ఎన్టీఆర్ అడుగేసేలోపే కొట్టేయాలి… గురూజీ కాపీ..
సీనియర్ ఎన్టీఆర్ సినిమాలను ఈ తరంలో ఎవరైనా రీమేక్ చేస్తే అది బాలయ్య, లేదంటే ఎన్టీఆర్ జూనియర్ లో ఎవరో ఒకరు చేస్తారనుకోవచ్చు..

సీనియర్ ఎన్టీఆర్ సినిమాలను ఈ తరంలో ఎవరైనా రీమేక్ చేస్తే అది బాలయ్య, లేదంటే ఎన్టీఆర్ జూనియర్ లో ఎవరో ఒకరు చేస్తారనుకోవచ్చు.. కాని ఇక్కడ వింత జరగబోతోంది. ఎన్టీఆర్ కి తన తాత సినిమాల్లో ఎంతో ఇష్టమైన దాన వీర శూర కర్ణ మీద కన్నేశాడు అల్లు వారి హీరో. పుష్ప2 తర్వాత నిజానికి త్రివిక్రమ్ మేకింగ్ లో ఈ మైథాలజీ మూవీనే పట్టాలెక్కాలి. కాని ఎక్కడో బన్నీకి వెన్నులో వణుకు పుట్టిందో, ధైర్యం సరిపోలేదో.. మొత్తానికి గురూజీని ముందుకు నెట్టిన తనే, వెనక్కి వెళ్లాడు. కట్ చేస్తే మళ్లీ ఎందుకో త్రివిక్రమ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. బన్నీ పుష్పరాజ్ గా దూసుకెళ్లాడు కావొచ్చు.. కాని మైథాలజీ మూవీలు బన్నీ వల్ల అవుతుందా? ఎన్టీఆర్ తర్వాత రాముడిగా, కృష్ణుడిగా బాలయ్య దుమ్ముదులిపాడు. యమదొంగలో యంగ్ యమగా ఎన్టీఆర్ బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. అలాంటి రిస్కీ పాత్రలు బన్నీ చేయగలడా? రెబల్ స్టార్ లాంటి కటౌైట్ కే కంటెంట్ తేడా కడితే ఏమౌతుందో ఆదిపురుష్ తో తేలింది. మరి బన్నీ కోసం ఎన్టీఆర్ కాన్సెప్ట్ ని గురూజీ కాపీ కొడితే వర్కవుట్ అవుతుందా? హావేలుక్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రీమ్ ప్రాజెక్టు దాన వీర శూర కర్ణ. ఇందులో కర్ణుడు, కృష్ణుడు, దుర్యోధనుడి పాత్రలో సీనియర్ ఎన్టీఆర్ కనిపించాడు. హిస్టరీ క్రియేట్ చేశాడు. అలాంటి సినిమాను ఈ తరంలో తీయాలంటే, ఆరేంజ్ డైరెక్టర్ దొరకాలి… అక్కడే సరైన దర్శకుడు, సాలిడ్ స్క్రీప్ట్ కోసం వేయిటింగ్ అని ఎన్నో సార్లు తారక్ చెప్పాడు.కట్ చేస్తే ఇప్పుడా మూవీ కథని త్రివిక్రమ్ లాగేసుకున్నాడనంటున్నారు. ఈతరానికి మాడ్రన్ వర్షణ్ దాన వీర శూర కర్ణ చెప్పాలనేది ఎన్టీఆర్ డ్రీమ్. అచ్చంగా అదే కాన్సెప్ట్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి అప్లై చేసే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇది ఇప్పుడు భారీగా పెరిగిన ప్రచారం.
దాన వీర శూర కర్ణ మాడ్రన్ వర్షన్ అంటే ఆ పాత్రలని బేస్ చేసుకుని, ఇప్పుడున్న సమాజంలో మనుషులకు అప్లై చేయటం. ఓరకంగా ప్రస్థుత సొసైటీలో కర్ణుడు లాంటి వ్యక్తి, కృష్ణుడిలా ఆలోచించేవ్యక్తి, దుర్యోధనుడిలా ఫైట్ చేసే శక్తి.. ఇలా మూడు పాత్రలని తీసుకుని మాడ్రన్ గా కథచెప్పాలి, సినిమాచేయాలనేది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రీమ్.
కాని ఈ కాన్సెప్ట్ ని కాపీ కొట్టేస్తున్నాడు త్రివిక్రమ్ అంటున్నారు. ఇంతవరకు మైథాలజీ ని అందరూ ఒకలా చూపిస్తే, ఎవరూ టచ్ చేయని పాత్ర అంటూ త్రివిక్రమ్ టీం నుంచి ఫీలర్స్ వస్తున్నాయి. అల్లు అర్జున్ కి కథ నచ్చినా, ఎందుకో ధైర్యా సరిపోవట్లేదనే మాటలు వినిపిస్తున్నాయి. నిజానికి ఎంత మైథాలజీని, మాడ్రన్ వరల్డ్ కి అన్వయించినా, అలాంటి భారమైన పాత్రలు వేయాలంటే తేలిక కాదు.
ఎన్టీఆర్ కే అప్పట్లో అది సాధ్యమైంది. బాలయ్య కూడా రాముడిగా, కృష్ణుడిగా, శ్రీ కృష్ణ దేవరాయలుగా కనిపించాడు. తాత లానే ఎన్టీఆర్ కూడా యమగోలని యమదొంగలో చూపించాడు. యంగ్ యమగా మెరిశాడు. సో ఆదిపురుష్ లోరాముడిగా ప్రభాస్ వస్తే మీసకట్టు మీద కామెంట్లు పడ్డాయి. బాక్సాఫీస్ లో వసూళ్ల వరదలు తగ్గాయి. కాబట్టే ఈరూటు మిగతా హీరోలకి పంటి పోటు అనటానికి ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలానే ఉన్నాయి. అందుకే ఎన్టీఆర్ డ్రీమ్ కాన్సెప్ట్ ని త్రివిక్రమ్ లాగేసుకుని బన్నీతో మూవీ తీస్తే వర్కవుట్ అవుతుందా అన్న డిస్కర్షన్ మొదలైంది.