350 కోట్లకు ఒక్క అడుగు దూరం.. అడుగేస్తే…

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 350 కోట్లకు అడుగు దూరంలో ఉన్నాడు. ఒక్కడ అడుగు సాలిడ్ గా పడినా సెన్సేషనే... నిజానికి త్రిబుల్ ఆర్ మూవీతో 1350 కోట్ల వసూళ్లని ఎప్పుడో టేస్ట్ చేశాడు తారక్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 17, 2025 | 07:50 PMLast Updated on: Mar 17, 2025 | 7:50 PM

One Step Away From 350 Crores If You Ask Me

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 350 కోట్లకు అడుగు దూరంలో ఉన్నాడు. ఒక్కడ అడుగు సాలిడ్ గా పడినా సెన్సేషనే… నిజానికి త్రిబుల్ ఆర్ మూవీతో 1350 కోట్ల వసూళ్లని ఎప్పుడో టేస్ట్ చేశాడు తారక్. తర్వాత రాజమౌళి సాయం లేకుండానే, దేవరతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. 670 కోట్ల వసూల్లు రాబట్టాడు. మొత్తంగా 100 కోట్ల రెమ్యునరేషన్ నుంచి 250 కోట్ల పారితోషకానికి రీచ్ అయ్యాడు. కట్ చేస్తే డ్రాగన్ మూవీకి ఏకంగా 330 కోట్లు తీసుకుంటున్న తారక్ అంటూ ప్రచారం జరిగింది. తర్వాత నెల్సన్ దిలీప్ డైరెక్షన్ లో చేసే సినిమాకు తన పారితోషికం 350 కోట్లన్న ప్రచారం జరిగింది. ఐతే నిజానికి తన హయ్యెస్ట్ రెమ్యునరేషన్ మాత్రం డ్రాగన్ కి తీసుకుంటున్న 300 కోట్లేనని ఫైనల్ గా తేలింది. అందులోనూ 200 కోట్లు ముందుగా, ఆతర్వాత సినిమా విడుదలయ్యాక తెలంగాణ రైట్స్ రూపంలో మరో 100 కోట్లు తన ఎకౌంట్ లో పడబోతున్నాయి. కాని ఇంతవరకు రెబల్ స్టార్ రేంజ్ లో 350 కోట్లు రీచ్ కాలేదు. అదే హిందీ మూవీతో సాధ్యం కాబోతోంది. బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా ఇచ్చిన మూడో ఆఫర్ లో 350 కోట్ల పారితోషికం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది.. అదేంటో చూసేయండి.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి ఒకటి కాదు రెండు కాదు, హిందీ నుంచి మూడు ఆఫర్లు ఉన్నాయి. ఆల్రెడీ అందులో వార్ 2 మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తైంది. పెండింగ్ సాంగ్ షూటింగ్ కూడాపూర్తైంది. కాని లాస్ట్ 30 సెకన్ల షూటింగ్ టైంలో హ్రితిక్ రోషన్ కి గాయం వల్ల రెండు నెలల తర్వాతే ఆ 30సెకన్ల డాన్స్ మూమెంట్స్ షూట్ చేస్తారట.ఇది కాకుండా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ చేసే పఠాన్ సీక్వెల్ పఠాన్ 2 లో కనిపించబోతున్నాడు తారక్. అది గెస్ట్ రోల్ కే పరిమితం కావొచ్చు కాని, నిడివి పెద్దదే అని తెలుస్తోంది. మొత్తంగా ఈరెండు ఎన్టీఆర్ కి పెద్ద విషయాలేం కాదు. అసలు సెన్సేషన్ ఏదైనా ఉందంటే, అది ఈ రెండు మూవీలు నిర్మించే యష్ రాజ్ బ్యానర్ లో, ఆ బ్యానర్ నిర్మాత ఆదిత్య చోప్రా ప్లాన్ చేసిన మూడో మూవీనే.

పూర్తిగా సోలో హీరోగా అది హిందీలో మాస్ యాక్షన్ డ్రామా చేయబోతున్నాడు తారక్. స్టోరీ లైన్ కూడా నచ్చటం, ఏకంగా రెమ్యునరేషన్ ఫిక్స్ అవటం కూడా జరిగింది. వార్2 రషెస్ చూసిన ఆదిత్య చోప్రా ఎన్టీఆర్ కి ఫిదా అయ్యే ఇలా సోలోగా హిందీలో సినిమా ప్లాన్ చేస్తున్నాడన్న వార్త నెల క్రితం సెన్సేషనైంది. ఇప్పుడు కొత్త అప్ డేట్ ఏంటంటే, ఈమూవీకి ఏకంగా 350 కోట్ల వరకు పారితోషికంగా అందుకోబోతున్నాడు తారక్.ఇంతవరకు ఓ తెలుగు హీరో తెలుగులో చేస్తున్నపాన్ ఇండియా మూవీకి 100 కోట్ల నుంచి 500 కోట్ల వరకు తీసుకోవటం చూశాం… ప్రభాస్ అలా స్పిరిట్ కి 500 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడు. ఆ ఎమౌంట్ తో పోలిస్తే ఎన్టీఆర్ అందుకునే 350 కోట్ల రెమ్యూనరేషన్ 150 కోట్లు తక్కువ…అయినా దానికంటే ఎన్టీఆర్ దే రికార్డని తేలుతోంది.

ఎందుకంటే, ఖాన్లు, కపూర్లు, ఎవరూ ఇంతవరకు 300 కోట్ల పారితోషికం అందుకోలేదు. అలాంటి బాలీవుడ్ లో ఒక తెలుగు హీరో 350 కోట్లు రెమ్యునరేషన్ గా పొందటం అంటే అది హిస్టారికల్ షాకే… ప్రభాస్ కూడా ఇంతవరకు ఆదిపురుష్ లాంటి హిందీ మూవీ చేసినా 200 కోట్లే అక్కడ అందుకున్నాడు. 500 కోట్ల పారితోషికం స్పిరిట్ మూవీకి అందుకుంటున్నాడు.. ఇదిబైలింగువల్ మూవీనే కాని, ఎక్స్ క్లూజివ్ గా హిందీ సినిమా కాదు..సో దేవరకి 250 కోట్లు అందుకున్న ఎన్టీఆర్, డ్రాగన్ మూవీకి 300 కోట్ల వరకు పారితోషికంగా తీసుకోబోతున్నాడు. అలా చూసినా కెరీర్ లోనే బిగ్గెస్ట్ నెంబర్ 350 కోట్లు.. అది ఓ హిందీ మూవీనుంచి తనకి దక్కడం అంటే ఇట్స్ హిస్టారికల్ రికార్డు…