Pranitha : రెండోసారి తల్లికాబోతున్న బాపు బొమ్మ
ఏం పిల్లో.. ఏం పిల్లడో సినిమాతో పరిచమైన ముద్దుగుమ్మ ప్రణీత.. తనదైన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ప్రణీత.
ఏం పిల్లో.. ఏం పిల్లడో సినిమాతో పరిచమైన ముద్దుగుమ్మ ప్రణీత.. తనదైన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ప్రణీత. పెళ్లి చేసుకున్న, అమ్మైనా కూడా తన అందం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.. ఇప్పటికి హాట్ ఫోజులతో, తాజా ఫొటోస్ తో మరింత అందంగా కనిపిస్తుంది ఈ సొగసరి. బొంగరాల్లాంటి కళ్లతో కుర్రకారు ఫిదా చేసిన బ్యూటీ… మరోసారి తల్లికాబోతుంది.
కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే… బిజినెస్‌మ్యాన్ నితిన్ రాజును పెళ్లాడింది బ్యూటీ. ఏడాది లోపు మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. సినిమాలకు టోటల్ గా గుడ్ బై చెప్పిన బ్యూటీ… రీసెంట్ గా బుల్లితెరపై కనిపించి కవ్వించింది. అయితే పాపకు జన్మనిచ్చిన అదిరిపోయే ఫిజిక్ తో ఆకట్టుకుంది. దీంతో సెకండ్ ఇన్సింగ్ మొదలు పెడుతుందనుకున్న టైంలో అదిరిపోయే న్యూస్ చెప్పేసిందీ బ్యూటీ.
మరోసారి ప్రెగ్నెంట్ అయ్యానంటూ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా బేబి బంప్ ఫోటో షేర్ చేసి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చింది. పైగా ఆ ఫోటోకు రౌండ్ 2 ఇక ఈ ప్యాంట్స్ నాకు ఫిట్ అవ్వవు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఈ పోస్టు చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ ప్రణీతకు పెద్ద ఎత్తునే కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.