అబ్బాయికి దేవర సపోర్ట్… కమాన్ మై బాయ్

టాలీవుడ్ లో యంగ్ హీరోలు ఒక్కొక్కరిగా తెరంగేట్రం చేస్తున్నారు. స్టార్ హీరోల వారసులు ఇప్పుడు తమ లక్ ను టెస్ట్ చేసుకునేందుకు టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. తాజాగా వైవీఎస్ చౌదరి నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరోని పరిచయం చేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 30, 2024 | 05:01 PMLast Updated on: Oct 30, 2024 | 5:01 PM

Ntr Tweet On Janaki Ram Son

టాలీవుడ్ లో యంగ్ హీరోలు ఒక్కొక్కరిగా తెరంగేట్రం చేస్తున్నారు. స్టార్ హీరోల వారసులు ఇప్పుడు తమ లక్ ను టెస్ట్ చేసుకునేందుకు టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. తాజాగా వైవీఎస్ చౌదరి నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరోని పరిచయం చేసారు. ఎందరో హీరోలను టాలీవుడ్ కు పరిచయం చేసిన వైవీఎస్ చౌదరి ఇప్పుడు నందమూరి జానకీ రామ్ కుమారుడ్ని టాలీవుడ్ కు పరిచయం చేసారు. ఇటీవల దీనికి సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన… కొత్త హీరోని పరిచయం చేస్తున్నట్టు ప్రకటించారు.

నేడు ఉదయం ఈ మేరకు ఆయన ఒక వీడియోని విడుదల చేస్తూ… జానకీ రామ్ కుమారుడు నందమూరి తారక రామారావును టాలీవుడ్ కు పరిచయం చేసారు. న్యూ ట్యాలెంట్ రోర్స్ ప‌తాకంపై ఆయ‌న భార్య గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కీర‌ణ‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప‌లు విష‌యాల‌ను అభిమానులతో షేర్ చేయడానికి ఆయన ఓ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసారు. ఇక యువ ఎన్టీఆర్ పవర్ ఫుల్ లుక్స్ తో, బేస్ వాయిస్ తో చూడగానే ఆకట్టుకునే లుక్ తో ఈ వీడియో లో కనిపించాడు.

వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ… సీనియ‌ర్ ఎన్టీఆర్ పై ఆస‌క్తితో తాను ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన‌ట్లు తెలిపాడు. తాను ఈ స్థానంలో ఉండ‌డానికి ఎన్టీఆర్ ఇచ్చిన ప్రోత్సాహ‌మే కార‌ణ‌మ‌ని తెలిపారు. ఎన్టీఆర్ త‌న మునిమ‌న‌వ‌డు రూపంలో వ‌చ్చార‌ని ఎన్టీఆర్ అనే మూడు అక్ష‌రాల తార‌క‌మంత్రం అన్నారు. ఆర‌డుగుల రూపం ఈ తార‌క రామారావుదని తెలిపారు. ఈ తార‌క‌రామారావును కూడా ఆదరిస్తార‌ని కోరుకుంటున్నా అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సినిమా వీడియోని నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.

దీనిపై జూనియర్ కూడా రియాక్ట్ అయి తన అన్న కొడుక్కి శుభాకాంక్షలు చెప్పారు. రామ్ మొదటి స్టెప్ కు ఆల్ ది బెస్ట్ అని ఎక్స్ లో పోస్ట్ చేసాడు. సినిమా ప్రపంచం మీకు ఆదరించడానికి లెక్కలేనన్ని అవకాశాలను అందజేస్తుంది… కచ్చితంగా విజయం వరిస్తుందని తెలిపాడు. మీ ముత్తాత ఎన్టీఆర్ గారు, తాతగారు హరికృష్ణ గారు, నాన్న జానకిరామ్ అన్న ప్రేమ, ఆశీస్సులతో నువ్వు ఉన్నత శిఖరాలకు చేరుకుంటావనే నమ్మకం నాకుంది. షైన్ మై బాయ్‌ అని పోస్ట్ చేసాడు. కళ్యాణ్ రామ్ కూడా యువ ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు చెప్పాడు.