1000 కోట్ల తీన్మార్… ఏక్.. దో.. తీన్.. ఎన్టీఆర్…

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డాన్స్ వేస్తే ఫ్లోర్ షేక్ అవ్వాలి... ఒక వేళ ఫ్లోర్ డాన్సే వేయటం మొదలు పెడితే ఇక బేస్ మెంట్ పగిలిపోవాలి... చరణ్, బన్నీ, ఇలా టాలీవుడ్ లో మంచి డాన్సర్స్ ఉన్నారు. కాని మాస్ డాన్స్ అంటే ఎన్టీఆర్ మాత్రమే.. అంతగా మాస్ పాత్రలు, మాస్ మూవీలు చేయటమే కాదు,

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 30, 2024 | 01:40 PMLast Updated on: Oct 30, 2024 | 1:40 PM

Ntr Vs Hruthik Roshan In War 2

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డాన్స్ వేస్తే ఫ్లోర్ షేక్ అవ్వాలి… ఒక వేళ ఫ్లోర్ డాన్సే వేయటం మొదలు పెడితే ఇక బేస్ మెంట్ పగిలిపోవాలి… చరణ్, బన్నీ, ఇలా టాలీవుడ్ లో మంచి డాన్సర్స్ ఉన్నారు. కాని మాస్ డాన్స్ అంటే ఎన్టీఆర్ మాత్రమే.. అంతగా మాస్ పాత్రలు, మాస్ మూవీలు చేయటమే కాదు, మాస్ డాన్స్ లో ఎక్స్ పర్ట్ గా మారాడు. అందుకే వార్ 2 సాంగ్స్ షూటింగ్ అనగానే, హ్రితిక్ పక్కన ఎన్టీఆర్ ఎలా డాన్స్ చేస్తాడో అని కాకుండా… అసలు ఎన్టీఆర్ స్పీడ్ ని హ్రితిక్ తట్టుకుంటాడా అనంటున్నారు. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ కి డాన్స్ లో మజిల్స్ ఉన్నమైఖెల్ జాక్సన్స్ గా పేరుంది… అలాంటి తనే కంగారు పడే పరిస్థితి నిజంగా ఉంటుందా అంటే, ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. దాని వెనకో లాజిక్ ఉంది. రెహమాన్ ఎంత గొప్ప ట్యూన్స్ ఐనా కంపోజ్ చేస్తాడేమో, కాని ఇంతవరకు తనకు మాస్ సాంగ్ విషయంలో ఒక్కసారి కూడా సక్సెస్ కాలేదు.. అదే ఇళయరాజా క్లాస్ సాంగ్సే కాదు మాస్ సాంగ్స్ కొడితే తిరుగుండదు… ఇక్కడ ఆ ఫార్ములా ప్రకారమే, హ్రితిక్ ని ఎన్టీఆర్ భయపెట్టేలా ఉన్నాడా?

ఎన్టీఆర్ స్పీడ్ డాన్సర్ మాత్రమే కాదు, మాస్ ని మెస్మరైజ్ చేసే స్టెప్స్ కి కేరాఫ్ అడ్రస్. తనెంతగా క్లాసికల్ డాన్స్ తెలిసిన హీరోనే అయినా, ఊర మాస్ స్టెప్స్ తో ఫ్లోర్ ని ఊగిపోయేలా చేయాలంటే సెట్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంటరవ్వాల్సిందే.

దేవర పాటల్లో అనిరుద్ మ్యూజిక్ లో కాస్త మ్యాజిక్ తగ్గినా, ఎన్టీఆరే తన స్టెప్స్ తో పాటలకు ఊపు తెచ్చాడు. సినిమా భారాన్నే కాదు, పాట తూటాలా మార్చే భారాన్ని కూడా సోలోగా తానే మోశాడు. అందుకే దేవర పాటలకు ఆరేంజ్ రెస్పాన్స్ వచ్చిందిఐతే ఇప్పడు హిందీ మూవీ వార్ సీక్వెల్ వార్ 2 తాలూకు పాటల షూటింగ్ కి రంగం సిధ్దమైంది. వార్ 2 ఫైట్ ఎపిసోడ్ తర్వాత ఓ పాటని తెరకెక్కించేందుకు సర్వం సిద్దమైంది. ఇక మూడు పాటలకు డాన్స్ ని కూడా కంపోజ్ చేశారట.

విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ ని తట్టుకోవటం హ్రితిక్ వల్ల అవుతుందా అన్న ప్రశ్న ఎదురవ్వటం.. బేసిగ్గా వార్ 2 మూవీ ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో మొదటి సినిమా…అందులో లీడ్ రోల్ చేస్తున్న హ్రుతిక్ రోషన్ ఆల్రెడీ బాలీవుడ్ హీరో… కాబట్టి ఎన్టీఆర్ కే వార్ 2 లో నటించాలన్నా, డాన్స్ చేయాలన్నా కొత్తగా, కాస్త ఇబ్బందిగా అనిపించాలి.

కాని పాత్రల్లో పాతుకుపోయే నటుడిగా, మాస్ లోకి చొచ్చుకెళ్లే స్టార్ గా దేవరతో తానేంటో రెండో సారి పాన్ ఇండియా లెవల్లో ప్రూవ్ చేశాడు. బాలీవుడ్ లో తన క్రేజ్ ఏంటో కూడా ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి వార్ 2 సెట్లో తను తిరిగి అడుగుపెట్టినా హ్రితిక్ అండ్ టీం కంగారు పడాలే కాని, ఎన్టీఆర్ కి వచ్చే ఇబ్బందేంలేదు.

కాని ఇప్పుడు డిస్కర్షన్ అంతా డాన్స్ గురించే.. హ్రితిక్ రోషన్ అంటేనే ప్రభుదేవ లాంటి లివింగ్ లెజెండ్ నే మించిన ఫ్లెక్సిబులిటీ ఉన్న స్టార్… దేశ విదేశాల్లో కూడా హ్రితిక్ రోషన్ కి ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి స్టారే ఇప్పుడు ఎన్టీఆర్ డాన్స్ చూసి కంగారుపడాల్సి రావటం వెనక ఉన్న రీజన్, మాస్ మూవ్ మెంట్..

హ్రితిక్ రోషన్ ఎంత బాగా డాన్స్ చేసినా, ఎన్టీఆర్ లా మాస్ మూవ్ మెంట్స్ కష్టమే… తన బాడీ లాంగ్వేజే వేరు… రెహమాన్ పాటలెంత బాగున్నా, తను మాస్ సాంగ్స్ లో మాత్రం చాలా వీక్.. అదే చిలకమ్మా చిటికేయంటా అంటూ ఇళయరాజ పాట అందుకుంటే, ఆ ఊపుని రెహమాన్ పాటలు మ్యాచ్ చేయలేవు… ఇలా పోల్చి చూస్తే డాన్స్ లో హ్రితిక్ రెహమాన్ అయితే, ఎన్టీఆర్ ఇళయరాజా మాస్ సాంగ్ లాంటివాడు… కాబట్టే తనని తట్టుకోవటం, హ్రితిక్ కి కష్టమే అన్న డిస్కర్షన్ మొదలైంది.