ఎన్టీఆర్ Vs రామ్ చరణ్.. అక్కడ దేవరను మడతేసి కొట్టిన చిట్టి బాబు..!

జూనియర్ ఎన్టీఆర్ జపాన్ మార్కెట్ మీద చాలా ఫోకస్ చేశాడు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాను కూడా పక్కనపెట్టి వారం రోజుల పాటు దేవర సినిమాను జపాన్లో బాగా ప్రమోట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 29, 2025 | 08:06 PMLast Updated on: Mar 29, 2025 | 8:06 PM

Ntr Vs Ram Charan

జూనియర్ ఎన్టీఆర్ జపాన్ మార్కెట్ మీద చాలా ఫోకస్ చేశాడు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాను కూడా పక్కనపెట్టి వారం రోజుల పాటు దేవర సినిమాను జపాన్లో బాగా ప్రమోట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. మార్చి 28న ఈ సినిమా అక్కడ విడుదలైంది. సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కు జపాన్ లో లభించిన ఆదరణ చూసిన తర్వాత దేవర అక్కడ కచ్చితంగా రికార్డు ఓపెనింగ్ తెచ్చుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ రియాలిటీ మాత్రం మరోలా ఉంది. దేవర మొదటి రోజు జపాన్ కలెక్షన్స్ ఊహించిన దానికంటే చాలా తక్కువగా ఉన్నాయి. అసలు ఇంత తక్కువ ఓపెనింగ్ వస్తుందని ఎన్టీఆర్ కూడా అస్సలు ఊహించి ఉండడు. గత రెండేళ్లలో చాలా తెలుగు సినిమాలు జపాన్ లో విడుదలయ్యాయి. వాటన్నింటి కంటే దేవర సినిమాకు ఫస్ట్ డే తక్కువ టికెట్స్ బుక్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే రెండేళ్ళ కింద రంగస్థలం సినిమా కంటే తక్కువ టికెట్స్ ఈ సినిమాకు బుక్ అయ్యాయి.

ఎన్టీఆర్ చేసిన ప్రమోషన్స్‌కు ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్‌కు ఎక్కడా సంబంధం లేదు. ఇవన్నీ చూసి నిజంగానే ‘దేవర’ సినిమాకు ఇంత క్రేజ్ ఉందా అనుకున్నారు కానీ సీన్ అయితే అలా కనిపించట్లేదు. సీన్ కట్ చేస్తే బిలో యావరేజ్ ఓపెనింగ్ వచ్చింది. ముఖ్యంగా ప్రభాస్, రామ్ చరణ్ సినిమాలకు దరిదాపుల్లో కూడా లేదు ‘దేవర’. అంతెందుకు ప్రభాస్ కల్కి జపాన్‌లో ఫ్లాప్ అయింది.. కానీ ఈ సినిమాకు మొదటి రోజు దాదాపుగా 3436 టికెట్స్ అమ్ముడయ్యాయి. 2023లో రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ చిత్రాన్ని జపాన్‌లో విడుదల చేస్తే.. దానికి ఫస్ట్ డే అప్పట్లోనే 2500కి పైగా టికెట్స్ బుక్ అయ్యాయి. అప్పట్లో అది నాన్ #RRR రికార్డ్ కూడా. ‘రంగస్థలం’ సినిమా కోసం జపాన్ వెళ్లలేదు రామ్ చరణ్.. కనీసం ఒక్కటంటే ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు.. అయినా కూడా ఈ సినిమాకు రికార్డ్ ఓపెనింగ్ వచ్చింది. కానీ ఇప్పుడు దేవర కోసం తారక్ ఇంత కష్టపడినా కూడా అక్కడ బిలో యావరేజ్ ఓపెనింగ్ రావడం అర్థం కాని విషయం.

వారం రోజులు అక్కడే ఉండి.. అన్ని జపనీస్ మీడియాను కవర్ చేసాడు.. ఎన్నో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు.. థియేటర్స్‌కు వెళ్లి డాన్సులు చేసాడు.. ఇవన్నీ చేసినా మొదటి రోజు కేవలం 1200 టికెట్స్ మాత్రమే అమ్ముడయ్యాయి. ప్రమోషన్స్ చేసాడు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఇవి కూడా వచ్చేవి కావేమో అనే మీమ్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో. ఎవరేం అన్నా.. ఎన్టీఆర్‌కు మాత్రం జపాన్‌లో ఫాలోయింగ్ ఉందనే మాట నిజం. కాకపోతే దేవర జపనీస్‌కు సరిపోయే సినిమా కాదు. దానికి మన దగ్గరే నెగిటివ్ టాక్ వచ్చింది.. కానీ తన స్టామినాతో సినిమాను నిలబెట్టి చూపించాడు ఎన్టీఆర్. అలాంటి సినిమాను తీసుకెళ్లి జపాన్‌లో చూడమంటే ఎందుకు చూస్తారు చెప్పండి.?? నిజంగా మంచి సినిమాను తీసుకెళ్లి అక్కడ చూడమని చెప్తే అప్పుడు వచ్చే వసూళ్లతో తారక్ రేంజ్ ఏంటి అనేది తెలుస్తుంది అంటున్నారు విశ్లేషకులు. మ్యాటర్ ఏదైనా కూడా చరణ్ వర్సెస్ తారక్ పోరులో మాత్రం ప్రస్తుతానికి రామ్ చరణ్ రెండు అడుగులు ముందే ఉన్నాడు.