బాబాయ్ షోలో మ్యాన్ ఆఫ్ మాసెస్.. దూరం కాస్త దగ్గర..

నట సింహం బాలయ్య మొదట్నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. కాని కొన్ని ఊహంచని కారణాల వల్ల, ఆ తర్వాత బాబాయ్ తో అబ్బాయ్ కి మధ్య గ్యాప్ పెరిగిందన్నారు. ఆ గ్యాప్ ని వైసీపీ వాడుుకుందనే కామెంట్ కూడా ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 21, 2024 | 02:08 PMLast Updated on: Dec 21, 2024 | 2:08 PM

Ntr With Balakrishna At Aha Show

నట సింహం బాలయ్య మొదట్నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. కాని కొన్ని ఊహంచని కారణాల వల్ల, ఆ తర్వాత బాబాయ్ తో అబ్బాయ్ కి మధ్య గ్యాప్ పెరిగిందన్నారు. ఆ గ్యాప్ ని వైసీపీ వాడుుకుందనే కామెంట్ కూడా ఉంది. అలాంటిది సడన్ గా బాలయ్య బాబాయ్ కి ఎన్టీఆర్ దగ్గరౌతున్నాడనే చర్చ షురూ అయ్యింది. నందమూవీ ఫ్యామిలీకి ఎన్టీఆర్ కి మధ్య ఉన్న దూరం కాస్త దగ్గరౌతోందని తెలుస్తోంది. అన్ స్టాపబుల్ షో కి ఎన్టీఆర్ రావటం ఆల్ మోస్ట్ కన్ఫామ్ అంటున్నారు. చిరు, ఎన్టీఆర్ ఈ ఇద్దరి రాక మీదే ఇంతకాలం చాలా అనుమానాలుండేవి.. ఆరెండీంటిని కొత్త షోలోతో క్లియర్ చేయబోతున్నారు. అయితే అంత ఖచ్చితంగా ఈ మాట అనటానికి కారనం, లీకైన క్వశ్చన్ పేపరే… ఏ హీరో అయినా షోకి రాబోతున్నాడంటే ముందు క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది.. అదే జరిగింది కాబట్టే ఇలాంటి చర్చ మొదలైందా? ఎలాగైతే మెగా గ్యాప్ ని దూరం చేసేందుకు బన్నీ చిరు ఇంటికి వెళ్లి, ఇప్పుడు పవన్ ని కలవబోతున్నాడో.. అలానే బాబాయ్ షోకి అబ్బాయ్ వెళ్లబోతున్నాడా?

అన్ స్టాపబుల్ షోలో పవన్ తో బాలయ్య ఎపిసోడ్ పేలింది.. ప్రభాస్ తో షో అదిరింది. ఇలా చాలా అరుదైన ఇంటర్వూలతో అన్ స్టాపబుల్ మైండ్ బ్లాంక్ చేసింది. కాని చిరుతో బాలయ్య ఎపిసోడే ఎప్పుడా అనుకుంటున్నా టైంలో, సీన్ లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేరొచ్చింది. నిజంగానే న్యూ సీజన్ లో ఈ వింత జరిగేందుకు ఛాన్స్ ఉన్నట్టుంది..

నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ ని ముందుగా తన తాత ఎన్టీఆర్ తర్వాత ఎక్కువగా ఎంకరేజ్ చేసింది బాలయ్యే. తన బాబాయ్ ని కూడా ఎన్నో సార్లు ఆకాశానికెత్తతూ జై బాలయ్య అన్నాడు. అలా అభిమానాన్ని చాటాడు ఎన్టీఆర్… అంతవరకు బానే ఉంది కాని, గత ఐదారేళ్లుగా నందమూరి ఫ్యామిలీకి, మ్యాన్ ఆఫ్ మాసెస్ కి మధ్య గ్యాప్ పెరిగిందనే అభిప్రాయముంది

బాబాయ్ తో అబ్బాయ్ కి పెద్దగా మాటల్లేవన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారినట్టుంది. గత రెండు నెలలుగా, బాబాయ్ కి అబ్బాయ్ కి మధ్య చిన్న పాటి రాయబారాలు నడుస్తున్నాయనే చర్చ మొదలైంది. మొన్నటి వరకు ఎన్టీఆరే కాదు, కళ్యాణ్ రామ్ కూడా బాలయ్య బాబాయ్ తో దూరం మేయింటేన్ చేస్తున్నారన్నారు. కాని అన్ స్టాపబుల్ షోకి ఎన్టీఆర్ రాక ఆల్ మోస్ట్ కన్ఫామ్ చేసుకోవాల్సి వస్తోంది

చరణ్, పవన్, ప్రభాస్ ఇలా ఎంతమంది వచ్చినా ఎన్టీఆర్ రాక ఎప్పుడు ఈ షోకి అన్న ప్రశ్న వస్తూనే ఉంది. ఆప్రశ్నకు ఆల్ మోస్ట్ సమాధానం దొరికినట్టే ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ షో కోసం ప్రశ్నలు, ఇంట్రడక్షన్ సీన్ ఇలా అన్నీంటికి స్క్రీప్ట్ ప్రిపేర్ అయ్యింది. ఆ పేపర్ లీకేజితోనే ఖచ్చిత్తంగా అన్ స్టాపబుల్ కొత్త సీజన్ లో ఎన్టీఆర్ ఎపిసోడ్ ఉంటుందనే మాటకు బలం వస్తోంది

మామూలుగా మెగా ఫ్యామిలీకి బన్నీ దూరం అయినట్టే, నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్ దూరం అయ్యాడన్నారు. వీల్లిద్దరి పేర్లు వైసీపీ కావాలని వాడుకుందనే అభిప్రాయముంది. పొలిటికల్ కారణాలెలా ఉన్నా, బన్నీ మొన్నే చిరుని కలిశాడు. నాగబాబుతో చర్చించాడు. ఇప్పుడు పవన్ అంకుల్ ని కలవబోతున్నాడు. అలా మెగా గ్యాప్ ని అల్లు అర్జున్ ఫిల్ చేయబోతుంటే, అచ్చంగా అలానే ఎన్టీఆర్ కూడా చేసేందుకు రెడీ అయ్యాడనంటున్నారు. తన నుంచి సిగ్నల్స్ అందాయి కాబట్టే, బాలయ్య బాబాయ్ కూడా అబ్బాయ్ కోసం షోకి రెడీ అన్నాడట. ఇదే జరిగితే, ఇక అన్ స్టాపబుల్ షో అన్ బిలీవబుల్ గా మారే ఛాన్స్ ఉంది.