Mahesh babu : మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను
డాషింగ్ అండ్ డేరింగ్ హీరో సూపర్‌స్టార్ కృష్ణ 81వ జయంతి (Krishna's 81st birthday) సందర్భంగా ఆయన తనయుడు సూపర్‌స్టార్ మహేష్ (Superstar Mahesh) ఎక్స్ వేదికగా తండ్రికి బర్త్‌డే విషెస్ తెలిపారు.

On the occasion of dashing and daring hero Superstar Krishna's 81st birthday..
డాషింగ్ అండ్ డేరింగ్ హీరో సూపర్‌స్టార్ కృష్ణ 81వ జయంతి (Krishna’s 81st birthday) సందర్భంగా ఆయన తనయుడు సూపర్‌స్టార్ మహేష్ (Superstar Mahesh) ఎక్స్ వేదికగా తండ్రికి బర్త్‌డే విషెస్ తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే నాన్నా. మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నాను. నా ప్రతి జ్ఞాపకంలో మీరు జీవించే ఉంటారు’ అని ఓ ఎమోషనల్ ట్వీట్‌ని పోస్ట్ చేస్తూ సూపర్‌స్టార్ కృష్ణ యంగ్ లుక్‌లో ఉన్న ఫోటోను షేర్ చేశారు.
సూపర్‌స్టార్ కృష్ణ (Superstar Krishna) తన సినిమా కెరీర్‌లో సాధించిన విజయాలు, తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించిన తీరు అందరికీ తెలిసిందే. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న కృష్ణ తను చేసిన ఎన్నో గొప్ప చిత్రాలతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తండ్రి బాటలోనే కుమారుడు సూపర్‌స్టార్ మహేష్ కూడా ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించాలనే తపనతోనే సినిమాలు చేస్తున్నారు.
ప్రస్తుతం రాజమౌళి (Rajamouli) తో చేయబోతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కోసం మహేశ్ మేకోవర్ అవుతున్న విషయం తెలిసిందే. దాని కోసం ఎంతో శ్రమిస్తున్నారు మహేష్. అందులో భాగంగానే ఇటీవల మహేష్ విదేశాలకు కూడా వెళ్లారు. తెలుగులో ఇప్పటివరకు రాని ఒక డిఫరెంట్ ఎడ్వంచర్ డ్రామాగా ఈ సినిమాను రూపొందించేందుకు రాజమౌళి కృషి చేస్తున్నారు.