బాలీవుడ్ కి ముసలి హీరోలే దిక్కా…?? తర్వాతి తరం ఎక్కడ…?
అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్... బాలీవుడ్ అంటే ఈ ముగ్గురే. ఈ మూడు పేర్లు తప్పించి గత 20 ఏళ్ళలో పెద్దగా వినపడిన పేర్లు అయితే ఏమీ లేవు. అప్పుడప్పుడు వినపడిన పేర్లు అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, రణవీర్ సింగ్... మిగిలిన హీరోలు ఉన్నా చిన్న హీరోలే.
అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్… బాలీవుడ్ అంటే ఈ ముగ్గురే. ఈ మూడు పేర్లు తప్పించి గత 20 ఏళ్ళలో పెద్దగా వినపడిన పేర్లు అయితే ఏమీ లేవు. అప్పుడప్పుడు వినపడిన పేర్లు అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, రణవీర్ సింగ్… మిగిలిన హీరోలు ఉన్నా చిన్న హీరోలే. ఖాన్ త్రయం వయసు అయిపోయింది. అక్షయ్ కుమార్ సినిమాలు ఓటీటీలో కూడా చూసే పరిస్థితి లేదు. రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ కాస్త ఊపులో ఉన్నారు. షాహిద్ కపూర్ ఎప్పుడు సినిమాలు చేస్తారో కూడా తెలియని పరిస్థితి. విక్కీ కౌశల్ అప్పుడప్పుడు మెరుస్తున్నాడు.
ఖాన్ త్రయం… మహా అంటే ఇంకో 10 లేదా 15 ఏళ్ళు మాత్రమే ప్రభావం చూపించే అవకాశం ఉంది. వారి ముగ్గురిలో ఎవరికి వారసులు కనపడటం లేదు. షాహిద్ కపూర్ ఉన్నా సరే అంత ఫాలోయింగ్ అయితే లేదు. సైఫ్ అలీ ఖాన్, హృతిక్ రోషన్ ఇప్పుడు సొంతగా సినిమాలు చేసే పరిస్థితి లేదు. అజయ్ దేవగన్ కూడా మంచి హిట్ ల కోసం ఎదురు చూస్తున్నాడు. వీరి అందరిలో యాక్టివ్ గా ఉంది మాత్రం ముగ్గురు నలుగురే కనపడుతున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ కి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు కరువు అయ్యారు.
మన తెలుగులో ఇంకో 30 ఏళ్ళు ఇబ్బంది లేదు… వారసులు కూడా సిద్దమవుతున్నారు. సౌత్ లో దాదాపు అన్ని భాషల్లో వారసులు సిద్దమయ్యారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇలా స్టార్ ఇమేజ్ ఉన్న వారసులతో టాలీవుడ్ పటిష్టంగా కనపడుతోంది. అటు తమిళంలో కూడా యువ హీరోలు ఎక్కువగా ఉన్నారు. మలయాళంలో కథ బాగుంటే చాలు. కన్నడలో యష్, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి ఇలా స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. బాలీవుడ్ కొత్త తరాన్ని ప్రమోట్ చేయడంలో దారుణంగా ఫెయిల్ అయింది.
అమితాబ్ వారసుడు అభిషేక్ అంతగా ఆకట్టుకోలేదు. హ్రితిక్ రోషన్ పరిస్థితి కూడా అదే. షారుక్ ఖాన్ తన వారసుడిపై అంతగా ఫోకస్ పెట్టడం లేదనే ఆవేదన ఫ్యాన్స్ లో కనపడుతోంది. సల్మాన్ ఖాన్ కు పెళ్లి కాలేదు. దీనితో బాలీవుడ్ కి స్టార్ ల కొరత ఏర్పడింది అనే బాధ ఆ ఫ్యాన్స్ లో ఉంది. ఇప్పటికే సౌత్ లో స్టార్ లు అందరూ పాన్ ఇండియా సినిమాలతో బాలీవుడ్ ని తొక్కుతుంటే… తర్వాతి తరాన్ని ఫోకస్ చేయలేక బాలీవుడ్ అవస్థలు పడుతోంది.