ఎన్టీఆర్ డ్రీమ్.. చీప్ గా 500 కోట్లా.. డైరెక్ట్ ఎటాక్.. కొడితే 1000 కోట్లు రావాల్సిందే..!
జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ గురించి ప్రస్తుతం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా గత పది సంవత్సరాలుగా ఒక ఫ్లాప్ కూడా లేకుండా జైత్రయాత్ర సాగిస్తున్నాడు జూనియర్.

జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ గురించి ప్రస్తుతం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా గత పది సంవత్సరాలుగా ఒక ఫ్లాప్ కూడా లేకుండా జైత్రయాత్ర సాగిస్తున్నాడు జూనియర్. ఈయన దూకుడు చూసే బాలీవుడ్ కూడా రెడ్ కార్పెట్ వేసి మరీ రా రమ్మని ఆహ్వానిస్తుంది. ఈ క్రమంలోనే ఆయన చేస్తున్న ఫస్ట్ బాలీవుడ్ సినిమా వార్ 2. హృతిక్ రోషన్ లాంటి సూపర్ స్టార్ తో ఇందులో కలిసిన నటిస్తున్నాడు జూనియర్. ఈ సినిమా మీద ఉన్న అంచనాలు మాటలలో చెప్పడం కష్టమే. బిజినెస్ పరంగా కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది వార్ 2. పార్ట్ వన్ సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ మీద కూడా అదే రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాను బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. కొన్నేళ్లుగా హృతిక్ రోషన్ కు సరైన హిట్స్ లేవు.. దాంతో ఈయన కెరీర్ కూడా వార్ 2 సినిమా మీద ఆధారపడి ఉంది. కచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొట్టి మరోసారి తన మార్కెట్ స్టామినా నిరూపించుకోవాలి అని చూస్తున్నాడు హృతిక్. ఈయనకు తోడుగా ఎన్టీఆర్ కూడా ఉండడంతో బాక్సాఫీస్ కచ్చితంగా ఊగిపోయేలా కనిపిస్తుంది.
తారక్ ఉన్నాడు కాబట్టి సౌత్ మార్కెట్ కు డోకా లేదు. తెలుగులో పూర్తిగా ఎన్టీఆర్ దండయాత్ర నడుస్తుంది. అలాగే తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా ఎన్టీఆర్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక నార్త్ హృతిక్ రోషన్ ఎలాగూ ఉండనే ఉన్నాడు. ఈ ఇద్దరు కలిసి కచ్చితంగా 1000 కోట్లు వసూలు చేయాలి అనేది ప్లాన్. నిజం చెప్పాలంటే ఈ ఇద్దరు హీరోలకు ఖచ్చితంగా ఒక్కొక్కరికి విడివిడిగా 500 కోట్ల మార్కెట్ ఉంది. నెగిటివ్ టాక్ వచ్చిన దేవర సినిమానే తన స్టామినాతో నిలబెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమాకు ఏకంగా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఇక హృతిక్ రోషన్ ఫైటర్ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా కూడా దాదాపు 300 కోట్లు వసూలు చేసింది. అలాంటిది ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో 1000 కోట్లు అనేది ఈజీ అని లెక్కలేసుకుంటున్నారు అభిమానులు. వార్ 2 సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే 800 కోట్లు అనేది కేక్ వాక్ అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఇప్పటివరకు ఈయన 500 కోట్ల సినిమా ఇవ్వలేదు. ట్రిపుల్ ఆర్ సినిమాకు 1200 వచ్చినా కూడా.. అందులో రామ్ చరణ్ ఉన్నాడు. దానికి తోడు రాజమౌళి ఆ సినిమాకు దర్శకుడు కావడంతో ఇది పూర్తిగా ఆయన క్రెడిట్ అంటున్నారు అభిమానులు.
దేవర 400 కోట్ల వరకు వచ్చి ఆగిపోయింది. దాంతో ఇప్పుడు వార్ 2తో 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నాడు తారక్. అలా చేస్తే కచ్చితంగా అందరూ 500 కోట్ల వాటా 100% జూనియర్ ఎన్టీఆర్ కు వస్తుంది. ఆయన లేకుండా సినిమాకు 1000 కోట్లు రావడం అనేది కల. ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టే సౌత్ లో ఆ సినిమాకు దాదాపు 300 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. ఎలా చూసుకున్నా కూడా ఈ సినిమాతో 1000 కోట్లు కొట్టాలి అనేది జూనియర్ ప్లాన్. అది ఒకవేళ వర్కౌట్ అయితే నెక్స్ట్ రాబోయే ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాకు అది బాగా హెల్ప్ కానుంది. ఎందుకంటే తారక్ నుంచి నెక్స్ట్ విడుదల కాబోయే సినిమా ఇదే. వార్ 2 బాగా ఆడిందంటే బాలీవుడ్ లో డ్రాగన్ సినిమాకు బిగ్గెస్ట్ రిలీజ్ దక్కుతుంది. మరి అప్పుడు ఆ కల నెరవేరాలంటే ముందు.. వార్ 2తో ఇప్పుడు ఎన్టీఆర్ 1000 కోట్ల కల నెరవేర్చుకోవాలి. చూడాలి మరి ఏం జరగబోతుందో..!