ఎన్టీఆర్ vs హృతిక్ Dance… 30 కోట్ల సెట్లో 300 స్టెప్పులు…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న సీన్ వచ్చేసింది. హిందీలో ఫస్ట్ టైం తను చేస్తున్న వార్ 2 మూవీ సాంగ్ షూటింగ్ షురూ కాబోతోంది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న సీన్ వచ్చేసింది. హిందీలో ఫస్ట్ టైం తను చేస్తున్న వార్ 2 మూవీ సాంగ్ షూటింగ్ షురూ కాబోతోంది. ఈ నెలాఖర్లోనే సాంగ్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఆల్రెడీ రిహార్సిల్స్ అయిపోయాయని తెలుస్తోంది. రిహార్సల్స్ టైంలో ఆ డాన్స్ చూసి, అలానే ఇప్పటి వరకు తీసిన సినిమా ఫుటేజ్ చూసే, ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా ఫిదా అయ్యాడన్నారు. మరో మూవీ ప్లాన్ చేసేందుకు ఇష్టపడ్డడని కూడా వార్తలొచ్చాయి. ఏదేమైనా 30 కోట్ల సెట్లో ముందుగా పాట షూటింగ్ ని షురూ చేయబోతున్నారు. మొత్తం 5 సెట్లు,అంటే 150 కోట్ల ఖర్చుతో ఐదు సెట్లు వేసినట్టని తెలుస్తోంది. ఇక ఆ సెట్లో ఎన్టీఆర్ మాస్ డాన్స్ హ్రితిక్ క్లాస్ డాన్స్ స్టెప్పులతో భూమ్ బద్దలయ్యేలా ఉంది. ఆ పాట మేకింగ్ వీడియోని ఉగాదికి రివీల్ చేస్తారని తెలుస్తోంది. శివరాత్రికి వార్ 2 మూవీ పోస్టర్ల లాంచ్ కి కూడా ముహుర్తం చూస్తోంది ఫిల్మ్ టీం.
ఎప్పుడెప్పుడా అని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న టైం వచ్చింది. బాలీవుడ్ గ్రీక్ గాడ్ తో డాన్స్ ఫ్లోర్ మీద ఎన్టీఆర్ పోటీ ఎప్పుడూ అన్న క్యూరియాసిటీ, తెలుగు ఫ్యాన్స్ కే కాదు, నార్త్ ఇండియన్స్ కి కూడా ఎక్కవే. బేసిగ్గా స్పీడ్ డాన్స్ అన్నా, ఊర మాస్ డాన్స్ తోపాటు ఊపుతెప్పించే డాన్స్ ని తేలిగ్గా చింపేసే హీరో ఎన్టీఆర్. ఇక హ్రితిక్ రోషన్ అంటే హిపాప్, బ్రేక్ డాన్స్ తో పాటు క్లాస్ డాన్స్ కి కేరాఫ్ అడ్రస్. సో తన స్టైల్లో తాను ఈజీగా స్మూత్ గా వెస్టర్న్ డాన్స్ లో దూసుకెళ్లే తనని, తారక్ ఎలా తట్టుకుంటాడని మొదట్లో అన్నారు. కాని ఇప్పుడు ఎన్టీఆర్ ఎనర్జీని, స్పీడ్ డాన్స్ మూవ్స్ ని హ్రితిక్ తట్టుకుంటారా అనంటున్నారు. సినిమాషూటింగ్ మొదలైనప్పుడు ఉన్న మాట, ఇప్పుడు లేదు..
అంతగా ఏం జరిగిందో కాని అంతా హ్రితిక్ తో ఎన్టీఆర్ డాన్స్ తోపోటీ పడితే చూడాలని తెగ ఆరాట పడుతున్నారు. ఆ ఆరాటం మరీ ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ లోనే ఎక్కువ కనిపిస్తోంది. సోషల్ మీడియాలో టైగర్ కే సాత్ హ్రితిక్ అంటున్నారు. ఆల్రెడీ వార్ 2 సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. కేవలం హ్రితిక్, ఎన్టీఆర్ కాంబినేషన్ సాంగ్ తోపాటు క్లైమాక్స్ ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది.అసలే వార్ 2 మూవీ రషెస్ చూసి ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా ఫిదా అయ్యానే ప్రచారం జరుగుతోంది. మరో సినిమా ఆఫర్ చేసి, ఆ ప్రాజెక్ట్ ,చర్చలు కూడా మొదలు పెట్టారట. దీంతో వార్ 2 లో ఎన్టీఆర్ తన పెర్ఫమెన్స్ తో వార్ వన్ సైడ్ చేశారనే ఇంప్రెషన్ కూడా బీటౌన్ లో వచ్చేసిందని తెలుస్తోంది. ఇక పాటలో కూడా హ్రితిక్ మూవ్స్ ని ఎన్టీఆర్ డామినేట్ చేస్తే, హిందీ లో తొలి సినిమాతోనే మ్యాన్ ఆఫ్ మాసెస్ మ్యాజిక్ చేసినట్టౌతుంది.
అదే వచ్చే వారం జరగబోతోంది. ముందు 30 కోట్ల ఖర్చుతో వేసిన సెట్లో సాంగ్ షూటింగ్ చేయబోతున్నారు. అలా మరో 4 సెట్లు అంటే 150 కోట్ల ఖర్చు ఐదు సెట్లకు అయినట్టు తెలుస్తోంది. ఇంత ఖర్చు చేసి 3000 మంది డాన్సర్లతో సాంగ్ షూట్ చేయబోతున్నారు. డాన్స్ స్టెప్స్ కూడా 300 అని తెలుస్తోంది.మొత్తంగా 30 కోట్ల సెట్, 300 స్టెప్స్, 3 వేల మంది డాన్సర్లతో ఈ పాటు వచ్చే వారం బాలీవుడ్ సెట్ ని షేక్ చేసేలా ఉంది.అలానే శివరాత్రికి మూవీ పోస్టర్ తో పాటు సాంగ్ మేకింగ్ వీడియోని లాంచ్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.