Om Bheem Bush review : హిలేరియస్ ఫన్ రైడ్..

గతేడాది 'సామజవరగమన' (Samajavaragamana) చిత్రంతో నవ్వులు పూయించి ఘన విజయాన్ని అందుకున్న శ్రీవిష్ణు.. ఈ ఏడాది 'ఓం భీమ్ బుష్' (Om Bheem Bush) అనే మరో కామెడీ ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసారి శ్రీవిష్ణుకి ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) కూడా తోడయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 22, 2024 | 11:08 AMLast Updated on: Mar 22, 2024 | 11:08 AM

Om Bheem Bush Review

గతేడాది ‘సామజవరగమన’ (Samajavaragamana) చిత్రంతో నవ్వులు పూయించి ఘన విజయాన్ని అందుకున్న శ్రీవిష్ణు.. ఈ ఏడాది ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush) అనే మరో కామెడీ ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసారి శ్రీవిష్ణుకి ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) కూడా తోడయ్యారు. మరి శ్రీవిష్ణుకి మరో విజయాన్ని అందించేలా ఉందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

క్రిష్, వినయ్, మాధవ్ ముగ్గురు స్నేహితులు. Ph.D కోసమంటూ కాలేజ్ లో చేరి, ‘బ్యాంగ్ బ్రదర్స్’ పేరుతో వీరు చేయని చేష్టలు ఉండవు. వీళ్ళ టార్చర్ భరించలేక ప్రొఫెసర్ డాక్టరేట్ లు ఇచ్చి మరీ వాళ్ళని వదిలించుకుంటాడు. జీవితంలో ఓ లక్ష్యం అంటూ లేని బ్యాంగ్ బ్రదర్స్.. అనుకోకుండా భైరవపురం అనే గ్రామానికి వస్తారు. అక్కడ ఒక బృందం క్షుద్రపూజలు చేస్తూ.. గుప్తనిధులు కనిపెట్టడం, దెయ్యాలను వదిలించడం వంటివి చేసి బాగా డబ్బులు సంపాదిస్తుంటుంది. దీంతో బ్యాంగ్ బ్రదర్స్ కూడా టెక్నాలజీని ఉపయోగిస్తూ అదే బాటలో పయనించాలి అనుకుంటారు. ఊరి ప్రజలకు తమని తాము సైంటిస్ట్ లుగా పరిచయం చేసుకొని, A to Z సర్వీసెస్ ను ప్రారంభిస్తారు. తక్కువ సమయంలోనే అందరినీ మాయ చేసి ఊరి ప్రజల దృష్టిలో హీరోలు అవుతారు.

ఇలా సాఫీగా సాగిపోతున్న వారి జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. ఊరి చివర ఉన్న సంపంగి మహల్ లోకి వెళ్లి నిధి తీసుకురావాలనే ఛాలెంజ్ ఎదురవుతుంది. ఆ సంపంగి మహల్ పేరు వింటేనే ఊరి ప్రజలు ప్రాణ భయంతో వణికిపోతారు. ఎందుకంటే అక్కడ సంపంగి అనే దెయ్యం ఉంటుంది. ఆ మహల్ లోకి వెళ్లిన వారెవరూ ప్రాణాలతో తిరిగిరారు. అలాంటి సంపంగి మహల్ లోకి బ్యాంగ్ బ్రదర్స్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది వారు నిధిని కనిపెట్టగలిగారా వారిని సంపంగి దెయ్యం ప్రాణాలతో విడిచిపెట్టిందా అసలు సంపంగి కథ ఏంటిఅనేవి సినిమా చూసి తెలుసుకోవాలి.

నటినటుల పనితీరు..
శ్రీవిష్ణు మరోసారి తన కామెడీ టైమింగ్ తో మ్యాజిక్ చేశాడు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా పోటాపోటీగా నవ్వులు పంచారు. వీళ్ళ కామెడీనే సినిమాకి హైలైట్ గా నిలిచింది. వన్ లైనర్స్ తో థియేటర్లలో నవ్వులు పూయించారు. ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగర్, ఆదిత్య మీనన్, ర‌చ్చ‌ర‌వి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక అంశాలు..
రచన, దర్శకత్వంలో శ్రీ హర్ష కొనుగంటి తన మార్క్ చూపించాడు. వినోదంతో పాటు ప్రేక్షకులకు అక్కడక్కడా థ్రిల్ కూడా పంచాడు. స‌న్నీ ఎంఆర్ స్వరపరిచిన పాటలు అంతగా ఆకట్టుకోలేదు. సంగీతం, చిత్రీకరణ ఒకే తరహాలో ఉన్న ‘బ్యాంగ్ బ్రోస్’, ‘దిల్ ధడ్కే’ పాటలు తేలిపోయాయి. పంటి కింద రాళ్ళలా కామెడీ ఫ్లోకి అడ్డుపడేలా ఉన్నాయి. పెళ్లి పాట బాగానే ఉంది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. రాజ్ తోట కెమెరా పనితనం మెప్పించింది. మహల్ సన్నివేశాల్లో ఆయన ప్రతిభ కనపడింది. శ్రీ‌కాంత్ రామిశెట్టి ఆర్ట్ వర్క్ బాగుంది. విజయ్ వర్ధన్ కావూరి ఎడిటింగ్ నీట్ గా ఉంది. అయితే కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసినట్లయితే అవుట్ పుట్ ఇంకా మెరుగ్గా ఉండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

ఫైనల్ గా…
లాజిక్స్ ని పక్కన పెట్టి, కాసేపు హాయిగా నవ్వుకోవాలి అనుకునేవాళ్లు ఈ సినిమాకి హ్యాపీగా వెళ్లొచ్చు.