ప్రభాస్ లాంటి కటౌట్లు 5గురే… ఇంకెవరికీ నో ఎంట్రీ…

పాన్ ఇండియా స్టాంప్ ముందు పడింది రెబల్ స్టార్ ప్రభాస్ మీదే.. ఇప్పటి వరకు ఈ ట్యాగ్ లైన్ సౌత్ నుంచి ఆరుగురంటే ఆరుగురికే దక్కింది. హిందీ హీరోల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఇప్పటి వరకు పాన్ ఇండియా హీరో అనిపించుకోలేకపోయారు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 6, 2025 | 09:00 PMLast Updated on: Mar 06, 2025 | 9:00 PM

Only 5 Cutouts Like Prabhas No Entry For Anyone Else

పాన్ ఇండియా స్టాంప్ ముందు పడింది రెబల్ స్టార్ ప్రభాస్ మీదే.. ఇప్పటి వరకు ఈ ట్యాగ్ లైన్ సౌత్ నుంచి ఆరుగురంటే ఆరుగురికే దక్కింది. హిందీ హీరోల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఇప్పటి వరకు పాన్ ఇండియా హీరో అనిపించుకోలేకపోయారు. ఆరేంజ్ హిట్ పడలేదు. పడ్డా నార్త్ లో తప్ప సౌత్ లో వాళ్ళ కంత సీన్ లేదు. టాలీవుడ్ నుంచి ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, శాండిల్ వుడ్ నుంచి యష్ కి మాత్రమే ఆరేంజ్ పాన్ ఇండియా మార్కెట్ వచ్చింది.ఇప్పుడు సీన్ లోకి సూపర్ స్టార్ మహేశ్ బాబు వచ్చాడు. తను ఏకంగా పాన్ వరల్డ్ స్టార్ గా మారబోతున్నాడు. సో రాజమౌళి తీస్తున్న సినిమా విడుదలైతే, ఎలాగూ మహేశ్ బాబు పేరు గ్లోబల్ గా మారుమోగే ఛాన్స్ ఉంది. సో ఇండియా మొత్తానికి పాన్ ఇండియా హీరోలంటే ఈ ఆరుగురేనా? మరో స్టార్ కి సీన్ లేదా? విజయ్ దేవర కొండ పాన్ ఇండియ ఆశలు ఆవిరైనట్టేనా? టేకేలుక్

సూపర్ స్టార్ మహేశ్ బాబు పాన్ వరల్డ్ మార్కెట్ ని షేక్ చేయబోతున్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో సినిమా కాబట్టి, ఈజీగా పాన్ ఇండియా హీరో ఏముంది, గ్లోబల్ స్టార్ గా కూడా మహేశ్ పేరు మారుమోగొచ్చు… సో అలా చూస్తే తనతో కలిపి పాన్ ఇండియా హీరోలుగా జెండాపాతిన, పాతబోతున్న హీరోలు లెక్కేస్తే ఆరుగురు.అందులో ఐదుగురు తెలుగు హీరోలే. ఒక్కడు మాత్రం శాండిల్ వుడ్ స్టార్ యష్. కేజీయఫ్ రెండు భాగాలతో పాన్ ఇండియాని షేక్ చేసిన తను, టాక్సిక్ తో హ్యాట్రిక్ కోసం ఎటాక్ చేయబోతున్నాడు. ఇవన్నీ అందరికి తెలిసినవే.. కాకపోతే పాన్ ఇండియా హీరోలంటే రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, అలానే చరణ్, బన్నీనేనా?

ఇంకెవరు మళ్లీ పాన్ ఇండియా మార్కెట్ ని దున్నేసే సాహసం చేయట్లేదా? చేతకావట్లేదా..? బాలీవుడ్ లో అయినా ఖాన్లూ, కపూర్లు ఎవరూ కూడా పాన్ ఇండియాని షేక్ చేయలేదు. షారుక్ రెండు సార్లు వెయ్యికోట్ల వసూల్లు రాబట్టే సినిమాలు తీసినా, సౌత్ లో జెండా పాతలేకపోయాడు.యానిమల్ కూడా హిందీలో ఆడినంతగా తెలుగులో వెలగలేదు. మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో అంత సీన్ లేదు. కనీసం కోలీవు్డ సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ అయినా అరవ అద్రుష్టం మారుస్తారంటే, వాల్లు ఔట్ డేట్ అయ్యారు. సౌత్ లో వాళ్ల సినిమా ఆడటమే ఎక్కువ. ఇక పాన్ ఇండియాని షేక్ చేస్తారనుకోలేం.

తమిల్ దళపతి విజయ్ స్వింగ్ లో ఉన్నప్పుడే పాన్ ఇండియాని షేక్ చేయలేదు. ఇప్పుడు పాలిటిక్స్ లోకెళ్లాడు కాబట్టి ఇక తనకా సీన్ లేదు. సూర్య, అజిత్ కి సౌత్ మొత్తాన్ని షేక్ చేసే సత్తానే ఇంతవరకు సొంతం కాలేదు.మాలీవుడ్ లో ఏ హీరోకి కూడా అంత సీన్ ఉన్నట్టు కనిపించలేదు. సో చరణ్, బన్నీ, తారక్ , ప్రభాస్, అలానే యష్ మాత్రమే పాన్ ఇండియాని ఏలారు. ఇంకా ఏలగలుగుతారనే క్రెడిబిలిటీని సొంతం చేసుకన్నారు.రాజమౌలి మూవీ పుణ్యమాని మహేశ్ బాబు కి కూడా పాన్ ఇండియాతో పాటు, గ్లోబల్ ఇమేజ్ కూడా దక్కేలాఉంది. ఏదో మాయ జరిగి అర్జున్ రెడ్డి లాంటి మరో హిట్ పడితే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకూడా పాన్ ఇండియా హీరో అయ్యే ఛాన్స్ ఉంది. అలా జరిగినా పాన్ ఇండియా ఏడు దిగ్గజాల్లో అష్టదిగ్గజాలు మొత్తం మన తెలుగు గడ్డమీదనుంచి వచ్చినట్టే అవుతుంది. సో పాన్ ఇండియా మార్కెట్ లో మొత్తం డామినేషన్ అంతా తెలుగు వాళ్లదే అని తేలిపోయింది.