ముగ్గురు హృతిక్ రోషన్లు… ఒక్క మగాడు NTR..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో బాలీవుడ్ గ్రీక్ గాడ్ చేస్తున్నమూవీ వార్ 2. ఆల్రెడీ షూటింగ్ పూర్తైంది. సింగిల్ సాంగ్ షూటింగ్ మాత్రమే పెండింగ్... కాని ఇప్పడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది మాత్రం వార్ 2 అప్ డేట్ కాదు...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 10, 2025 | 07:56 PMLast Updated on: Apr 10, 2025 | 7:56 PM

Ntr War With Hrithik Roshan

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో బాలీవుడ్ గ్రీక్ గాడ్ చేస్తున్నమూవీ వార్ 2. ఆల్రెడీ షూటింగ్ పూర్తైంది. సింగిల్ సాంగ్ షూటింగ్ మాత్రమే పెండింగ్… కాని ఇప్పడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది మాత్రం వార్ 2 అప్ డేట్ కాదు… మొన్నటి నుంచి నెట్ లో చక్కర్లు కొడుతున్న క్రిష్ 4 మూవీ అప్ డేట్… ఇందులో కూడా ఎన్టీఆర్ కనిపిస్తాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అది ఇప్పుడు నిజమౌతోంది. క్రిష్ 4 లో హ్రితికే టైటిల్ రోల్ వేస్తూ, డైరెక్షన్ కూడా చేయబోతున్నాడు. అది కాకుండా ఇందులో తాను ముగ్గురు సూపర్ హీరోల పాత్రల్లో కనిపించే సాహసం చేస్తున్నాడు. అదే షాకింగ్ సర్ ప్రైజ్ అంటే, ఇందులో మరో సూపర్ హీరోగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కనిపించటం… విచిత్రం ఏంటంటే ఇదే ఎన్టీఆర్ తన డ్రీమ్ ప్రాజెక్టులో నాలుగు పాత్రలేస్తున్నాడు. అలాంటి టైంలో ముగ్గురు క్రిష్ మధ్యలో ఒకే ఒక్క ఎన్టీఆర్ అనగానే లెక్కలు మారిపోయేలా ఉన్నాయి

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హ్రితిక్ తో ఆల్రెడీ ఎన్టీఆర్ వార్ 2 మూవీ చేశాడు. సింగిల్ సాంగ్ షూటింగ్ సగంలో ఆగింది. కాని అది కూడా హ్రితిక్ కాలి గాయం మానాక పూర్తిచేస్తారు. ఇక ఈనెల 22న ఎన్టీఆర్ డ్రాగన్ సెట్లో అడుగుపెట్టబోతున్నాడు. ఇలాంటి టైంలో హ్రితిక్ రోషన్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ క్రిష్ 4 ఎనౌన్స్ మెంట్ రాబోతోంది

ఎన్టీఆర్ డ్రాగన్ సెట్లో అడుగు పెట్టే రోజే ఈ ఎనౌన్స్ మెంట్ ఉండే ఛాన్స్ఉంది. తన సినిమాకు,డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ అడుగుపెట్టే రోజుకి ఏంటి లింకంటే, క్రిష్ 4 లో కూడా ఎన్టీఆర్ నటించబోతుండటమే.

మరి వార్ 2 సెట్లో ఫ్రెండ్ షిప్ కుదిరిందో, లేదంటే అలా వర్కవుట్ అయ్యిందో కాని, క్రిష్ 4 లో హ్రితిక్ టైటిల్ రోల్ ప్లేస్ చేస్తే, ఎన్టీఆర్ గెస్ట్ రోల్ వేస్తాడట. సూపర్ హీరోగా కనిపిస్తాడట. ఇది పూర్తిగా హ్రితిక్ రోషన్ నుంచి ఎన్టీఆర్ కి వచ్చిన రిక్వెస్టే.. తారక్ కూడా సూచన ప్రాయంగా ఓకే చెప్పాడని, కథ ఒక సారి వినాలనుకుంటున్నాడని తెలుస్తోంది…

వార్ 2 సాంగ్ పెండింగ్ పోర్షన్ షూటింగ్ టైం లోపు క్రిష్ 4 కథ, రఫ్ గా రెడీ అవుతుందని తెలుస్తోంది. సో అప్పుడే సెట్లోనే ఎన్టీఆర్ కి నెరేషన్ ప్లాన్ చేసినట్టున్నాడు హ్రితిక్. అయితే క్రిష్ 4 అంటే గత క్రిష్ సినిమాల్లా కేవలం ఒక సూపర్ హీరో, ఒక సూపర్ విలన్ కాకుండా… నలుగురు సూపర్ విలన్తు, ముగ్గురు సూపర్ హీరోల స్టోరీలైన్ రెడీ అయ్యిందట

క్రిష్ 4 లో ముగ్గురు క్రిష్ లు ఉంటారని, అలానే ప్రీతీజింటా, ప్రియాంక చోప్రా, వివేక్ ఓబేరాయ్, రేఖ ఇందులో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఇలా మూడు కాలాల్లో ప్రయాణిస్తూ కథ ఉంటుందని, అందులో ఒక గెస్ట్ సూపర్ హీరోగా ఎన్టీఆర్ కనిపిస్తాడని తెలుస్తోంది. ఇది కన్ఫామ్ అయ్యాక ఏప్రిల్ 22న ఎనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే రోజు ఎన్టీఆర్ కూడా డ్రాగన్ సెట్లో అడుగుపెట్టబోతున్నాడని ఎనౌన్స్ మెంట్ వచ్చింది.