Rajanikanth: రజనీ మూవీ రిలీజ్ రోజు ఆఫీస్‌లకు సెలవు.. ఇది కదా సూపర్‌స్టార్ రేంజ్..
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా జైలర్ విడుదల రోజు ఆఫీసులకు సెలవు ప్రకటించారు. అంతేకాకుండా సంస్థలో పనిచేసే ఉద్యోగులందరికీ ఫ్రీగా టికెట్లు కూడా పంపిణీ చేస్తున్నారు. దీంతో తలైవా ఫ్యాన్స్ సందడి చేస్తూ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.

On the day of Superstar Rajinikanth's film Jailer, a company called Uno Aqua Care announced a holiday for the employees
హిట్, ఫ్లాప్‌లతో సంబంధం ఉండదు రజనీకాంత్ సినిమాలకు ! తలైవా వస్తున్నాడంటే అది ఒక ఎమోషన్ అంతే. అది ఎంజాయ్ చేయడానికి.. ఎన్ని పనులు ఉన్నా పక్కనపెట్టి ఫస్ట్ డే సినిమాలు వెళ్తుంటారు ఫ్యాన్స్. రజనీ ఇప్పుడు జైలర్‌గా పలకరించబోతున్నాడు. ఆగస్టు 10న మూవీ రిలీజ్ కాబోతోంది. దాదాపు రెండేళ్ల తర్వాత రజనీకాంత్ మళ్లీ తెరపైకి వస్తున్నాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ రోజు హాలిడే ప్రకటించేంత క్రేజ్ ఉన్న ఏకైక హీరో.. సూపర్ స్టార్ రజనీ కాంత్ ఒక్కడే ! రజనీ సినిమా వస్తుందంటే చాలు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులంతా థియేటర్ల ముందు క్యూ కట్టేస్తారు.
ఇప్పుడు జైలర్ విషయంలో అదే జరుగుతోంది. గత కొంతకాలంగా రజనీకాంత్‌కు సరైన హిట్ పడడం లేదు. అలా అని తలైవా క్రేజ్ తగ్గింది అనుకుంటే.. చాన్సే లేదు. జైలర్ మూవీని పండగలా చేసుకునేందుకు అభిమానులు డిసైడ్ అయ్యారు. దీంతో వాళ్లు పనిచేసే ఆఫీస్‌లు కూడా రజనీ క్రేజ్‌కు ఫిదా అంటున్నాయ్. సినిమా విడుదల రోజు ఉద్యోగుల హాజరు తక్కువగా ఉంటుందని అనుకున్నారో ఏమో కానీ.. చెన్నై, బెంగళూరులో కొన్ని సంస్థలు తమ కార్యాలయాలకు పదో తేదీ సెలవు ప్రకటించాయి. యూనో ఆక్వా కేర్ అనే కంపెనీ.. తమ ఎంప్లాయ్స్‌కు సెలవు ప్రకటించింది. చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునల్వేలి, చెంగల్‌పట్టు, మట్టుతావని, అరపాళ్యం, అలగప్పన్ నగర్ బ్రాంచ్‌లకు సెలవు ప్రకటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికి ఫ్రీగా టిక్కెట్‌లు కూడా ఇవ్వనుంది. ఇప్పుడే కాదు కబాలి టైమ్‌లోనూ ఇలానే జరిగింది. ఫ్లైట్ల మీద సినిమా పోస్టర్లు, ఆఫీస్‌లకు సెలవులు.. అబ్బో జరిగిన హడావుడి అంతా ఇంతా కాదు. ఈ లెక్కన ఇప్పటికీ రజనీ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన జైలర్ మూవీ.. యాక్షన్ ప్యాక్డ్ సినిమా కాగా వస్తోంది. ఇందులో రజనీ రిటైర్డ్ పోలీసు అధికారిగా కనిపిస్తారు.