ప్రభాస్ పెళ్లిపై అఫీషియల్ కన్ఫర్మేషన్.. వాళ్ల PR టీం ఏం చెప్పిందో తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్ పెళ్లి కంటే మోస్ట్ ఎంటర్టైనింగ్ టాపిక్ మరొకటి లేదు. ఎప్పుడు చూసినా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 28, 2025 | 11:45 AMLast Updated on: Mar 28, 2025 | 11:45 AM

Official Confirmation On Prabhas Marriage Do You Know What Their Pr Team Said

తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్ పెళ్లి కంటే మోస్ట్ ఎంటర్టైనింగ్ టాపిక్ మరొకటి లేదు. ఎప్పుడు చూసినా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ప్రభాస్ పెళ్లి గురించి ఆరా తీస్తూనే ఉంటారు. అది మాత్రం ఎక్కడ వేసిన గొంగలిలా అక్కడే ఉంటుంది. అయినా కూడా ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడూ టాపిక్ నడుస్తూనే ఉంటుంది. సీరియ‌ల్ కంటే సీరియ‌స్ గా సాగుతుంది ప్ర‌భాస్ పెళ్లి డ్రామా. అవును అన‌రు.. కాద‌న‌రు కానీ లాగుతూనే ఉంటారు. ప్ర‌భాస్ ఏమో పెళ్లి ఎప్పుడు అంటే ఏమో అంటాడు.. కృష్ణంరాజు బతికున్నప్పటి నుంచి ఇదే తంతు. అప్పట్లో ఆయన ఉన్నప్పుడు.. ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా కూడా మాత్రం ఇదిగో ఇప్పుడే అంటూ ఉండేవాడు. కృష్ణంరాజు చనిపోయి కూడా రెండున్నర సంవత్సరాలు దాటిపోయింది.. అయినా కూడా ఇప్పటివరకు తన పెళ్లి గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు ప్రభాస్. ఇప్పుడు ఆయన పెద్దమ్మ కూడా ప్రభాస్ పెళ్లి గురించి అప్పుడప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటుంది. తెలుగు ఇండ‌స్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ గా మారిపోయాడు ప్ర‌భాస్. వ‌య‌సు 45 వ‌చ్చినా ఇంకా పెళ్లికి దూరంగానే ఉన్నాడు ఈ హీరో. బాహుబ‌లి త‌ర్వాత ఈయ‌న పెళ్లి పీట‌లు ఎక్కుతాడంటూ అప్పట్లో వార్త‌లు బానే వ‌చ్చాయి.. కానీ అది జ‌రగ‌లేదు.

బాహుబ‌లి వ‌చ్చి పదేళ్లు దాటిపోయింది. ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి లాంటి సినిమాలు చేశాడు. ఏడాదికి రెండు సినిమాలు చేస్తున్నాడు కానీ పెళ్లి ముచ్చట మాత్రం ఏమీ చెప్పడం లేదు ప్రభాస్. ఇంకా పెళ్లికి నో అంటూనే ఉన్నాడు. ప్ర‌స్తుతానికి సినిమాలపైనే త‌న దృష్టి ఉంద‌ని.. ఆ తర్వాతే ఏదైనా అంటున్నాడు ఈ హీరో. అయితే ఆయన కుటుంబ సభ్యులు మాత్రం వీలైనంత త్వరగా ప్రభాస్ పెళ్లి అవుతుంది అంటున్నారు. ఈ క్రమంలోనే ఒక వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అమెరికాలో సెటిల్ అయిన అమ్మాయితో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడనీ.. త్వరలోనే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఎవరు ఖండించకపోవడంతో నిజమే అనుకున్నారంతా. కానీ ఇప్పుడు ప్రభాస్ పెళ్లి క్లారిటీ వచ్చింది. ప్రభాస్ పెళ్లి మీద వస్తున్న వార్తల్లో ఎ లాంటి నిజం లేదని.. అనవసరంగా తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేయొద్దు అంటూ ప్రభాస్ పిఆర్ టీం కోరింది.

ఇదే విషయంపై ప్రభాస్ కూడా చాలా సార్లు స్పందించాడు. చాలా మంది త‌నకు ఎఫైర్లు ఉన్నాయ‌ని.. పెళ్లి ఎప్పుడు అవుతుంద‌ని అడుగుతున్నార‌ని.. కానీ అది త‌న ప‌ర్స‌న‌ల్ అని.. అది బ‌య‌ట చెప్ప‌డం అనేది త‌న‌కు ఇష్టం ఉండ‌ద‌ని.. అది మీడియా వారే అర్థం చేసుకోవాలని చెప్పాడు ప్ర‌భాస్. ఏదేమైనా ఇప్పుడు వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం ప్ర‌భాస్ ఇప్పట్లో అయితే పెళ్లి చేసుకోవడం కష్టమే. ఈయన పెళ్లి కోసం ఇంకా ఎన్ని సంవత్సరాలు అభిమానులు వెయిట్ చేయాలో మరి..! ఇక సినిమాల విషయానికొస్తే రాజా సాబ్, ఫౌజీ సినిమాలు ఒకేసారి పూర్తి చేస్తున్నాడు ప్రభాస్. దీని తర్వాత స్పిరిట్, సలార్ 2, కల్కి 2 లాంటి సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత కానీ పెళ్లి చేసుకునే మూడ్ ప్రభాస్ కు వచ్చేటట్లు లేదు. ఒకవేళ ఇదే గాని నిజమైతే ఆలోపు ప్రభాస్ వయసు హాఫ్ సెంచరీ దాటిపోతుంది.