ఎన్టీఆర్ టార్గెట్ కల్కీ… యుద్ధం మొదలు
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం దేవరపై ఇప్పుడు భారీ అంచనాలు ఫ్యాన్స్ కు సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం రెండేళ్ళ సమయం కేటాయించడం తో అసలు సినిమా ఏ రేంజ్ లో ఉంటుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం దేవరపై ఇప్పుడు భారీ అంచనాలు ఫ్యాన్స్ కు సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం రెండేళ్ళ సమయం కేటాయించడం తో అసలు సినిమా ఏ రేంజ్ లో ఉంటుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆచార్య సినిమా ఫ్లాప్ తో కొరటాల శివకు ఈ సినిమా చాలా కీలకం. ఇక ఎన్టీఆర్ కు కూడా ఇప్పుడున్న పరిస్థితిలో ఈ సినిమా విజయం అవసరం. అందుకే ఎన్టీఆర్ చాలా శ్రద్దగా ఈ సినిమాపై ఫోకస్ పెట్టి పని చేసిన విషయం స్పష్టంగా చెప్పవచ్చు.
ఈ నెల 27 న విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ ఇప్పటికే లెక్కలు వేయడం మొదలుపెట్టారు. ఇక విదేశాల్లో కూడా ఈ సినిమాపై పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ అవుతోంది అనే చెప్పాలి. ఈ సినిమాతో ఎన్టీఆర్ టార్గెట్ 600 కోట్లు అని అందుకు తగ్గట్టు గానే సినిమా కోసం ప్లాన్ చేసారని అంటున్నారు టాలీవుడ్ జనాలు. అయితే ఇప్పుడు అమెరికాలో ఈ సినిమా ప్రీ సేల్స్ ఒక రేంజ్ లో సంచలనం అయ్యాయి. ఎన్నడు లేని విధంగా 5 లక్షల డాలర్లకు పైగా వసూలు చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు.
ప్రీ బుకింగ్ కే ఈ రేంజ్ లో క్రేజ్ ఉంటే సినిమాకు హిట్ టాక్ వస్తే ఎలా ఉంటుందా అంటూ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్‌గానే ప్రీ బుకింగ్స్‌ను యు.ఎస్‌లో ఓపెన్ చేయగా అక్కడ ఈ సినిమా హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే టాలీవుడ్ కు కల్కీ సినిమా కొత్త టార్గెట్ పెట్టింది. పొరపాటున ఎన్టీఆర్ ఆ టార్గెట్ దగ్గరకు వెళ్తే… కనీసం ప్రయత్నం జరిగింది అనే సంకేతాలు వచ్చినా అటు బాలీవుడ్ కూడా షేక్ అవ్వడం ఖాయం కనపడుతోంది. ఏది ఎలా ఉన్నా దేవర సినిమా మాత్రం ఇప్పుడు టాలీవుడ్ రేంజ్ ని కచ్చితంగా పెంచుతుంది అంటున్నారు జనాలు.