Ramcharan NTR : ఒకే ఫ్రేమ్‌లో ఎన్టీఆర్, చరణ్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ram Charan) మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు ఈ ఇద్దరు స్టార్స్.

Once again, Tollywood star heroes Junior NTR and global star Ram Charan in the same frame.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ram Charan) మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు ఈ ఇద్దరు స్టార్స్.
ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా ప్రమోషన్స్ మొదలుకొని.. ఆస్కార్ అవార్డ్ (Oscar Award) ఈవెంట్ వరకు సోషల్ మీడియాలో తెగ సందడి చేశారు ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్. ఎక్కడికెళ్లినా మ్యాగ్జిమమ్ ఈ ఇద్దరు కలిసే వెళ్లారు. దీంతో మెగా, నందమూరి ఫ్యాన్స్ (Nandamuri fans) పండగ చేసుకున్నారు. కానీ ఆస్కార్ ఈవెంట్ తర్వాత ఎవరి సినిమాలతో వారు బిజీగా అయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ (Dēvara) సినిమతో బిజీగా ఉండగా.. రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఈ ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చారు.
ఇద్దరు ఏదో కో ఇన్సిడెంట్‌గానో, లేదా ఈవెంట్‌లోనో కలిస్తే అది వేరే విషయం. కానీ ఇద్దరు కలిసి ఎయిర్‌పోర్ట్‌కి రావడం విశేషం. అది కూడా వేర్వేరు పార్టీలకు వెళ్తూ కనిపించారు. రామ్ చరణ్, ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్‌కు వెళ్లగా.. ఎన్టీఆర్ మాత్రం ప్రశాంత్ నీల్ ఇంట్లో జరిగిన ఓ ప్రైవేట్ పార్టీకి అటెండ్ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలతో పాటు.. ఎయిర్ పోర్ట్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో చరణ్ క్యాప్ పెట్టుకొని కనిపించగా.. ఎన్టీఆర్ క్యాజువల్ లుక్‌లో ఉన్నాడు.
ఇక ఈ ఫోటోలు, వీడియోలని షేర్ చేస్తూ.. రామ్, భీమ్ అదిరిపోయే లుక్‌లో ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. వాస్తవానికి.. ట్రిపుల్ ఆర్ సినిమా కంటే ముందే చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. కానీ ట్రిపుల్ ఆర్ సినిమాతో అది మరింత ఫోకస్ అయింది. ఇద్దరు మంచి దోస్తులు కాబట్టే.. ట్రిపుల్ ఆర్ సినిమాతో అదిరిపోయే అవుట్ పుట్ రాబట్టాడు రాజమౌళి. కాబట్టి.. టాలీవుడ్‌లో ఎన్టీఆర్, చరణ్ ఫ్రెండ్షిప్ వేరే అని చెప్పాలి.