ఎన్టీఆర్, మహేశ్ జంపో ప్యాక్… సైలెంట్ బాంబ్ పేల్చబోతున్నారా..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మళ్లీ ఫ్రెంచ్ గడ్డంతో స్టైలిష్ గా మారిపోతే ఎలా ఉంటుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు రాజమౌళి సినిమా తర్వాత సీరియస్ మోడ్ లోకి వెళ్లిపోతే ఇంకెలా ఉంటుంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మళ్లీ ఫ్రెంచ్ గడ్డంతో స్టైలిష్ గా మారిపోతే ఎలా ఉంటుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు రాజమౌళి సినిమా తర్వాత సీరియస్ మోడ్ లోకి వెళ్లిపోతే ఇంకెలా ఉంటుంది. అదే జరిగేలా ఉంది. పుష్ప2 తర్వాత రామ్ చరణ్ మూవీకి కమిటైన సుకుమార్, సైలెంట్ గా ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. సెన్సేషన్ క్రియేట్ చేసే బాంబేదో పేల్చేందుకు నిర్మాతలతో మీటింగ్ పెట్టేశాడు. మైత్రీ మూవీ మేకర్స్, యూవీ ప్రొడక్షన్ కంబైండ్ గా సూపర్ జంబో ప్రాజెక్ట్ ఏదో కన్ఫామ్ అయ్యేలా ఉంది. వార్ 2 , డ్రాగన్ తో ఎన్టీఆర్, రాజమౌళి మూవీతో మహేశ్ బాబు బిజీ అయ్యారు. కాని 2 ఏళ్ల తర్వాత సుకుమార్ సినిమాతో ఈ ఇద్దరు సూపర్ బిజీ కాబోతున్నారు. అంటే చరణ్ తర్వాత ఎన్టీఆర్ తో మరో హీరో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడా? వెంకీ తర్వాత మహేశ్ మూవీలో మరోసారి మరో స్టార్ తళుక్కుమనబోతున్నాడా? ఈ డౌట్లు టాలీవుడ్ బాక్సాఫీస్ ఫేట్లు మార్చేలా ఉన్నాయి. మైండ్ బెండ్ చేసే ఏదో పెద్ద స్కెచ్చే లెక్కల మాస్టర్ వేసినట్టు తెలుస్తోంది.. అదేంటో చూసేయండి.
దేవర తర్వాత ఎన్టీఆర్ వార్ 2 పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఫిబ్రవరి 10 లోపు హిందీ మూవీ వార్ 2 పూర్తవుతుంది. ఆల్ మోస్ట్ వచ్చే నెల రెండో వారంలోనే వార్ 2 షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేఛాన్స్ ఉంది. దీంతో ఇక వచ్చేనెల నుంచి పూర్తిగా డ్రాగన్ షూటింగ్ తోనే ఎన్టీఆర్ బిజీ అవుతాడు. ఆతర్వతే దేవర2, అలానే జైలర్ ఫేం నెల్సన్ దిలీప్ తీసే ప్రాజెక్ట్ ప్యార్ లల్ గా మొదలయ్యే అవకాశం ఉంది.
ఆతర్వాత ఏంటి? దానికే బ్రహ్మండం బద్దలయ్యే ప్లానింగ్ రెడీ చేస్తున్నాడు సుకుమార్. ఆల్రెడీ ఎన్టీఆర్ తో గతంలో నాన్నకు ప్రేమతో సినిమా తీశాడు. 250 కోట్ల వసూళ్లని తారక్ కి పరిచయం చేశాడు. పాన్ఇండియా ఇమేజ్ రాకముందు, తన కెరీర్ లో ఇంత హెవీగా వసూల్లు రాబట్టింది నాన్నకు ప్రేమతో మూవీనే…
అరవింద సమేత వీరరాఘవ, దేవర లాంటి మాస్ మూవీలు వందలకోట్లు రాబట్టడం కామన్. కాని క్రియేటివ్ కాన్సెప్ట్ ని ఎమోషన్ గా తీసి నాన్నకు ప్రేమతోగా హిట్ మెట్టెక్కించటం ఈ లెక్కల మాస్టర్ కే కుదిరింది. అందుకే మళ్లీ ఎన్టీఆర్ తో కాంబినేషన్ అంటే, అది కూడా పుష్ప2 లాంటి హిట్ పడ్డాక అంటే, సినీ సునామేదో వచ్చే ఛాన్స్ఉంది
కాకపోతే రామ్ చరణ్ తో సుకుమార్ ఆల్రెడీ మూవీకి కమిటయ్యాడు. బుచ్చిబాబుతో చరణ్ చేస్తున్న పెద్ద పూర్తి కాగానే అంటే ఈ ఇయర్ లోగా సుకుమార్, రామ్ ఛరణ్ ప్రాజెక్ట్ పట్టెలెక్కుతుంది. అదయ్యాకే ఎన్టీఆర్ తో సుకుమార్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని తెలుస్తోంది
సుకుమార్ కూడా రంగస్థలం తర్వాత చరణ్ తో సినిమా రిపీట్ చేసినట్టే, నాన్నకు ప్రేమతో తర్వాత ఎన్టీఆర్ తో మూవీ ప్లాన్ చేస్తున్నాడు. వన్ నేనొక్కడినే తర్వాత మహేశ్ బాబుతో కూడా సుకుమార్ సినిమా ఉంటుందట. అయితే చరణ్ తో సుకుమార్ మూవీ మొదలై, పూర్తయ్యేలోగా ఎన్టీఆర్ కమిటైన ప్రాజెక్టులు పూర్తవుతాయి. తనతో సినిమా పూర్తయ్యేలోగా రాజమౌళితో మహేశ్ బాబు మూవీపూర్తవుతుంది. సో ఇలా లెక్కేసుకునే మైత్రీ మూవీ మేకర్స్, యూవీ ప్రొడక్షన్స్ ఇలా నిర్మాతలతో నెక్ట్స్ 5 ఏళ్లకు, 5 వేల కోట్ల లెక్కల్ని ముందే క్యాలిక్యులేట్ చేస్తున్నాడు సుకుమార్.
గతం సంగీతేమో కాని, పుష్ప1, పుష్ప2 తర్వాత సుకుమార్ మేకింగ్ కి పాన్ ఇండియా మాస్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. అలాంటి డైరెక్టర్ తో ఆల్రెడీ రెండు సార్లు పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్న ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కాలి కాని, బాక్సాఫీస్ బద్దలే…