Open Hymer: బాంబు అమెరికాది.. కనిపెట్టింది వాళ్లే.. మరి మనోళ్ల ఓవరాక్షన్ దేనికి..?
ఓపెన్ హైమర్ ఈ హాలీవుడ్ మూవీ శుక్రవారం వరల్డ్ వైడ్ గా రాబోతోంది.ఈ సినిమా కోసం ఇక్కడి జనం చేస్తున్న హంగామాని చూస్తే ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్న సామెత సరిగ్గా సూటవుతుంది.

Open Hymer Movie Release On Friday At Theators
కాకపోతే డాగ్స్ తో పోలికే కాస్త ఇబ్బందిగా ఉన్నా, అమెరికా మూవీకి అదేదో, ఇండియన్ సినిమా కోసం ఈగర్ గా వేయిట్ చేస్తున్నట్టు మనదేశం లో చాలా మంది వేయిట్ చేయటమే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఓపెన్ హైమర్ అంటే ప్రపంచానికి ఆటంబాంబుని పరిచయం చేసిన అమెరికా సైంటిస్ట్. తన బయోపిక్కే ఓపెన్ హైమర్ మూవీ. అంతా బానే ఉంది. బాంబేమో అమెరికాది, తయారు చేసింది జర్మన్ మూలాలున్న అమెరికన్ సైంటిస్ట.. ఇక తన బయోపిక్ తీసింది హాలీవుడ్ డైరెక్టర్.. సో మనకేంటి సంబంధం అంటే, అక్కడే ఉంది అసలు ట్విస్ట్.
భగవధ్గీత చదవందే ఓపెన్ హైమర్ కి రోజు గడవదు.. అందుకే ఆటంబాంబు టెస్ట్ చేశాక ఓ వీడియోలో కూడా భగవధ్గీతలోని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన గీతాసారాన్నే కోట్ చేశాడు ఓపెన్ హైమర్.. అదే కోట్ ని తన బయోపిక్ లో హీరో కూడా చేశాడట. అలా మనకు ఈ సినమాతో భారీగా కనెక్షన్ ఏర్పడటం, క్రిస్టోఫర్ నోలాన్ సినిమాలన్నీంటికి ఇండియాలో భారీగా మార్కెట్ ఉండటంతో, అడ్వాన్స్ బుక్కింగ్స్ పేలిపోతున్నాయి. ఫస్ట్ డే 40 కోట్ల కలెక్షన్స్ కి ఛాన్స్ ఉందని తెలుస్తోంది.