డిక్షనరీ మింగావా బ్రో, ఎన్టీఆర్ టాలెంట్ కు మీడియా షాక్
ఎక్కడికి వెళ్తే ఆ భాష, ఎవరు ఏ భాషలో ప్రశ్న అడిగినా అదే భాషలో వాళ్లకు సమాధానం...” ఇప్పుడు దేవర సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ నుంచి జరుగుతుంది అదే. ఇటీవల కన్నడ వెళ్తే అక్కడ మీడియాతో మాట్లాడుతూ కన్నడ స్పష్టంగా మాట్లాడాడు.
ఎక్కడికి వెళ్తే ఆ భాష, ఎవరు ఏ భాషలో ప్రశ్న అడిగినా అదే భాషలో వాళ్లకు సమాధానం…” ఇప్పుడు దేవర సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ నుంచి జరుగుతుంది అదే. ఇటీవల కన్నడ వెళ్తే అక్కడ మీడియాతో మాట్లాడుతూ కన్నడ స్పష్టంగా మాట్లాడాడు. ఆ వీడియో బాగా వైరల్ అవుతోంది ఇప్పటికీ. జనాలు ఆరా తీస్తే అది ఎన్టీఆర్ మదర్ టంగ్ అనే విషయం క్లారిటీ వచ్చింది. మదర్ టంగ్ అయినా అంత బాగా మాట్లాడటం వేరే భాషలో అనే చాలా కష్టం. దానికి తోడు గతంలో కన్నడ పాటలు కూడా బాగా పాడాడు ఎన్టీఆర్.
సరే అయిపొయింది… తర్వాత హిందీలో సినిమా ప్రమోషన్ ను ముంబైలో చేసారు. కపిల్ శర్మ షోలో ప్రమోట్ చేసారు. అక్కడ హిందీ భాష… తెలుగు ఎంత బాగా మాట్లాడతాడో హిందీ అలాగే చాలా సింపుల్ గా మాట్లాడేసాడు. ఆ వీడియోలు కూడా బాగానే వైరల్ అయ్యాయి. ఇప్పుడు తమిళనాడులో సినిమా ప్రమోషన్ జరిగింది. అక్కడికి వెళ్తే తమిళంలో మాట్లాడాడు. ఆ మాట్లాడటం కూడా చాలా పక్కాగా… ఏదో పరాయి భాష వాడు మాట్లాడినట్లు కాకుండా మాట్లాడాడు ఎన్టీఆర్. అది చూసి అక్కడి మీడియా వాళ్ళు కూడా షాక్ అయ్యారు.
ఇవన్నీ చూస్తున్న ఫ్యాన్స్ చిన్నప్పుడు ఏమైనా డిక్షనరీ మింగావా అన్న అంటూ ఎన్టీఆర్ వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్ వచ్చిన సమయంలో కూడా అంతే. ఎన్టీఆర్ ఇంగ్లీష్ లో చాలా బాగా మాట్లాడాడు. దీనితో ఎన్టీఆర్ టాలెంట్ చూసి జనాలు షాక్ అవుతున్నారు. అంత సింపుల్ గా అన్ని భాషలు ఎలా వస్తాయని, ఒకటి రెండు భాషలే సరిగా రావడం లేదు అంటూ సెటైర్లు వేస్తున్నారు. దానికి తోడు అన్ని భాషల్లో డబ్బింగ్ ఎన్టీఆర్ ఏ చెప్పాడు. హిందీ, కన్నడ, తమిళం భాషల్లో తన డబ్బింగ్ తానే చెప్పుకున్నాడు.