బాబాయ్ కోసం అబ్బాయ్ రెడీ… కానీ సీన్ లోకి సడన్ గెస్ట్…

నటసింహం బాలయ్య డాకూ మహారాజ్ గా రాబోతున్నాడు. సంక్రాంతికి సింహంలా దూసుకొస్తానంటున్నాడు. డేటు, బాక్సాఫీస్ తో ఫైటు రెండూ కూడా ఫిక్స్ అయ్యాయి. ఎటొచ్చి ఫిక్స్ అవ్వాల్సింది, ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్... నిజానికి బాబాయ్ బాలయ్య పిలస్తే పరుగెత్తుకు వచ్చేందుకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎప్పుడూ రెడీనే...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 30, 2024 | 08:10 PMLast Updated on: Dec 30, 2024 | 8:10 PM

Ntr Will Come For Daku Maharaj Event

నటసింహం బాలయ్య డాకూ మహారాజ్ గా రాబోతున్నాడు. సంక్రాంతికి సింహంలా దూసుకొస్తానంటున్నాడు. డేటు, బాక్సాఫీస్ తో ఫైటు రెండూ కూడా ఫిక్స్ అయ్యాయి. ఎటొచ్చి ఫిక్స్ అవ్వాల్సింది, ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్… నిజానికి బాబాయ్ బాలయ్య పిలస్తే పరుగెత్తుకు వచ్చేందుకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎప్పుడూ రెడీనే… తమ మధ్య గ్యాప్ లేదని ప్రూవ్ చేయటానికి ప్రతీ సందర్భంలో తను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అలాంటీ ఈ ఇద్దరిని కలిపేందుకు నిర్మాత ముందుకొచ్చాడన్నారు. అన్ స్టాపబుల్ కొత్త సీజన్ లో వీళ్ల కాంబినేషన్ లో సింగిల్ ఎపిసోడ్ తో సెన్సేషన్ జరగొచ్చనే మాట ఒకవైపు, లేదు డాకూ మహరాజ్ ఈవెంట్ లో తారక్ తళుక్కుమంటాడనే మాట మరోవైపు, మొత్తానికి ఫ్యాన్స్ లో ఈ మాటలే ఊపు తెస్తున్నాయి.. కాని ఇంతలో సీన్ లోకి ఇంకో హీరో ఎంట్రీ ఇచ్చేలా ఉన్నాడట… ఇంతకి ఏం జరగబోతోంది? బాబాయ్ తో అబ్బాయ్ స్టేజ్ షో ఉంటుందా? లేదా?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని తన తాత తారకరామారావు తర్వాత, నందమూరి వంశంలో అంతగా ప్రేమ చూపించింది బాబాయ్ బాలయ్యే. అలాంటి బాలయ్యకి, అబ్బాయ్ ఎన్టీఆర్ కి మధ్య గ్యాప్ ఉందని చాలా కాలంగా ప్రచారం జరిగింది. తన మనిషి వైసీపీలో ఉండటమే ఒక కారణం. ఏదేమైనా ఎప్పటికైనా అంతా తనవాళ్లుగానే ఎన్టీఆర్ భావిస్తాడు…

అదే మాటమీదున్నాడు. కాకపోతే పొలిటికల్ ఇష్యూస్ వల్లే అబ్బాయ్ కి బాబాయ్ దూరం అయ్యాడనే అభిప్రాయం కూడా ఉంది. ఏదేమైనా వీల్లు కలస్తురనే చర్చ ప్రతీ నెలకోసారి వినిపిస్తోంది. రీసెంట్ గా అన్ స్టాపబుల్ కొత్త సీజన్ ని ఎన్టీఆర్ ఎపిసోడ్ తోనే ప్లాన్ చేస్తున్నారని ఆల్ మోస్ట్ తేలిపోయింది

ఇప్పుడు డాకూ మహారాజ్ మూవీ ఈవెంట్ లోనే ఈ ఇద్దరి కలయికకి ఛాన్స్ ఎక్కువే కనిపిస్తోంది. డాకూ మహారాజ్ నిర్మాత నాగ వంశీనే ఇనీషియేట్ తీసుకుని బాబాయ్ మూవీకి అబ్బాయిని గెస్ట్ గా తీసుకొస్తున్నాడనంటున్నారు. దీనికి ఎన్టీఆర్ ఎప్పుడూ రెడీనే.. కాకపోతే తన బాబాయ్ బాలయ్యే కరుణించాలి… తను నిర్మాతకు పర్మీషన్ ఇవ్వాలి..

ఐతే గత కొంత కాలంగా ఎన్టీఆర్ నుంచి బాబాయ్ బాలయ్యకి పాజిటివ్ సిగ్నల్స్ వెళుతున్నాయని, అందులో భాగంగానే, అన్ స్టాపబుల్ కి తారక్ ని పిలిపించాలనుకున్నారట. ఐతే ఈ సీజన్ ని రామ్ చరణ్ ఎపిసోడ్ తో ముగిస్తారన్నారు. కాని ఎన్టీఆర్ షోకి పిలిపించే వీడియో ప్రోమోని వదిలి, నెక్ట్స్ సీజన్ కమ్మింగ్ సూన్ అని వదులాలనుకున్నారట.

అందులో భాగంగానే ఎన్టీఆర్ ఎపిసోడ్ కోసం ప్రిపేర్ చేసిన క్వశ్చన్ పేపర్ లీకై, అలా ఈ వార్త వైరలైంది. ఇప్పుడు డాకూ మహారాజ్ ఈవెంట్ కి తారక్ గెస్ట్ అంటూ ప్రచారం ఊపందుకుంది. అలాంటిదేమైనా ఉంటే ఈ పాటికే పోస్టర్ వచ్చేదని, కాబట్టి ఇది కేవలం ప్రచారం అన్న మాట కూడా వినిపించింది. కాకపోతే ఒకేస్టేజ్ మీద బాబాయ్, అబ్బాయ్ ని ఉండేలా చేయాలని ఆఖరి నిమిషం వరకు నిర్మాత నాగవంశీ ప్రయత్నించాలనుకుంటున్నాడట.