Pawan Kalyan OG : ఓజీ సినిమా లేదు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీస్ లో ఓజీ కూడా ఒకటి. పవన్ బర్త్ డే కానుకగా ఓజీ నుంచి హంగ్రీ చీతా అంటూ వచ్చిన చిన్నపాటి టీజర్ అయితే ఒక పెను విధ్వంసమే సృష్టించింది. ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ హోదాలో పవన్ కళ్యాణ్ కత్తితో చేసిన విన్యాసాలతో పాటు ఒక పెద్ధ గన్ పట్టుకొని శత్రువులని తుదముట్టించడానికి వెళ్తుంటే ఫ్యాన్స్ పవన్ నామ జాపంతో పూనకాలు వచ్చినవాళ్లలా ఊగిపోయారు. ఇక అప్పటి నుంచి ఓజి కి సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తునే ఉన్నారు. తాజాగా ఓజి నుంచి వచ్చిన ఒక న్యూస్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తుంది.

OG is also one of the upcoming movies of Power Star Pawan Kalyan. Hungry Cheetah is a small teaser from Ozzy as Pawan's birthday gift
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీస్ లో ఓజీ కూడా ఒకటి. పవన్ బర్త్ డే కానుకగా ఓజీ నుంచి హంగ్రీ చీతా అంటూ వచ్చిన చిన్నపాటి టీజర్ అయితే ఒక పెను విధ్వంసమే సృష్టించింది. ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ హోదాలో పవన్ కళ్యాణ్ కత్తితో చేసిన విన్యాసాలతో పాటు ఒక పెద్ధ గన్ పట్టుకొని శత్రువులని తుదముట్టించడానికి వెళ్తుంటే ఫ్యాన్స్ పవన్ నామ జాపంతో పూనకాలు వచ్చినవాళ్లలా ఊగిపోయారు. ఇక అప్పటి నుంచి ఓజి కి సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తునే ఉన్నారు. తాజాగా ఓజి నుంచి వచ్చిన ఒక న్యూస్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తుంది.
న్యూ ఇయర్ సందర్భంగా ఓజీ నుంచి ఒక సాంగ్ లేదా పవన్ కళ్యాణ్ గెటప్ కి సంబంధించిన కొత్త పోస్టర్ రిలీజ్ కాబోతుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తు వచ్చారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ డిమాండ్ బాగా పెరిగిపోయేసరికి కొత్త ఏడాది కానుకగా ఓజీ నుంచి ఎలాంటి ట్రీట్ ఇవ్వట్లేదంటూ ఆ మూవీ నిర్మాణ సంస్థ డి వి వి ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ హర్ట్ అయిపోతున్నారు. కనీసం పోస్టర్ రిలీజ్ చేసినా బాగుండేదంటు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్‌లో అదిరిపోయే యాక్షన్‌తో సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్ లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీత సారథ్యంలో ఓజీ తెరకెక్కుతుంది. పవన్ నుంచి వస్తున్న స్ట్రెయిట్ ఫిల్మ్ కావడంతో ఓజీపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టే సుజీత్ ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.