వార్ 2 హిట్ అయితే ముంబైలో ఫ్లాట్ కొన్నట్టే రోయ్

దేవర సినిమాతో తానేంటి అనేది టాలీవుడ్ కి, బాలీవుడ్ కి చూపించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మొరిగే నోళ్ళు మొరుగుతూనే ఉంటాయి మన పని మనం చేయడమే అనుకున్నాడో ఏమో దుమ్ము రేపాడు. దేవర సినిమా వసూళ్లు ఇప్పుడు ఓ రేంజ్ లో ఉంటున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 10, 2024 | 10:09 AMLast Updated on: Oct 10, 2024 | 10:09 AM

Ntr Planning For Buy New House In Mumbai

దేవర సినిమాతో తానేంటి అనేది టాలీవుడ్ కి, బాలీవుడ్ కి చూపించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మొరిగే నోళ్ళు మొరుగుతూనే ఉంటాయి మన పని మనం చేయడమే అనుకున్నాడో ఏమో దుమ్ము రేపాడు. దేవర సినిమా వసూళ్లు ఇప్పుడు ఓ రేంజ్ లో ఉంటున్నాయి. బాలీవుడ్ సినిమాలకు ఎదురెల్లాడు దేవర. ఇక బాలీవుడ్ లో కూడా ఇప్పుడు దేవర గురించి చర్చ మొదలైంది. అక్కడి సినిమాల కంటే వెయ్యి రెట్లు బెటర్ గా ఉందని హిందీ వచ్చిన వాళ్ళు సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. అందుకే వసూళ్లు కూడా అక్కడ పెరిగాయి.

దేవర విషయంలో విష ప్రచారం చేయడంలో బాలీవుడ్ కూడా ఓ చెయ్యి వేసింది. కాని ఆ చేతిని విరిచి సముద్రంలో పడేసాడు దేవర. దేవర దెబ్బకు బాలీవుడ్ హీరోలకు ఓ టార్గెట్ ఫిక్స్ అయ్యేలా కనపడుతోంది. 800 కోట్లు దేవర వసూలు చేస్తే ఎన్టీఆర్ టార్గెట్ ఫిక్స్ చేసినట్టే. ప్రభాస్ అయితే ఏకంగా 1200 కోట్లు టార్గెట్ పెట్టాడు. దేవర కొండ ఎక్కడమే బాలీవుడ్ కు కష్టం రా అనుకుంటే ప్రభాస్ ది ఆకాశం. అందుకోవాలంటే మల్టీ స్టారర్ సినిమా చేసినా సాధ్యం అయ్యేలా కనపడటం లేదు. ఇక ఇప్పుడు వార్ 2 తో ముంబైలో యుద్ధం చేయడానికి ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడు.

వార్ 2 సినిమా షూట్ లో ఈ నెల ఎన్టీఆర్ పాల్గొంటాడు. ఇప్పటికే ఎన్టీఆర్ తో ఏం షూట్ చేయాలి ఏంటీ అనే దానిపై దర్శకుడు అన్నీ సెట్ చేసుకున్నాడు. ఎన్టీఆర్ తో షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక ఓ పాట కూడా ఎన్టీఆర్ తో షూట్ చేయాల్సి ఉంది. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్టెప్ లు వేయాల్సి ఉంది. ఇక ఈ సినిమా అక్కడ హిట్ అయి ఎన్టీఆర్ పాత్రకు మంచి మార్కులు పడితే మాత్రం కథ మారుతుంది. దేవర గురించి ముంబై తీరంలో కచ్చితంగా చర్చ జరుగుతోంది అనడంలో సందేహం లేదు.

ఇక వార్ 2 సినిమా హిట్ అయితే బాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ బిజీ అయ్యే అవకాశం కచ్చితంగా ఉంటుంది. తెలుగులో కన్నడలో ఎన్టీఆర్ కు మంచి మార్కెట్ ఉంది కాబట్టి రోల్ ఏదైనా సరే ఎన్టీఆర్ ను చూస్తారు. అందుకే ఇక ఎన్టీఆర్ ముంబైలో దిగితే తనకు ఓ ఇల్లు ఉండాలని ప్లాన్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ముంబై కోసం ఎన్టీఆర్ ఇప్పుడు ఓ ప్లాన్ తో రంగంలోకి దిగే సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి. క్రమంగా అక్కడ స్నేహితులు కూడా పెరుగుతున్నారు. ఇవన్నీ మంచి శకునాలే తారక్ కి. అందుకే ఇల్లు కొంటే తిరుగు ఉండదు అని కూడా ప్లాన్ చేయవచ్చు అంటున్నారు జనాలు.