ ఖాన్ బాలీవుడ్ స్టార్సే కాబట్టి, వాళ్ల వల్ల కూడా నార్త్ లో ఈ సినిమాకు మంచి ప్రమోషనే దక్కింది. ఐతే హైద్రబాద్, చెన్నై, బెంగుళూరే, కొచ్చి, లేదంటే అమరావతిలో కాకుండు ముంబైలోనే, అది కూడా హిందీ వర్షన్ నే ఎందుకుముందు ప్రమోట్ చేస్తున్నాడు తారక్ అన్న డౌట్ పెరిగింది.
కారణం రిలీజ్ కి ఇంకా రెండున్నవారాల టైం ఉంది. కాబట్టి, ముందుగా నార్త్ ఇండియాలో ప్రమోట్ చేస్తే అక్కడ ఊపు మొదలౌతుంది. తర్వాత సౌత్ లో ఎలాగూ తనకి భారీ ఫాలోయింగ్ ఉంది కాబట్టి, కాస్త ప్రమోషన్ తగ్గినా నష్టం ఉండదనే కోణంలో ఇలా నార్త్ మీదే నజర్ వేశాడు తారక్. అంతేకాదు వారం రోజుల పాటు హిందీ మీడియా, అలానే యూ ట్యూబ్ చానల్స్ కి ఇంట్ర్వూలతో గడపబోతున్నాడు. 3 రోజుల్లో 100 యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వూలంటే రోజులకు కనీసం 33 ఇంటర్వూల్ ఇవ్వాలి.. అలా కూడా నార్త్ లో బారీగా దేవరని ప్రమోట్ చేస్తున్నాడు తారక్.
ఇలా ఈరేంజ్ లో ఎవరూ పాన్ ఇండియా మూవీని ప్రమోట్ చేయలేదు. ఆఖరికి బాహుబలి, త్రిబుల్ ఆర్ కి కూడా రాజమౌళి ఇలాంటి స్ట్రాటజీ ఫాలో కాలేదు. ప్రభాస్ ఎంత పాన్ ఇండియా కింగ్ అయినా, తను అతి తక్కువ ఇంటర్వూలకే పరిమితమయ్యాడు. ఐతే దేవర విషయంలో మోస్ట్ పాపులర్ హిందీ కమేడియన్ కపిల్ శర్మ షో లో రెండు సార్లు ప్రమోట్ చేయబోతున్నాడు తారక్. ఆల్రెడీ ఒక సారి కపిల్ శర్మ షో కి దేవర ప్రమోషన్ కోసం వెళ్లిన తారక్, మళ్లీ 27న మరో సారి వెళ్లబోతున్నాడట. అలా ఒకే షో లోరెండు సార్లు దేవర ప్రమోషన్ ప్లాన్ చేసి బాలీవుడ్ నే షాక్ కి గురిచేస్తున్నాడు. మరే హిందీ సినిమా కూడా ఇలా ఎప్పుడూ కపీల్ శర్మ షోలో ప్రమోట్ కాలేదు.. ఇలా ఎన్టీఆర్ ప్లానింగ్ చూస్తుంటే, పబ్లిసిటీని పీక్స్ కి తీసుకెళ్లేలా ఉన్నాడు.