దేవర తర్వాత వార్ 2, తర్వాత డ్రాగన్ ఇలా వరుసగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా లు పైప్ లైన్ లో ఉన్నాయి. కట్ చేస్తే మొన్నటి వరకు వచ్చిన గాసిప్సే నిజమయ్యాయి. తనతో సినిమా తీసేందుకు కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ ఎంత క్యూరియస్ గా ఎదురుచూస్తున్నాడో తేలింది. ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ఆఫర్ వచ్చినా, తను హైద్రాబాద్ టు చైన్నై చెక్కర్లు కొట్టడం మానేయలేదు. ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, తెలుగు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇద్దరూ వేరు కాదు.. ఆ ఇద్దరు తనకి చాలా చాలా ముఖ్యం అంటున్నాడు. ఒకేసారి ఇద్దరితో సినిమా లు సెట్స్ పైకి తీసుకెళుతున్నాడు. ఇంతవరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే ఇద్దరు పాన్ ఇండియా స్టార్లతో ఒకే డైరెక్టర్, రెండు సినిమాలు ఒకే సారి మొదలు పెట్టలేదు. రిలీజ్ చేయలేదు. కాని అదే జరిగేలా ఉంది. జైలర్ 2, ఎన్టీఆర్ మూవీ ఒకేసారి షురూ అయ్యేలా ఉన్నాయి. బేసిగ్గా పెద్ద హీరోలతో సినిమా అంటే ఒకటి తర్వాత ఒకటి తీస్తారు...అలా కాకుండా ఎందుకు ఒకేసారి రెండు హెవీ బడ్జెట్ మూవీలు ప్యార్ లల్ గా తీయాల్సి వస్తోంది..? అంత అవసరమేమొచ్చింది..? మ్యాన్ ఆఫ్ మాసెస్ తో సినిమా కోసం జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ ఎంత ఈగర్ గా వేయిట్ చేస్తున్నాడో, తన ప్లానింగ్ బట్టే తెలుస్తోంది. తన చేతిలో ఏకంగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా నే ఉంది.. అయినా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కోసం తన ప్రయత్నాలు ఆపలేదు. మొన్నటికి మొన్న కేవలం స్టోరీలైనే ఓకే అయ్యింది. ఇంకా కథ సిద్దం కాలేదని నిర్మాత నాగవంశీ అన్నాడు. కట్ చేస్తే ఇప్పుడు కథ పూర్తి చేయటం కాదు, రజినీకాంత్ మూవీతో పాటు ఎన్టీఆర్ సినిమా ను ప్యార్ లల్ గా తెరకెక్కించే పనిలో ఉన్నాడు నెల్సన్ దిలీప్. సూపర్ స్టార్ లాంటి హీరో తో సినిమా అంటే పూర్తిగా ఫోకస్ అంతా ఆ సినిమా మీదే ఉంచాలి. లేదా ఎన్టీఆర్ తో సినిమా అంటే పూర్తిగా ఈ ప్రాజెక్టుకైనా అంకితమవ్వాలి. అలాంటిది రెండు పెద్ద కటౌట్లని తెలిసి కూడా, ఒకేసారి రెండు పాన్ ఇండియా మూవీలను ప్యార్ లల్ గా ప్లాన్ చేశాడు నెల్సన్ దిలీప్. వార్ 2 ని ఈ నెలాఖర్లో గా పూర్తి చేయబోతున్న తారక్, ఫిబ్రవరిలో డ్రాగన్ సెట్లో జాయిన్ అవుతాడు. అదవ్వటానికి కనీసం 9 నెలల టైం అయినా పడుతుంది. ఇక రజినీకాంత్ కూడా లోకేష్ కనకరాజ్ తో చేస్తున్నకూలీ మూవీ ఆగస్ట్ కి పూర్తయ్యే ఛాన్స్ ఉంది సో ఆల్ మోస్ట్ ఎన్టీఆర్, రజినీకాంత్ ఇద్దరూ ఒకే టైంలో ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు కేవలం ఎన్టీఆర్ తోనే సినిమా ప్లాన్ చేస్తే, రజినీకాంత్ ప్రాజెక్ట్ మిస్ అవుతుంది. లేదా డిలే అవుతుంది. అలాని రజినీకాంత్ సినిమా జైలర్ 2 ని సెప్టెంబర్ లో మొదలు పెడితే, ఎన్టీఆర్ దేవర2 షూటింగ్ కి వెళ్లే ఛాన్స్ ఉంది.. అలా ఎన్టీఆర్ ఆఫర్ మిస్ అవ్వొచ్చు. అందుకే ఒకేసారి సెప్టెంబర్ లో ఎన్టీఆర్ మూవీని, రజినీకాంత్ సినిమా జైలర్ ని ఒకేసారి లాంచ్ చేయటమే కాదు, ప్యార్ లల్ గా తెరకెక్కించేలా ప్లాన్ చేసుకున్నాడట డైరెక్టర్ నెల్సన్ దిలీప్. ఈ విషయంలో రజినీకాంత్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కాని ఇంకా ఎన్టీఆర్ ని కలవకపోవటంతో, తననుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదట. ఫైనల్ స్టోరీని నెరేట్ చేసి తనని కూడా కన్విన్స్ చేసే పనిలో ఉన్నాడు నెల్సన్ [embed]https://www.youtube.com/watch?v=GNLRn4mcklE[/embed]