ఆఫర్లు లేక స్టార్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్
కంగనా రనౌత్... బాలీవుడ్ స్టార్ హీరోయిన్, బిజెపి ఎంపీ... ఈ రెండు బ్యాలెన్స్ చేయడం అనేది కాస్త కష్టమే అయినా ఈ అమ్మడు మాత్రం సూపర్ సక్సెస్ అవుతోంది. అప్పుడప్పుడు నోటికి పని చెప్పినా పనిలో మాత్రం దూకుడు ప్రదర్శిస్తోంది.
కంగనా రనౌత్… బాలీవుడ్ స్టార్ హీరోయిన్, బిజెపి ఎంపీ… ఈ రెండు బ్యాలెన్స్ చేయడం అనేది కాస్త కష్టమే అయినా ఈ అమ్మడు మాత్రం సూపర్ సక్సెస్ అవుతోంది. అప్పుడప్పుడు నోటికి పని చెప్పినా పనిలో మాత్రం దూకుడు ప్రదర్శిస్తోంది. ఇటీవలి కాలంలో వరుస వివాదాల్లో ఉంటున్న ఈ హీరోయిన్… ఇప్పుడు బాలీవుడ్ లో డైరెక్టర్ గా తన అదృష్టాన్ని టెస్ట్ చేసుకునే పనిలో పడింది. ప్రస్తుతం ఆమె ఎమర్జెన్సీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే నెల ఆరున ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు… తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆఫర్లు లేక ఒకానొక దశలో దేశం విడిచి వెళ్ళిపోవాలని అనుకున్నా అంటూ చెప్పుకొచ్చింది. నటిని కావాలనే ఆశతో 2004లో ముంబయి వచ్చా అని అప్పటి రోజులను గుర్తు చేసుకుంది కంగనా. 2005-06లో ‘గ్యాంగ్‌స్టర్’, ‘వో లమ్హే’ వంటి చిత్రాల్లో నటించా అని… మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన సూపర్ మోడల్, గ్యాంగ్‌స్టర్ వంటి ఎన్నో పాత్రలు పోషించా అని చెప్పుకొచ్చింది. తన నటనకు ప్రశంసలు బాగా దక్కాయి గుర్తు చేసుకుంది.
అయితే పొగడ్తలు పక్కన పెడితే దాదాపు దశాబ్దకాలం పాటు తనకు ఆఫర్స్ ఏవీ రాలేదని బాధ పడింది. వర్క్ దొరకలేదు… ఆఫర్స్ లేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని… ఈ దేశమే నన్ను బహిష్కరించిందనిపించి విదేశాలకు వెళ్లిపోవాలనుకున్నా అంటూ అప్పటి తన మానసిక పరిస్తితిని బయటపెట్టింది. తనకు కేవలం నటిగా ఉండటం మాత్రమే ఇష్టం లేదని, వేరే పాత్రలు కూడా చేయాలనే కోరిక ఉంటుందని చెప్పుకొచ్చింది. దర్శకుల పని తీరు, కష్టాలు తనకు తెలుసు అని చెప్పుకొచ్చింది కంగనా. సెట్స్ లో ఇతర నటులు అంటే తనకు చాలా గౌరవం అని వారిని చాలా బాగా చూసుకుంటా అని చెప్పింది. అన్ని విషయాలు వారికి చెప్పడం తనకు ఇష్టమని చెప్పింది కంగనా.