operation-valentine -review : వరుణ్ కుమ్మేశాడు భయ్యా…!
ప్రయోగాల హీరోగా ప్రేక్షకులలో ముద్ర పడిన మెగా ప్రిన్స్ (Mega Prince) వరుణ్ తేజ్ ఈ రోజు ఆపరేషన్ వాలెంటైన్ (operation-valentine) అంటు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత కొంత కాలంగా ఆయనకీ సరైన హిట్ లేదు. వరుసగా గని, గాండీవదారి అర్జున్ లు డిజాస్టర్స్ గా నిలిచాయి. మరి ఇప్పుడొచ్చిన ఆపరేషన్ వాలెంటైన్ ఎలా ఉందో చూద్దాం.
ప్రయోగాల హీరోగా ప్రేక్షకులలో ముద్ర పడిన మెగా ప్రిన్స్ (Mega Prince) వరుణ్ తేజ్ ఈ రోజు ఆపరేషన్ వాలెంటైన్ (operation-valentine) అంటు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత కొంత కాలంగా ఆయనకీ సరైన హిట్ లేదు. వరుసగా గని, గాండీవదారి అర్జున్ లు డిజాస్టర్స్ గా నిలిచాయి. మరి ఇప్పుడొచ్చిన ఆపరేషన్ వాలెంటైన్ ఎలా ఉందో చూద్దాం.
అర్జున్ దేవ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (Indian, Air Force) లో వింగ్ కమాండర్ గా చేస్తుంటాడు. దేశభక్తి మెండుగా ఉండటంతో పాటు ఆవేశాన్ని కూడా కలిగి ఉంటాడు. తన వైఫ్ ఆహ్నా గిల్ కూడా అర్జున్ తో పాటే ఎయిర్ ఫోర్స్ లోనే ఒక కీలకమైన పోస్ట్ లో వర్క్ చేస్తుంటుంది. శత్రువులని ఎదుర్కోవడానికి ఆవేశం పనికి రాదని ఎప్పటికపుడు అర్జున్ కి సజిషన్ ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే వజ్ర అనే ఒక మిషన్ ని అర్జున్ వాడకుండా అడ్డుపడుతుంటుంది. ఒకసారి పాకిస్థాన్ తీవ్రవాదులు ఆ దేశ ఆర్మీ సహకారంతో ఇండియన్ ఆర్మీకి చెందిన సైనిక స్థావరం మీద మానవ బాంబు దాడి జరుపుతారు.
దీంతో చాలా మంది సైనికులు చనిపోతారు. ప్రతీకారంగా అర్జున్ నేతృత్వంలో పాకిస్తాన్‌లో సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇండియాలో ఉన్న ఒక కీలకమైన వ్యక్తిని చంపడానికి పాకిస్థాన్ ఆర్మీ ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది. పాకిస్థాన్ చంపాలనుకుంటున్న ఆ కీలక వ్యక్తి ఎవరు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆ విషయాన్ని ఎలా కనిపెట్టింది.. సర్జికల్స్ స్ట్రైక్ తర్వాత పాకిస్థాన్ అసలు ఏం చేసింది… తమ ద్వారా దేశానికి రాబోతున్న ప్రాబ్లంని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా ఆపగలిగింది.. అసలు వజ్ర మిషన్ ఏంటి.. వజ్ర మిషన్ కి ఇప్పుడున్న ప్రాబ్లం కి ఏమైనా సంబంధం ఉందా? అలాగే ఆపరేషన్ వాలెంటైన్ అంటే ఏంటి ? తదితర ప్రశ్నల సమూహారమే ఈ చిత్ర కథ
పర్పామెన్స్ విషయానికి వస్తే…
వరుణ్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. నటన విషయంలో ఆయన నుంచి ఎలాంటి రిమార్క్ లేదు.చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ లో కూడా అధ్బుతంగా చేసాడు. కాకపోతే సినిమా మొత్తం ఒకే టైప్ ఆఫ్ యాక్టింగ్ చేసినట్టుగా ఉంది. ఇక హీరోయిన్ మానుషీ చిల్లర్ విషయానికి వస్తే రాడార్ సజిషన్స్ ఇచ్చే ఆఫీసర్ గా, వరుణ్ వైఫ్ గా సూపర్ గా చేసింది. అలాగే ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా చేసిన శతఫ్ ఫిగర్ తో పాటు మిగతా పాత్రల్లో కనిపించిన రుహళీ శర్మ, సంపత్ లు కూడా చాలా బాగా చేసారు. నవదీప్ ప్రత్యేకంగా చెయ్యడానికి ఏమి లేదు.
సాంకేతిక విభాగం..
ఇక దర్శకుడు గురించి ఎక్కువగా చెప్పుకోవాల్సిన పని లేదు. వచ్చిన క్రెడిట్ కాస్తా సిజి వర్క్ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా మెరువులు కూడా ఏమి లేవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సో సో గానే ఉంది. ఫొటోగ్రఫీ అండ్ నిర్మాణ విలువలు మాత్రం చాలా బాగున్నాయి. ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఈ సినిమా దర్శకుడు అందులో నటించిన నటులతో పాటు ప్రేక్షకులని కూడా మోసం చేసాడు కాకపోతే దైవ భక్తి సినిమా అయినా దేశ భక్తి సినిమా అయినా కథ కథనాలు ఉండాలనే నిజాన్ని మరో సారి చాటి చెప్పాడు. మొత్తానికి యావరేజ్ టాక్ తో దూసుకుపోతోంది