NTR Devara : ‘దేవర’పై ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్.. అభిమానులు కాలరెగరేసుకునే సినిమా

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) కెరీర్ ను 'టెంపర్' (Temper) కి ముందు 'టెంపర్'కి తర్వాత అని చెప్పవచ్చు. ఆ సినిమా దగ్గర నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 9, 2024 | 06:00 PMLast Updated on: Apr 09, 2024 | 6:00 PM

Ntrs Confidence On Devara

 

 

 

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) కెరీర్ ను ‘టెంపర్’ (Temper) కి ముందు ‘టెంపర్’కి తర్వాత అని చెప్పవచ్చు. ఆ సినిమా దగ్గర నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్. ‘టెంపర్’ విడుదల సమయంలో ఆయన ఒక మాట అన్నాడు. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేదు. నా ప్రతి అభిమాని కాలరెగరేసుకునే సినిమాలు చేస్తాను. అని చెప్పాడు. ఏ ముహూర్తాన ఆ మాట చెప్పాడో కానీ.. అపజయం అనేదే లేకుండా ఎన్టీఆర్ కెరీర్ సాగుతోంది. అయితే తాజాగా ఎన్టీఆర్ మరోసారి ‘టెంపర్’ టైం నాటి కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేశాడు.

‘టిల్లు స్క్వేర్ (Tillu Square) మూవీ సక్సెస్ మీట్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్.. తన అప్ కింగ్ మూవీ ‘దేవర’గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దేవర సినిమా విడుదల లేట్ అయినా.. అభిమానులందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునే లాంటి చిత్రాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పాడు. అలాగే ‘దేవర’ (Devara) సినిమా ఎలా ఉంటుంది అందులో డైలాగ్ లు ఎలా ఉండబోతున్నాయో కూడా ఎన్టీఆర్ రివీల్ చేశాడు.దేవర సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ గురించి చెప్పను. కానీ దేవర కూడా ఇంచుమించు భయం గురించి ఎక్కువ శాతం ఉంటుంది. కల కనడానికి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని, ఆ కలని సార్ధకం చేసుకోవడానికి, నిజం చేయడానికి భయం ఉండాలి. అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

తారక్ (Tarak) తన స్పీచ్ చివర్లో ఇంకో మాట కూడా చెప్పాడు. దేవర సినిమా చూశాక ఫ్యాన్స్ ఎలా ఫీలవుతారో చెప్పుకొచ్చాడు. ఇతి కాస్త ఎక్కువ అయ్యింది అనుకోవద్దు. చొక్కా ఉంటుంది.. దానికి ఒక కాలర్ అనేది ఉంటుంది. మీరు దేవర సినిమా చూశాక కాలర్ ఎగరేసుకునేలా ఉంది అనుకుంటారు. కాస్త ఆలస్యం అయ్యిందని డీలా పడకండి. మీరు కాలర్ ఎగరేసుకునేలా సినిమాని తీస్తున్నాం” అంటూ తారక్ చెప్పుకొచ్చాడు. ఇంకేముంది ఈ స్పీచ్ విన్న తర్వాత తారక్ ఫ్యాన్స్ గాల్లో తేలుతున్నారు. ఇప్పటివరకు దేవర గురించి ఊహించుకున్న అన్నీ ఎలివేషన్స్ తారక్ మాటలతో నిజమైపోయాయి. అక్టోబర్ 10న థియేటర్లలో రచ్చ చేసేందుకు ఫ్యాన్స్ సిద్ధమైపోతున్నారు.