టాలీవుడ్ లో ఒక్కడే, ప్రభాస్ తో కూడా కాలేదు, సెంటిమెంట్ దాటి దేవర 200 కోట్లు

దేవర సినిమాతో ఇప్పుడు టాలీవుడ్ కు రికార్డులు బద్దలు కొట్టడం ఎలాగో నేర్పాడు ఎన్టీఆర్. సినిమాలు విడుదల చేయడం కాదు టాక్ ఆఫ్ ది టౌన్ చేసే దమ్ము ఉండాలని ప్రూవ్ చేసాడు. ఎవడు ఎన్ని విధాలుగా నెగటివ్ తో దెబ్బ కొట్టాలని చూసినా మనలో దమ్ము ఉంటే టికెట్ లు తెగడం పెద్ద మేటర్ కాదు అని దేవరతో పక్కా క్లారిటీ ఇచ్చేసాడు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 5, 2024 | 05:18 PMLast Updated on: Oct 05, 2024 | 5:18 PM

Only One In Tollywood Not Even With Prabhas Devara Is 200 Crores Beyond Sentiment

దేవర సినిమాతో ఇప్పుడు టాలీవుడ్ కు రికార్డులు బద్దలు కొట్టడం ఎలాగో నేర్పాడు ఎన్టీఆర్. సినిమాలు విడుదల చేయడం కాదు టాక్ ఆఫ్ ది టౌన్ చేసే దమ్ము ఉండాలని ప్రూవ్ చేసాడు. ఎవడు ఎన్ని విధాలుగా నెగటివ్ తో దెబ్బ కొట్టాలని చూసినా మనలో దమ్ము ఉంటే టికెట్ లు తెగడం పెద్ద మేటర్ కాదు అని దేవరతో పక్కా క్లారిటీ ఇచ్చేసాడు బుడ్డోడు. ఇప్పుడు ఎన్టీఆర్ కు టాలీవుడ్ లో ఇమేజ్ ఓ రేంజ్ లో పెరిగింది. బాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ కు కొత్త మార్కెట్ క్రియేట్ అయింది. ముఖ్యంగా జనాల్లో ఉన్న ఓ సెంటిమెంట్ ని తోక్కిపెట్టాడు ఎన్టీఆర్.

సినిమా సినిమాకు తన దమ్ము ఏంటో చూపిస్తూ వెళ్తున్న తారక్… దేవరను ఫ్లాప్ టాక్ నుంచి బయటకు లాగాడు. ఇక రాజమౌళి తో తర్వాతి సినిమా ఫ్లాప్ అనే టాక్ నుంచి టాలీవుడ్ హీరోలను బయటకు లాగాడు. అగ్ర హీరోలు అందరూ రాజమౌళి దెబ్బకు భయపడిన పరిస్థితి ఉంది. ప్రభాస్, రామ్ చరణ్, రవితేజాతో పాటుగా చిన్న హీరోలు అందరూ రాజమౌళి సినిమాల దెబ్బకు వణికారు. కాని ఎన్టీఆర్ మాత్రం దేవర సినిమాతో తాను ఏం చేయగలనో చేసి చూపించాడు. ఇప్పుడు ఇక మరో రికార్డ్ ని రాజమౌళితో సినిమా తర్వాత తన ఖాతాలో వేసుకున్నాడు.

రాజమౌళి తో సినిమా చేసిన తర్వాత ఏ హీరోకి మొదటి వారం 200 కోట్లు షేర్ రాలేదు. సినిమా విడుదల అయిన రెండు మూడు రోజుల్లో చాలా థియేటర్ లు ఎత్తేసిన పరిస్థితి. ఇప్పుడు రాజమౌళి కర్స్ ని బ్రేక్ చేసి… మొదటి వారం 200 కోట్లు షేర్ రాబట్టింది దేవర. అది కూడా సినిమా డివైడ్ టాక్ తో సాధించింది. ప్రభాస్, రామ్ చరణ్ ఎవరికీ ఇది సాధ్యం కాలేదు. దీనితో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్ కు సాధ్యం కాని రికార్డ్ ను ఎన్టీఆర్ సొంతం చేసుకోవడం చూసి షాక్ అవుతున్నారు.