Keshav : నోరు విప్పిన కేశవ… పుష్ప-2 కు కష్టాలు తప్పవా..?
పుష్ప ది రైజ్ సినిమాలో కేశవగా నటించి మెప్పించి.. మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు జగదీష్.. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.. జగదీష్‌ను ఇటీవలే పోలీసులు ఒక అమ్మాయి ఆత్మహత్య కేసులో అరెస్ట్ చేశారు..

Open-mouthed Keshav...Is Pushpa-2 going through trouble?
పుష్ప ది రైజ్ సినిమాలో కేశవగా నటించి మెప్పించి.. మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు జగదీష్.. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.. జగదీష్‌ను ఇటీవలే పోలీసులు ఒక అమ్మాయి ఆత్మహత్య కేసులో అరెస్ట్ చేశారు. అయితే.. ఆ యువతిని దారిలోకి తెచ్చుకోవడానికే ఆమెను బెదిరించినట్లు జగదీష్ ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మరణించిన అమ్మాయి తండ్రి, తన కూతురు చనిపోవడానికి జగదీశ్ కారణమని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు జగదీష్‌ను అరెస్ట్ చేశారు.. జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పటి నుంచి ఆ యువతీతో సన్నిహితంగా ఉన్న జగదీష్.. పుష్ప సినిమాతో క్రేజ్ రావడంతో ఆమెను దూరం పెట్టాడు.. ఆ అమ్మాయి ఇది తట్టుకోలేక వేరొక అబ్బాయితో సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టింది. ఇది భరించలేకపోయిన జగదీశ్… గత నెల 27న యువతి ఇంటికి వెళ్లి, అబ్బాయితో ఆమె సన్నిహితంగా ఉన్న ఫొటోలు తీశాడు. వాటిని ఆమెకు పంపి తన మాట వినకుంటే సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు..
దీంతో.. భయపడిన ఆ యువతి గత నెల 29న ఉరి వేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది.. ఆ అమ్మాయి దూరం కావడంతో.. తిరిగి తనకు దగ్గరయ్యేందుకే ఆమెను బ్లాక్ మెయిల్ చేసినట్లు జగదీష్ పోలీసుల విచారణలో నిజం ఒప్పేసుకున్నాడట.. అయితే.. ఇప్పుడు జగదీష్ అరెస్ట్ కాస్తా పుష్ష-2 మేకర్స్‌ని ఇరకాటంలో పడేసింది.. జగదీష్ అరెస్ట్‌తో పుష్ఫ-2 షూట్‌కి అంతరాయం ఏర్పడింది.. దీంతో.. జగదీష్‌ను బెయిల్ మీద రప్పించేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు..ఈ టైంలో జగదీష్ తప్పు అంగీకరించడంతో..పుష్ష-2కు కష్టాలు తప్పవన్న టాక్ నడుస్తోంది.